మొరాకోను అతలాకుతలం చేసిన భయంకర భూకంపం 

సెప్టెంబర్ 8న మోరాకోలో సంభవించిన భయంకరమైన భూకంపం సుమారు 2వేల మంది ప్రజలను పొట్టని పెట్టుకుంది. ఇప్పటికీ ఎన్నో ఎమర్జెన్సీ సర్వీసులు శిధిలాల్లో చిక్కుకున్న ప్రజలను వెలికి తీసే పనిలో పడ్డాయి. కానీ రెడ్ క్రాస్ చెప్తున్న దాని ప్రకారం.. మోరాకోలో సంభవించిన నష్టాన్ని తిరిగి పునరుద్ధరించడానికి సుమారు కొన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పుకోస్తోంది. 6.8 రెక్టర్ స్కేలు మీద నమోదైన భూకంపం, మొరాకోలోని మరకేష్ అనే టూరిస్ట్ సిటీకి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత […]

Share:

సెప్టెంబర్ 8న మోరాకోలో సంభవించిన భయంకరమైన భూకంపం సుమారు 2వేల మంది ప్రజలను పొట్టని పెట్టుకుంది. ఇప్పటికీ ఎన్నో ఎమర్జెన్సీ సర్వీసులు శిధిలాల్లో చిక్కుకున్న ప్రజలను వెలికి తీసే పనిలో పడ్డాయి. కానీ రెడ్ క్రాస్ చెప్తున్న దాని ప్రకారం.. మోరాకోలో సంభవించిన నష్టాన్ని తిరిగి పునరుద్ధరించడానికి సుమారు కొన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పుకోస్తోంది. 6.8 రెక్టర్ స్కేలు మీద నమోదైన భూకంపం, మొరాకోలోని మరకేష్ అనే టూరిస్ట్ సిటీకి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత శిఖరాల మధ్య భూకంప కేంద్రాన్ని గుర్తించారు యూఎస్ జూలాజికల్ సర్వే. 

చిక్కుకున్న ప్రాణాలు: 

అర్ధరాత్రి సంభవించిన భయంకరమైన భూకంప ప్రకంపనలు చాలా వరకు తీరా ప్రాంతాలను అతలాకుతలం చేసింది. హఠాత్తుగా సంభవించిన భూకంపానికి ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో దిక్కు సూచని పరిస్థితుల్లో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బయటికి పరుగులు తీస్తారు ప్రజలు. కానీ అర్ధరాత్రి కావడంతో చాలా మంది ప్రజలు శిథిలాల కింద ఇరుక్కుపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తీరప్రాంతాలు రబాట్, కాసాబ్లాంకా మరియు ఎస్సౌయిరాలో పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. 

శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన అతిబీకర భూకంపానికి ఈ ప్రాంతాలలో ఉన్న ఒక్క బిల్డింగ్ కూడా నిలవలేకపోయింది. అర్ధరాత్రి కావడంతో చాలామంది శిధిలాల కింద ఉండిపోవాల్సి వచ్చింది. రెస్క్యూ టీం వారు శనివారం తెల్లవారుజాము నుంచి శిథిలాల కింద ఉండిపోయిన జనాన్ని వెలికి తీసే పనిలో పడ్డారు కానీ అప్పటికే చాలామంది తమ ప్రాణాలను కోల్పోయినట్లు స్థానికులు తమ గోడును వెల్లబుచ్చుకుంటున్నారు. తమ సొంత వారిని విగత జీవులుగా చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రభుత్వం పాలన చేస్తున్న కింగ్ మహమ్మద్, మూడు రోజుల పాటు అక్కడ సంతాప దినాలుగా ప్రకటించారు. గాయపడిన వారికి రక్తదానం చేయాలని మర్రకేష్‌లోని ప్రాంతీయ బ్లడ్ డొనేషన్ బ్యాంక్, తమ ప్రాంతీయ ప్రజలకు పిలుపునిచ్చింది.

ఇదిలో ఉండగా మరోవైపు, రాయల్ మొరాకో ఫుట్‌బాల్ ఫెడరేషన్ లైబీరియాతో జరిగే కప్ ఆఫ్ ఆఫ్రికన్ నేషన్స్ క్వాలిఫైయర్, తీరప్రాంత నగరమైన అగాదిర్‌లో శనివారం జరగాల్సి ఉండగా, వాయిదా వేసినట్లు ప్రకటించింది.

ఎంతో నష్టం: 

విదేశీ నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 2020లో మొరాకో సంబంధాలను కున్న బలపరుచుకున్న ఇజ్రాయెల్‌తో సహా పలువురు సహాయాన్ని అందించారు. ప్రాణనష్టం మరియు విధ్వంసం పట్ల తాను చాలా బాధపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. చైనా నాయకుడు జి జిన్‌పింగ్ తన వైపు నుంచి సంతాపం వ్యక్తం చేశారు. మొరాకో ప్రభుత్వం మరియు ప్రజలు ఈ విపత్తు ప్రభావాన్ని అధిగమించగలరని ఆయన తన ఆశాభావం వ్యక్తం చేశారు.

2004లో, ఈశాన్య మొరాకోలోని అల్ హోసీమాలో భూకంపం సంభవించినప్పుడు 628 మంది మరణించారు, 926 మంది గాయపడ్డారు. 1960లో అగాదిర్‌లో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇటీవల కాలంలో, సంభవించిన భూకంపాలలో టర్కీ తర్వాత అతి పెద్ద భూకంపం సంభవించింది ఇప్పుడు మురాకోలోనే. తీరప్రాంతాలలో ఎక్కువగా ప్రభావితం అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో ఒక అతి పెద్ద భూకంపం, టర్కీ భూకంపం సంభవించి కొద్ది నెలల వ్యవధిలోనే మరో అతిపెద్ద భూకంపం మొరాకోను అతలాకుతలం చేయడం, ప్రపంచ ప్రజలను మరొక్కసారి భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఎప్పుడు ఎక్కడ భయంకరమైన భూకంపాలు సంభవిస్తాయో అంటూ ప్రపంచ దేశాలు అలా అవుతున్నాయి. కానీ ప్రస్తుతం మొరాకోలో సంభవించిన భూకంపం కారణంగా చనిపోయిన వారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుందాం.