పాట పాడిన ఈజిప్ట్ మ‌హిళ‌.. ఫిదా అయిపోయిన మోదీ

కైరోలోని హోటల్‌లో భారతీయ కమ్యూనిటీ సభ్యులు నరేంద్ర మోదీకి ఉత్సాహంగా స్వాగతం పలికారు. వారు భారత జెండాలు ఊపుతూ మోదీ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత మరో పర్యటన నిమిత్తం శనివారం ఈజిప్టు రాజధాని కైరో చేరుకున్నారు. మోదీ కైరో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, తను ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీ నుంచి స్వాగతం అందుకున్నారు, అంతేకాకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఇది ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడం అని తెలుస్తుంది. […]

Share:

కైరోలోని హోటల్‌లో భారతీయ కమ్యూనిటీ సభ్యులు నరేంద్ర మోదీకి ఉత్సాహంగా స్వాగతం పలికారు. వారు భారత జెండాలు ఊపుతూ మోదీ నినాదాలతో హోరెత్తించారు.

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత మరో పర్యటన నిమిత్తం శనివారం ఈజిప్టు రాజధాని కైరో చేరుకున్నారు. మోదీ కైరో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, తను ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీ నుంచి స్వాగతం అందుకున్నారు, అంతేకాకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఇది ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడం అని తెలుస్తుంది. కైరోలోని హోటల్‌కు చేరుకున్న మోదీకి అక్కడ ఉంటున్న భారతీయాల దగ్గర నుంచి ఘన స్వాగతం అందుకున్నారు.

ఒక వీడియోలో, ఒక ఈజిప్టు మహిళ బాలీవుడ్ చిత్రం ‘షోలే’ నుండి ప్రముఖ హిందీ పాట “యే దోస్తీ హమ్ నహీ తోడేంగే” పాడుతూ చాలా చక్కగా ఆలపించింది, అమితాబ్ బచ్చన్ నటించిన షోలే మూవీలో పాడిన పాటను మోదీ చాలా చాలా శ్రద్ధగా విని “వాహ్!” అని అరుస్తూ తన ప్రశంసలను వ్యక్తం చేశారు. అంతేకాకుండా మొదటిగా చప్పట్లు కొడుతూ ప్రశంసలు అందించారు.

కైరోలోని రిట్జ్ కార్ల్‌టన్ హోటల్‌లో భారత కమ్యూనిటీ సభ్యులు ప్రధాని మోదీకి ఉత్సాహంగా స్వాగతం పలికారు. భారత జెండాను ఊపుతూ మోదీ మోదీ, వందేమాతరం అనే నినాదాలతో హోరెత్తించారు. మోదీ అక్కడ ఆప్యాయంగా పలకరించిన జనంలో పిల్లలు కూడా ఉన్నారు. ప్రవాస భారతీయులు మోదీకి సాదరంగా స్వాగతం పలికేందుకు భారతీయ పాటలు పాడుతూ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. తనకు స్వాగతం పలికేందుకు హోటల్ వెలుపల లోపల నిలబడిన భారతీయ సభ్యులతో మోదీ వ్యక్తిగతంగా అభివాదం చేసి, వారితో సంభాషించారు.

మోదీ ఈజిప్ట్ పర్యటన ఎందుకు ప్రత్యేకం?

ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు మోదీ ‘రాష్ట్ర పర్యటన’ కోసం ఈజిప్ట్ చేరుకున్నారు, నిజానికి ఈజిప్ట్ గణతంత్ర దినోత్సవం నాడు, ఆయన ఒక ముఖ్యమైన గౌరవనీయమైన ‘ముఖ్య అతిథి’.

1997 నుంచి ’26 ఏళ్లలో భారత ప్రధాని ఈజిప్ట్‌లో జరిపిన మొదటి ద్వైపాక్షిక పర్యటన’ కావడం వల్ల ఈ ముఖ్యమైన ‘రాష్ట్ర పర్యటన’ నిజానికి ఇది ఒక ముఖ్యమైన సందర్భం. మడ్‌బౌలీ మరియు ప్రెసిడెంట్ ఎల్-సిసి ఆదివారం దాదాపు అరగంటపాటు అక్కడున్న అల్-హకీమ్ అద్భుతమైన మసీదును సందర్శించడం జరుగుతుంది, ఇది కైరోలోని 16వ ఫాతిమిడ్ ఖలీఫా అల్-హకీమ్ బి-అమ్ర్ అల్లా (985-1021) పేరు మీద ఉన్న చారిత్రాత్మక మరియు ప్రముఖ మసీదు.

మోదీ అమెరికా పర్యటన విశేషాలు:

భారత ప్రధానమంత్రి మోదీ మరియు అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ మధ్య జరిగిన మీటింగ్ ప్రకారం,” భారతదేశం కూడా Artemis Accordsలో పాలు పంచుకోబోతున్నట్లు, అంతేకాకుండా అంతరిక్ష పరిశోధనలో పాలు పంచుకోవడం ద్వారా, మానవజాతికి ఎంతో మేలు జరుగుతుంది” అనే విషయాలు అఫీషియల్ గా వెల్లడించినట్లు PTI తెలిపింది. 

నిజానికి చెప్పుకోవాలంటే, భారతదేశానికి సుమారు అన్ని దేశాల నుండి స్నేహపూర్వకపైన సంబంధాలు ఏర్పడటానికి ముఖ్య కారణం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని చెప్పుకోవచ్చు. ఆయన చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో విదేశీ పర్యటనలు ఈ స్నేహపూర్వకమైన సంబంధాలకు ముఖ్య కారణాలు. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రతి నెల ఆయన నేరుగా ప్రజలతో మన్ కీ బాత్ ద్వారా మాట్లాడ్డం ద్వారా మరింత భారతదేశ ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆడవారికి సహకారంగా, చిరు వ్యాపారస్తులకు, చిన్న పిల్లల చదువులకు, ఆరోగ్యం సంబంధించి ఎన్నో రకాల కార్యక్రమాలు భారత దేశంలో నిర్వహించారు.