అగ్ర రాజ్యానికి ఆర్థిక మాంద్యం తప్పదా..?

గత సంవత్సరం నుంచి కూడా అగ్రరాజ్యంలో ఆర్థిక మాంద్యం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది తమ ఉద్యోగాలు కోల్పోయిన సంఘటనలు కనిపించాయి. మళ్లీ వచ్చే సంవత్సరం కూడా ఇప్పటికన్నా దారుణమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు లేకపోలేదని, ఆర్థిక మాంద్యం కుదేలుపడడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. మరి మన భారతదేశం మీద ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలు తెలుసుకుందాం..  అగ్ర రాజ్యానికి ఆర్థిక మాంద్యం తప్పదా..?  వచ్చే ఏడాది మధ్య […]

Share:

గత సంవత్సరం నుంచి కూడా అగ్రరాజ్యంలో ఆర్థిక మాంద్యం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది తమ ఉద్యోగాలు కోల్పోయిన సంఘటనలు కనిపించాయి. మళ్లీ వచ్చే సంవత్సరం కూడా ఇప్పటికన్నా దారుణమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు లేకపోలేదని, ఆర్థిక మాంద్యం కుదేలుపడడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. మరి మన భారతదేశం మీద ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలు తెలుసుకుందాం.. 

అగ్ర రాజ్యానికి ఆర్థిక మాంద్యం తప్పదా..? 

వచ్చే ఏడాది మధ్య నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం ఉందని, అది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (GDP)ని దెబ్బతీస్తుందని అగ్రశ్రేణి ఆర్థికవేత్త హెచ్చరిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ మరియు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ చైర్‌పర్సన్ అయిన నీలకంత్ మిశ్రా  మాట్లాడుతూ, చైనా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందని, అయితే కుప్పకూలదని పరిస్థితి అక్కడ ఉండకపోవచ్చు అని, మరోవైపు అమెరికా ఆర్థిక మాంద్యం చూసే అవకాశం ఉందని అన్నారు. రాబోయే 12-18 నెలల్లో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. 

ఈ సంవత్సరం మాంద్యం ఏర్పడే అవకాశం ఉంటుంది అనుకున్నప్పటికీ, ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకున్న.. మళ్లీ ఇప్పుడు ఆర్థిక లోటు గణనీయంగా పెరగడం ద్వారా.. మీ ఆర్థిక లోటు 5 శాతంగా ఉండాల్సిన సంవత్సరంలో, 8-9 శాతం ఆర్థిక లోటు ఉంటుందని.. మిశ్రా అన్నారు. అయితే ప్రస్తుతానికి ఆర్థిక లోటు కనిపించినప్పటికీ వచ్చే సంవత్సరం మధ్యలో గణనీయంగా రేట్లు పెరిగే అవకాశం ఉండడం వల్ల.. ఆర్థిక లోటు అనుకున్న దానికన్నా ఎక్కువ శాతం కనిపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారతదేశం ఆర్థిక వ్యవస్థకు 40 బేసిస్ పాయింట్లను అందిస్తున్నప్పటికీ, నిజానికి అది ప్రపంచ GDPలో ఎక్కువ భాగంగా కనిపించినప్పటికీ, ప్రపంచ GDPని అదుపు చేసే విధంగా ఉండకపోవచ్చని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. అయితే మరోవైపు US ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా మందగిస్తే , మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం లేకపోలేదని ఆర్థికవేత్తలు మరింత హెచ్చరిస్తున్నారు.

ఇండియా ఇంపాక్ట్:

ఆర్థికవ్యాప్త మిశ్రా మాట్లాడుతూ, అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ మందగిస్తే, అది నాలుగు విధాలుగా భారతదేశం మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని వెల్లడించారు. యుఎస్ మాంద్యం చూస్తుంటే.. IT సేవల పరిశ్రమ, వ్యాపార సేవల ఎగుమతులు దెబ్బతింటాయని.. భారతదేశ ఎగుమతుల్లో 10% సేవల ఎగుమతులు ఉన్నాయని.. ఇది కొనసాగితే మన GDP వృద్ధిలో 1% కోల్పోవచ్చు అని చెప్పుకొచ్చారు.

రెండవది వస్తువుల ఎగుమతులపై ప్రభావం తప్పకుండా ఉంటుందని. వస్తువుల డిమాండ్ తగ్గుతుందని ఆర్థికవేత్త చెప్పారు. భారతదేశంలో ఉత్పత్తులను డంపింగ్ అనేది పెద్ద ప్రమాదంగా మరే అవకాశం ఉంది అంటున్నారు. డిమాండ్ నిలకడగా ఉండే ఏకైక దేశంగా భారతదేశం ఉండగలిగితే, ప్రతి తయారీదారు ఇక్కడ నుంచి కొనుక్కునేందుకు మక్కువ చూపిస్తారని మిశ్రా సూచించారు. ఇది భారతీయ తయారీదారులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కూడా వెల్లడించారు.

చివరగా చూసుకుంటే, ఇతర ఆర్థిక వ్యవస్థలకు మూలధన వ్యయం పెరుగుతుందని.. భారతదేశంలోని ప్రసిద్ధ ఉక్కు కంపెనీల వంటి మంచి రుణగ్రహీతలు, డాలర్ రుణాలను సులభంగా పొందగలిగే అవకాశం ఉన్నప్పటికీ.. అలాంటి రుణాలు గత 6-8 నెలలుగా అందుబాటులో లేవని.. ఇది చాలా వరకు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని.. బాండ్ మార్కెట్లు మరియు ఈక్విటీ మార్కెట్ల వంటి ఫైనాన్షియల్ మార్కెట్లలో నిలకడ ఉండకపోవచ్చు అని, మరోవైపు చమురు ధరలు పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు ఆర్థికవేత్తలు. 

వీటన్నింటిని ఎదుర్కోవడానికి, భారతదేశం రిస్క్-టేకింగ్‌కు విరుద్ధంగా స్థూల ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టాలని మిశ్రా అన్నారు. స్థూల ఆర్థిక స్థిరత్వం అనేది తప్పకుండా దీర్ఘకాలిక వృద్ధిని అందిస్తుంది అని నొక్కి చెప్పారు.