ఎలోన్ మ‌స్క్ కూతురు ట్రాన్స్‌జెండ‌ర్ అట‌

జూన్ 2021లో, ఎలోన్ మస్క్ పిల్లలలో ఒకరైన జేవియర్ అలెగ్జాండర్ మస్క్, తన జెండర్ కి సరిపోయేలా తన పేరును మార్చుకునేందుకు ఒక అభ్యర్థనను దాఖలు చేశారు. అంతేకాకుండా తాను ఇకమీదట తన తండ్రి- ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ తో ఎటువంటి సంబంధం ఉండకూడదని భావిస్తున్నట్లు ఆమె స్పష్టం చేసింది. బుక్ ద్వారా వెల్లడి:  ఇప్పుడు, మస్క్ జీవిత చరిత్ర రచయిత వాల్టర్ ఐజాక్సన్ ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురించబడిన “ఎలోన్ మస్క్” అనే […]

Share:

జూన్ 2021లో, ఎలోన్ మస్క్ పిల్లలలో ఒకరైన జేవియర్ అలెగ్జాండర్ మస్క్, తన జెండర్ కి సరిపోయేలా తన పేరును మార్చుకునేందుకు ఒక అభ్యర్థనను దాఖలు చేశారు. అంతేకాకుండా తాను ఇకమీదట తన తండ్రి- ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ తో ఎటువంటి సంబంధం ఉండకూడదని భావిస్తున్నట్లు ఆమె స్పష్టం చేసింది.

బుక్ ద్వారా వెల్లడి: 

ఇప్పుడు, మస్క్ జీవిత చరిత్ర రచయిత వాల్టర్ ఐజాక్సన్ ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురించబడిన “ఎలోన్ మస్క్” అనే పుస్తకంలో భాగంగా, మస్క్ కుమార్తె తాను ట్రాన్స్ జెండర్ అనే నిజం గురించి తన అత్తకు మొబైల్ ద్వారా మెసేజ్ పంపించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ విషయం తన తండ్రికి తెలియకూడదని కూడా ఆమె ప్రస్తావించినట్లు బుక్ లో స్పష్టం చేశారు. నిజానికి ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ ట్రాన్స్ జెండర్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన కారణంగా, తన కూతురు నేరుగా తన తండ్రికి ఈ నిజం చెప్పలేక పోయిందని, అంతేకాకుండా ఈ నిజం తెలిసిన అనంతరం, తాను తన తండ్రి నుంచి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు, బుక్ ద్వారా ప్రస్తావించారు రచయిత. అంతేకాకుండా ఈ నిజం బయటపడిన అనంతరం ఎలోన్ మస్క్ కు వ్యతిరేకత ఎక్కువగా మారిందని కూడా చెప్పుకోవాలి.

స్కూల్ నా కుమార్తెను మార్చేసింది: 

ఆ ప్రచురింపబడిన పుస్తకం ప్రకారం, మస్క్ తన కుమార్తెను “కమ్యూనిస్ట్” అని పిలిచాడని.. అంతేకాకుండా కాలిఫోర్నియాలోని స్కూల్ ప్రభావం తన కూతురు మీద పడిందని.. ఆ కారణంగానే  ఆమె అతనితో తన సంబంధాన్ని తెంచుకుందని స్పష్టంగా రాశారు. ధనవంతులు చెడ్డవారని భావించేలా తన కూతురు చదివిన స్కూల్, ఆమెకు బ్రెయిన్ వాష్ చేసిందని ఎలోన్ మస్క్ భావించాడు. మస్క్, తను అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు, తనను చూసే విధానంలో మార్పుకు, క్రాస్‌రోడ్స్ స్కూల్ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌ కారణం అని కూడా పేర్కొన్నాడు. 

ఇది నిజంగా బాధాకరం: 

తన కుమార్తె నుండి విడిపోవడం తనకు చాలా బాధాకరమైన అనుభవం అని మస్క్ పంచుకున్నాడు. అంతేకాకుండా తన మరో బిడ్డ 10 వారాలకే చనిపోయినప్పుడు కలిగిన బాధకన్నా, తన బిడ్డ ఇప్పుడు తనను కాదని వెళ్లిపోవడం ఇంకా బాధాకరంగా ఉందని మస్క్ తన బాధను పంచుకున్నాడు. అయితే మరోపక్క, మస్క్ కూతురు తనకి దూరంగా వెళ్లిపోవడానికి, తన కూతురు చదివిన స్కూల్ లేదంటే కాలేజ్ కాదని, కేవలం మస్క్ కు ట్రాన్స్ జెండర్ల పట్ల ఉన్న చిన్న చూపు అని కొంతమంది భావిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే కొన్ని సందర్భాలలో మస్క్ ట్రాన్స్ జెండర్ల పట్ల ఎగతాళిగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. 

ఎలన్ మస్క్ గురించి మరింత: 

ఏప్రిల్ 14న, మస్క్, Twitter కంపెనీని కొనుగోలు చేస్తా అంటూ ఆఫర్‌ను ఇచ్చాడు, దీనికి ట్విట్టర్ బోర్డు ప్రారంభంలో ప్రతిస్పందిస్తూ ప్రతికూల భావంతో స్పందించింది, ఏప్రిల్ 25న మస్క్ చేసిన $44 బిలియన్ల కొనుగోలు ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించింది. ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్‌లను పరిచయం చేయడానికి, దాని అల్గారిథమ్‌లను ఓపెన్-సోర్స్ చేయడానికి, స్పామ్ అకౌంట్స్ ఎదుర్కోవడానికి కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Twitter ప్రైవేటీకరణ చేయడమే కాకుండా, X Corp అనే కొత్త సంస్థలో విలీనం అయింది. ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ తక్షణమే మునుపటి CEO పరాగ్ అగర్వాల్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను ఎవరూ ఊహించని విధంగా విధుల నుంచి తొలగించారు. అంతేకాకుండా ఎప్పటినుంచో ఉన్న ట్విట్టర్ బార్డ్ లోగో ‘X’గా మార్చడం జరిగింది.