Isreal: ఇజ్రాయిల్ మాజీ ప్రధాని మంత్రి సమాధానానికి మండిపడ్డ యాంకర్

లెబనాన్, ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో, ఇజ్రాయెల్ స్థానాలపై పెద్ద సంఖ్యలో ఫిరంగిల్లు, గైడెడ్ క్షిపణుల ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. హమాస్(Hamas) ప్రారంభించిన దాడికి సంఘీభావంగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. గాజా(Gaza) నగరాలపై హమాస్(Hamas) దాడి తరువాత, గాజా స్ట్రిప్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలన్న ఇజ్రాయెల్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, మాజీ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్ తమ దేశం నిజానికి నాజీలతో పోరాడుతుందని, కానీ శత్రువులను పోషించడంలేదని అన్నారు. ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి […]

Share:

లెబనాన్, ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో, ఇజ్రాయెల్ స్థానాలపై పెద్ద సంఖ్యలో ఫిరంగిల్లు, గైడెడ్ క్షిపణుల ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. హమాస్(Hamas) ప్రారంభించిన దాడికి సంఘీభావంగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. గాజా(Gaza) నగరాలపై హమాస్(Hamas) దాడి తరువాత, గాజా స్ట్రిప్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలన్న ఇజ్రాయెల్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, మాజీ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్ తమ దేశం నిజానికి నాజీలతో పోరాడుతుందని, కానీ శత్రువులను పోషించడంలేదని అన్నారు.

ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి సమాధానం: 

దశాబ్దాలుగా జరుగుతున్న సంఘర్షణ రక్తపాతంగా మారుతుంది.. కారణంగా హమాస్(Hamas) భారీ రాకెట్లతో దాడిని చేపట్టింది, నివేదికలు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఎంతో మంది ఇజ్రాయెల్‌ వాసులు చనిపోగా సుమారు, 3,000 మందికి పైగా గాయపడ్డాయని పేర్కొంది. తీరప్రాంత ఎన్‌క్లేవ్‌పై తీవ్రమైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కారణంగా, పాలస్తీనియన్ల మరణాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది, వేలాది మంది గాయపడ్డారని గాజా(Gaza) అధికారులు తెలిపారు. గాజా(Gaza) ప్రాంతాన్ని నియంత్రించే, హమాస్(Hamas) దాడిలో 1,200 మంది ఇజ్రాయెల్ ప్రాణాలు బలిగొన్న తర్వాత, ఇజ్రాయెల్ క్రూరమైన ఎదురుదాడికి దిగింది. దాని ప్రతీకారంలో భాగంగా, బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం,  గాజా(Gaza) స్ట్రిప్ని ముట్టడి చేసింది, విద్యుత్, నీరు మరియు ఆహార సరఫరాలను నిలిపివేసింది.

స్కైన్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మాజీ ప్రధానమంత్రి (Prime minister) బెన్నెట్‌ను గాజా(Gaza) స్ట్రిప్‌లోని హెల్త్‌కేర్ సదుపాయాలపై పవర్ కట్ ఎలా దెబ్బతిందని, అందులో లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లు, అప్పుడే పుట్టిన పిల్లల కోసం ఇంక్యుబేటర్‌ల గురించి ఒక ప్రశ్న అడిగారు. బెన్నెట్ జూన్ 2021- జూన్ 2022 మధ్య ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా తమ విధులను నిర్వర్తించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో మాజీ కమాండో, హమాస్(Hamas) దాడి యుద్ధానికి దారితీసిన తర్వాత ఫ్రంట్‌లైన్‌లో రిజర్వ్ డ్యూటీలో చేరాడు ఇజ్రాయిల్(Israel) మాజీ ప్రధానమంత్రి(Prime minister).

ఆవేశంగా స్పందించిన ఇజ్రాయెల్ మాజీ ప్రధాని, మీరు సీరియస్‌గా ఈ ప్రశ్న అడుగుతున్నారా అంటూ, మీరు పాలస్తీనా పౌరుల గురించి నన్ను అడుగుతూనే ఉన్నారని.. తమకి ఏమైందని.. ఏమి జరిగిందో మీరు చూడలేదా అంటూ.. నిజానికి నాజీలతో పోరాడుతున్నామని..తాము వారిని లక్ష్యంగా చేసుకోలేదని మాట్లాడారు. అంతేకాకుండా, టీవీ(Tv) యాంకర్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పిన ఇజ్రాయిల్(Israel) మాజీ ప్రధానమంత్రి(Prime minister) మీద మండిపడ్డాడు యాంకర్. నిజంగా ఇటువంటి సమాధానాలు ఇవ్వడం సిగ్గు కరం అంటూ, తను జరుగుతున్న పరిస్థితులు గురించి ప్రశ్నలు అడుగుతుంటే, అరుస్తూ సమాధానం ఇవ్వడం నిజంగా మంచి విషయం కాదని మాట్లాడాడు టీవీ(Tv) యాంకర్. 

Read More: Operation Ajay: ఇజ్రాయిల్ లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక ఫ్లైట్

యుద్ధ ఛాయలు: 

అసలు అక్కడ ఏం జరుగుతుందో తనకి క్లియర్గా తెలియడానికి తను మిలటరీలో లేనని, తను ఒక సాధారణ జర్నలిస్టుగా జరుగుతున్న విషయాల గురించి, ఘోరమైన యుద్ధం గురించి ప్రశ్నలు అడుగుతున్నానని మరొకసారి గుర్తు చేశాడు టీవీ(Tv) యాంకర్. అంతేకాకుండా అమాయక ప్రజలను వారం రోజుల నుంచి క్రూరంగా చంపుతున్న క్రమం కనిపిస్తోందని, దీని గురించి మీరు ఎలా స్పందిస్తున్నారని.. టీవీ(Tv) యాంకర్ అడగగా.. తాము కేవలం హమ్మస్ మీద టార్గెట్ చేసామని, ఒకవేళ వాళ్ళు ఎదురు దాడికి దిగితే ఎవరైనా ఊరుకోకుండా తిరిగి దాడి చేస్తారు కదా.. ఆ విధంగానే ఇప్పుడు జరుగుతుందని, సమాధానం ఇచ్చారు ఇజ్రాయిల్(Israel) మాజీ ప్రధానమంత్రి(Prime minister).

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా యుక్రేన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్- హమ్మస్ మధ్య అనుకోని రీతిగా యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం జరుగుతున్న సమయన సుమారు 5,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్(Israel) వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్ షేర్ చేయడం జరిగింది. ఇజ్రాయిల్(Israel) ఆకస్మిక దాడి వెనుక ఉన్న హమ్మస్ కమాండర్ ఉన్నట్లు తెలుస్తోంది.