Viral Video: ప్ర‌త్య‌క్ష‌ ప్రసారం మధ్యలో కొడుకుకి కాల్ చేసిన యాంకర్

వాతావరణంలో (Climate) వచ్చిన మార్పులకు కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వాతావరణంలో(Climate) భయానక మార్పుల కారణంగా తుఫాన్లు, టోర్నడో (Tornado)లు దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తుఫాన్ల రాక ఎక్కువ అవుతోంది. మరి ముఖ్యంగా అగ్ర రాజ్యాలలో టోర్నడో (Tornado)ల రాక, సర్వసాధారణంగా మారింది. దీనికి సంబంధించిన ఒక వీడియో (Video) ఇప్పుడు వైరల్ వీడియో గా (Viral Video) మారింది. ఒక వాతావరణ (Climate) హెచ్చరిక అందిస్తున్న వాతావరణ […]

Share:

వాతావరణంలో (Climate) వచ్చిన మార్పులకు కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వాతావరణంలో(Climate) భయానక మార్పుల కారణంగా తుఫాన్లు, టోర్నడో (Tornado)లు దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తుఫాన్ల రాక ఎక్కువ అవుతోంది. మరి ముఖ్యంగా అగ్ర రాజ్యాలలో టోర్నడో (Tornado)ల రాక, సర్వసాధారణంగా మారింది. దీనికి సంబంధించిన ఒక వీడియో (Video) ఇప్పుడు వైరల్ వీడియో గా (Viral Video) మారింది. ఒక వాతావరణ (Climate) హెచ్చరిక అందిస్తున్న వాతావరణ (Climate) నిపుణుడు (Meteorologist), ప్రత్యక్ష ప్రసారం చేస్తూ, మధ్యలో తన కొడుకుకి కాల్ చేసి, ఇంటికి దగ్గరలోనే టోర్నడో (Tornado) రాబోతోందని, అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. 

ప్రతిక్ష ప్రసారం మధ్యలో కొడుకుకి కాల్ చేసిన యాంకర్: 

NBC వాషింగ్టన్ (Washington) ముఖ్య వాతావరణ (Climate) నిపుణుడు (Meteorologist), డౌగ్ కమ్మెరర్ (Doug Kammerer) తండ్రి (Father)గా ఉండటమే తన మొదటి ప్రాధాన్యత అని నిరూపించాడు. ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నప్పుడు, అతను DC ప్రాంతంలో టోర్నడో (Tornado) రాబోతోందని హెచ్చరికను ట్రాక్ చేయగా, టోర్నడో (Tornado)  నేరుగా తన మేరీల్యాండ్ ఇంటి మీదుగా వెళుతుందని కమ్మరర్ (Doug Kammerer) గ్రహించాడు. తన సెల్‌ఫోన్‌ను పట్టుకుని, వాతావరణ (Climate) మ్యాప్ ముందు నిలబడి తన పనిని చేస్తూ, టీవీ చూస్తున్న వారికోసం టోర్నడో (Tornado) ఎక్కడ వస్తుందో చూపించాడు. ఈ సందర్భంలోనే తన ఇంటికి కాల్ చేసి అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చాడు. అయితే తన కొడుకుకి కాల్ చేసిన యాంకర్.. వెంటనే తండ్రి (Father)గా ఇంటి బేస్మెంట్ కి వెళ్ళమని, టోర్నడో (Tornado) 10-15 నిమిషాల వ్యవధిలో ఇంటి దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించాడు. 

కాల్ పెట్టేసిన అనంతరం.. తన పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారో తనకి చాలా బాగా తెలుసని.. వాళ్ళు ఇప్పుడు న్యూస్ చూడకుండా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారని తనకి తెలుసు కాబట్టి, వెంటనే వాళ్ళకి కాల్ చేసి.. టోర్నడో (Tornado) గురించి హెచ్చరించానని.. ప్రత్యక్ష ప్రసారంలో న్యూస్ చెబుతూ మాట్లాడడం జరిగింది.

ఎన్‌బిసి వాషింగ్టన్ (Washington)  వైరల్ వీడియో (Viral Video)ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తర్వాత వీడియో (Video) అందరి దృష్టిని ఆకర్షించింది. వైరల్ వీడియో (Viral Video)ను షేర్ చేసుకుంటూ.. టోర్నడో (Tornado) గురించి స్టార్మ్ టీమ్4 చీఫ్ మెటియరాలజిస్ట్ (Meteorologist) డౌగ్ కమ్మెరర్ ప్రతి ఒక్కరికి కూడా తమ కుటుంబం అనుకుని తన సేవలను అందిస్తున్నాడని రాసుకొచ్చారు. 

కామెంట్ల వర్షం: 

ప్రత్యక్ష ప్రసార టీవీ ప్రసార సమయంలో, డగ్ కమ్మరర్ (Doug Kammerer)ఆలోచన మరియు బాధ్యతాయుతమైన చర్యలకు సోషల్ మీడియా వినియోగదారులు, వైరల్ వీడియో (Viral Video)కు నిజంగా ఆకట్టుకున్నారు. టోర్నడో (Tornado) హెచ్చరికల మధ్య అతని కుటుంబ భద్రతకు భరోసా ఇవ్వడం.. అనేది నిజంగా అద్భుతమైన విషయమని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కొంతమంది, ‘మనం ఏ పనిలో ఉన్న, కుటుంబం మనకి ముఖ్యమంటూ’ రాసుకొచ్చారు. ‘ఒకవేళ నేను కూడా అదే సిచువేషన్ లో ఉంటే, నేను మా పిల్లలకు కాల్ చేస్తా అంటూ..’ కొంతమంది రాసుకొచ్చారు. కొంతమంది కామెంట్ (Comment) పెడుతూ.. ‘అతనికి తన ప్రియారిటి గురించి చాలా బాగా తెలుసు’ అంటూ.. మరి కొంతమంది ‘ఈ వ్యక్తికి ఫాదర్ ఆఫ్ ద సెంచరీ అవార్డు ఇచ్చినా తక్కువే’ అంటూ.. ‘జాబ్ మధ్యలో తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవాడే అసలైన మనిషి’ అంటూ మరికొందరు కామెంట్లు (Comment) పెట్టారు. ‘ఇలాంటి వ్యక్తిని ప్రేమించాలి’ అంటూ మరి కొంతమంది తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు.