పేరెంటల్ లీవ్స్ ను కుదించిన ఎలాన్ మస్క్ పై విమర్శల వెల్లువ

ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్ గత సంవత్సరం పగ్గాలు చేపట్టినప్పటి నుండి కంపెనీ విధానాలలో అనేక మార్పులు చేశారు. న్యూయార్క్ టైమ్స్ ఉదహరించిన అంతర్గత కంపెనీ పత్రాల ప్రకారం.. తాజాగా పేరెంటల్ అంటే, మాతృత్వ లేదా పితృత్వ సెలవులను 20 వారాలు. అంటే దాదాపు 140 రోజుల నుండి కేవలం 14 రోజులకు కుదించినట్లు సమాచారం. పెయిడ్ లీవ్ విధానం లేని USలో పనిచేసే ఉద్యోగులపై ఈ మార్పు ప్రభావం చూపుతుంది. ఆయా ప్రాంతాల్లో […]

Share:

ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్ గత సంవత్సరం పగ్గాలు చేపట్టినప్పటి నుండి కంపెనీ విధానాలలో అనేక మార్పులు చేశారు. న్యూయార్క్ టైమ్స్ ఉదహరించిన అంతర్గత కంపెనీ పత్రాల ప్రకారం.. తాజాగా పేరెంటల్ అంటే, మాతృత్వ లేదా పితృత్వ సెలవులను 20 వారాలు. అంటే దాదాపు 140 రోజుల నుండి కేవలం 14 రోజులకు కుదించినట్లు సమాచారం. పెయిడ్ లీవ్ విధానం లేని USలో పనిచేసే ఉద్యోగులపై ఈ మార్పు ప్రభావం చూపుతుంది. ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానిక చట్టాలకు అనుగుణంగా సెలవులు ఉంటాయని స్పష్టం చేస్తూ ఉద్యోగులకు అంతర్గతంగా సమాచారం అందినట్లు తెలిపింది. ఈ నిర్ణయం ట్విట్టర్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపునుంది. గతంలో ట్విట్టర్ ఉద్యోగులకు 20 వారాల పెయిడ్ పేరెంటల్ లీవ్స్ ను అందించేది. ఇప్పుడు రెండు వారాలకు తగ్గించింది. ఆ రెండు వారాల సెలవులను చెల్లింపులతో పాటు ఉద్యోగులు పనిచేసే ప్రాంతంలో చట్ట ప్రకారం మార్పులు చేసినట్లు ఎన్.వై.టి రిపోర్టర్ కేట్ కాంగర్ ఒక ట్వీట్ లో తెలిపారు. 

ఇటువంటి తరహా సెలవులపై అమెరికాలో ఎలాంటి నియమ నిబంధనలు లేవు. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. వాటిని స్థానికంగా ఉండే కంపెనీలు పాటించాల్సి ఉంటుంది. మస్క్ తాజా నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరెంటల్ లీవ్స్ కింద 20 రోజులు సెలవులు పొందాలని ఆ సమయంలో తన కుటుంబంతో ఉండడం చాలా అవసరమని చెప్పగలనని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. ఈ సెలవులను కుదించడం సిగ్గుచేటని అన్నారు. శిశువునకు జన్మనిచ్చిన తల్లికి 14 రోజుల విశ్రాంతి ఏమాత్రం సరిపోదని మరో ఉద్యోగి మండిపడ్డారు. దివాలా తీసే కంపెనీ మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని మరొకరు ట్వీట్ చేశారు. 

న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో పెయిడ్ పేరెంటల్ లీవ్స్  తప్పనిసరి చేసే ఫెడరల్ చట్టం లేదు. వైద్య సెలవుల చట్టం, అయితే, నిర్దిష్ట ఉద్యోగులకు 12 వారాల వరకు వైద్య కారణాల కోసం వేతనం ఉండని సెలవుని అనుమతిస్తుంది. అయితే, 12 రాష్ట్రాలలో పెయిడ్ లీవ్ కూడా ఉంటుందని గమనించాలి. కుటుంబ సభ్యుల కోసం, కొన్ని రకాల మెడికల్ లీవ్స్, రాష్ట్ర చట్టం ప్రకారం కాలిఫోర్నియాలో ఉద్యోగులు ఎనిమిది వారాల వరకు వేతనంతో కూడిన సెలవులు తీసుకోవచ్ఛు. న్యూయార్క్, న్యూజెర్సీలలో 12 వారాల పాటు 26 వారాల వరకు అన్ పెయిడ్ సెలవులు తీసుకోవచ్చు.

US లోని అనేక రాష్ట్రాలలో తల్లులు విశ్రాంతి తీసుకోవడానికి, కోలుకోవడానికి, వారి నవజాత శిశువులతో సమయం గడపడానికి కొంత సమయం ఇస్తారని, సెలవును తగ్గించడం ఏమిటని చాలా మంది ఎలాన్ మస్క్ ను తిట్టారు.

అయితే మరొకరు ఏకంగా దివాలా తీసే కంపెనీ మాత్రమే ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకుంటుందని ట్వీట్ చేశారు. మొత్తానికైతే ఎలాన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం పై ఎక్కడ చూసినా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో ఉండే ఏ ప్రాణికైనా మాతృత్వం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అలాంటిది ఒక మనిషి ఇంకొక మనిషికి జన్మనివ్వబోతున్నారు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాల్సిందో అందరికీ తెలిసిందే.. అయితే డెలివరీకి ముందు ఒక నెల ..డెలివరీ తర్వాత సుమారుగా మూడు నెలలపాటు జన్మనిచ్చిన తల్లి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో ఆమె తీసుకునే విశ్రాంతిపై ఆమె పూర్తి జీవితం ఆధారపడి ఉంటుంది.

అలాంటి రోజులను కూడా కుదించి వేస్తూ కేవలం 14 రోజులు మాత్రమే ఇవ్వడం ఏ మాత్రం పద్ధతి కాదు అంటూ ట్విట్టర్ ఉద్యోగులు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మరి ఎలాన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ కాదు అని వారు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై త్వరలో ఎలాన్ మస్క్ స్పందించే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి అయితే ఎలాన్ మస్క్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ చాలామంది విమర్శిస్తున్నారు.