చెత్త రీసైక్లింగ్‌‌‌తో బిలియనీర్

స్టాక్ మార్కెట్ తన కంపెనీ ఐపీవోకి భారీ స్పందన.. ఇంతకీ ఎవరతను ? ఇండియాలో అతిపెద్ద IPOగా నిలిచిన LICలానే, జపాన్‌లోని ఓ సంస్థ కూడా 2022లో అతిపెద్ద IPOలలో ఒకటిగా నిలిచింది. అదే కోబేలో ప్రధాన కార్యాలయం కలిగిన వేస్ట్ మేనేజ్‌మెంట్, రీసైక్లింగ్ కంపెనీ  డైయే కాంక్యో (Daiei Kankyo). జపాన్ టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌లో గత డిసెంబరులో లిస్ట్ అయిన ఈ సంస్థ.. ఐపీవో ద్వారా 315 మిలియన్ డాలర్లను సేకరించింది. అంటే దాని […]

Share:

స్టాక్ మార్కెట్ తన కంపెనీ ఐపీవోకి భారీ స్పందన.. ఇంతకీ ఎవరతను ?

ఇండియాలో అతిపెద్ద IPOగా నిలిచిన LICలానే, జపాన్‌లోని ఓ సంస్థ కూడా 2022లో అతిపెద్ద IPOలలో ఒకటిగా నిలిచింది. అదే కోబేలో ప్రధాన కార్యాలయం కలిగిన వేస్ట్ మేనేజ్‌మెంట్, రీసైక్లింగ్ కంపెనీ  డైయే కాంక్యో (Daiei Kankyo). జపాన్ టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌లో గత డిసెంబరులో లిస్ట్ అయిన ఈ సంస్థ.. ఐపీవో ద్వారా 315 మిలియన్ డాలర్లను సేకరించింది. అంటే దాని వాటాలో మూడింట ఒక వంతుకు పైగా పబ్లిక్ ఆఫర్ చేసింది.

వేస్ట్ రీసైక్లింగ్, ట్రీట్‌మెంట్ సేవలను అందించే  డైయే కాంక్యో కంపెనీ లిమిటెడ్.. IPO లిస్టింగ్ తర్వాత 30% పైగా ర్యాలీ చేసింది. దీంతో కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ ఫుమియో కనెకో 1 బిలియన్ డాలర్లతో దేశంలో సరికొత్త బిలియనీర్ అయ్యారు. 66 ఏళ్ల కనెకో, ముగ్గురు వ్యాపార భాగస్వాములతో కలిసి 1979లో ఒసాకా ప్రిఫెక్చర్‌లోని ఇజుమి నగరంలో వ్యర్థాలను నిర్వహించడానికి ఈ కంపెనీని స్థాపించారు. స్థానిక నివాసితుల నుండి ప్రారంభంలో ప్రతిఘటనను ఎదుర్కొన్నప్పటికీ.. కనెకో, సహ వ్యవస్థాపకులు చెత్త నిర్వహణ ఆవశ్యకత గురించి వివరించి, స్థానిక ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. అలాగే 9 రకాల వ్యర్థాలను నిర్వహించడానికి అవసరమైన అనుమతులను పొందారు. 

కంపెనీకి టర్నింగ్ పాయింట్

1995లో వచ్చిన హన్షిన్ అవాజీ భూకంపం కారణంగా కోబే, ఒసాకాలో భారీ నష్టం కలిగింది. అలాగే భారీ ఎత్తున వ్యర్థాలు ఏర్పడ్డాయి. ఇదే కంపెనీకి పెద్ద మలుపుగా నిలిచింది. మొత్తం భూకంప వ్యర్థాలలో మూడింట ఒక వంతును కంపెనీ రీసైక్లింగ్ చేసింది. అయితే ఇది కంపెనీ ఆర్థిక స్థితిని దెబ్బతీసినా.. ఇలాంటిది పరిశ్రమల విలువను తెలియచేసింది.

అప్పటి నుండి డైయే కాంక్యో వ్యర్థాల రీసైక్లింగ్, వ్యర్థాలను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి, అటవీ సంరక్షణకు కార్యకలాపాలను విస్తరించింది. డిసెంబరు 2022 నాటికి సంస్థ మొత్తం 31.8 మిలియన్ క్యూబిక్ మీటర్ల చెత్త రీసైక్లింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంస్థ బయోమాస్, బయోగ్యాస్ పవర్ జనరేషన్ ప్లాంట్‌లను కూడా నిర్వహిస్తుంది. ఇది సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తాజా నివేదిక ప్రకారం 2,520 మంది ఉద్యోగులతో 30 కంటే ఎక్కువ అనుబంధ సంస్థలు, కంపెనీలను ఈ సంస్థ కలిగి ఉంది.

మహమ్మారి కరోనా కారణంగా వేస్ట్ మేనేజ్‌మెంట్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ వల్ల డైయే కాంక్యో ప్రయోజనం పొందింది. మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.5% వృద్ధిని నమోదు చేసింది, నికర లాభం 67 మిలియన్ డాలర్ల. గత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో Daiei 375 మిలియన్ డాలర్ల రెవెన్యూపై 54 మిలియన్ డాలర్ల నికర లాభాన్ని గడించింది.