ప్రపంచంలోకెల్లా అతి పొడవైన ఈ నడకదారిని పూర్తి చేయడం మానవ మాత్రుల వల్ల కాదు!

ప్రపంచంలోనే అత్యంత పొడవైన నడక మార్గం ఈ విశాలమైన గ్రహంపై మానవులు ఇంకా అన్వేషించని అనేక ప్రదేశాలు ఉన్నాయి. భూమి చాలా పెద్దది. దీనిలో అనేక సాహసాలు దాక్కొని ఉన్నాయి. చాలా మంది తరచూ, సుదూర ప్రాంతాలకు వెళుతుంటారు. కానీ ఒక సుదూర ప్రదేశాన్ని..  మానవుడు ఇంకా అంచనా వేయలేదు. దాని అంతు చూడటానికి ప్రయత్నించలేదు. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుండి రష్యా తూర్పు వైపున ఉన్న మగడాన్ ఓడరేవు పట్టణం వరకు నడవగలిగే అతి పొడవైన […]

Share:

ప్రపంచంలోనే అత్యంత పొడవైన నడక మార్గం


ఈ విశాలమైన గ్రహంపై మానవులు ఇంకా అన్వేషించని అనేక ప్రదేశాలు ఉన్నాయి. భూమి చాలా పెద్దది. దీనిలో అనేక సాహసాలు దాక్కొని ఉన్నాయి. చాలా మంది తరచూ, సుదూర ప్రాంతాలకు వెళుతుంటారు. కానీ ఒక సుదూర ప్రదేశాన్ని..  మానవుడు ఇంకా అంచనా వేయలేదు. దాని అంతు చూడటానికి ప్రయత్నించలేదు. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుండి రష్యా తూర్పు వైపున ఉన్న మగడాన్ ఓడరేవు పట్టణం వరకు నడవగలిగే అతి పొడవైన దారిలో ఇంకా ఎవ్వరూ నడిచి వెళ్ళలేదు. ఇంత సుదీర్ఘ నడకలో ఏ మానవుడూ వెళ్ళలేదు.

ఈ రెండు గమ్యస్థానాల మధ్య దూరం 22,387 కి.మీ. ప్రయాణికులకు విమానాలు, పడవలు లేదా వాహనాలు వాడవలసిన అవసరం లేని విధంగా ఇది చక్కగా తయారయ్యి క్యూరేట్ చేయబడింది. ఈ మార్గంలో అన్నీ రోడ్లు, వంతెనలే.  ప్రయాణీకులు ఆఫ్రికా మీదుగా ప్రయాణించి, టర్కీ, మధ్య ఆసియా మీదుగా సూయజ్ కెనాల్ దాటి రష్యాలోని సైబీరియాకు చేరుకోవచ్చు. ఈ ప్రాంతాలే కాదు, అన్ని సీజన్‌లు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే.. ప్రయాణికులు 17 దేశాలు, ఆరు టైమ్ జోన్స్ దాటుతారు.

విరామం లేకుండా నిరంతరంగా నడిస్తే, మొత్తం 4,492 గంటలలో 187 రోజుల్లో 17 దేశాలు.. ఆరు టైమ్ జోన్స్ దాటుకుంటూ నడకను పూర్తి చేయవచ్చు. అయితే, రోజుకు 8 గంటలు నడిస్తే గనక, ఈ నడక పూర్తి కావడానికి 562 రోజులు పడుతుంది. మొత్తం మీద.. ఒక మనిషి ఈ దారంతా నడుస్తూ పాదయాత్ర పూర్తి చేయడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. ఈ అతి పొడవాటి రహదారి ప్రయాణం చేయడమంటే ఎవరెస్ట్ పర్వతం పైకి 13సార్లు  ఎక్కి క్రిందికి దిగినంత దూరం అన్నమాట. 

ఇది ఆసక్తికరంగా అనిపించినా, ఇప్పటి వరకు, ఏ మానవుడూ అలాంటి ప్రయాణాలకు సాహసించలేదు. ఈ నడక కొంచెం ప్రమాదకరమైనది. ఎందుకంటే, ఈ దారిలోని కొన్ని ప్రాంతాలు ప్రపంచంలోని వివాదాస్పద ప్రాంతాల క్రిందకు వస్తాయి. ఇది మాత్రమే కాదు, ఇక్కడ వీసా పరిమితి కూడా ప్రధాన అడ్డంకి అవుతుంది. ఈ ప్రయాణం చేసే వ్యక్తికి 17 దేశాల వీసాలు ఉండాలి. అది సంపాదించడం చాలా కష్టం. అంతే కాకుండా ఈ దారిలోని 17 దేశాలలో 17 రకాల ఉష్ణోగ్రతలు ఉంటాయి. అంతే కాకుండా ఒకే దేశంలో కూడా ప్రాంతానికీ ప్రాంతానికీ ఉష్ణోగ్రతలు మారతాయి. దీనికి తోడు మారే వాతావరణం కూడా ఉంటుంది. వర్షాలు, చలి, ఎండలను తట్టుకుంటూ ఈ ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎవరైనా యాత్రికుడు ఈ యాత్ర చేయాలంటే మారుతున్న ఉష్ణోగ్రతలకు ఎదుర్కొని నిలబటానికి అవసరమైనంత మంచి రోగనిరోధక శక్తి, బలం, శరీర దారుఢ్యం చాలా అవసరం.  

ఈ మార్గాన్ని ఒక రెడిట్ కస్టమర్ చాలా కాలం రోజుల క్రితం, ‘ది పొటెన్షియల్ లాంగెస్ట్ వాకబుల్ రోడ్’  అని షేర్ చేసారు. అప్పట్లో ఆ పోస్ట్ చాలా వైరల్ అయింది.