భారత్ నుండి రష్యా దిగుమతులకు ప్రణాళికలు

రష్యా.. భారతదేశం నుండి ఆటోమొబైల్స్, వ్యవసాయ వస్తువులను దిగుమతి చేసుకోవాడానికి ప్రయత్నాలు చేస్తోంది.  రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో అప్పటి నుండి మాస్కో భారతదేశం నుండి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అటు భారతదేశం-రష్యా మధ్య సంబంధాలు  స్థిరంగా ఉన్నాయని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్  అన్నారు. రష్యా దేశ  ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ హాజరైన కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగిస్తూ.. మాస్కో ఆసియా వైపు ఎక్కువగా […]

Share:

రష్యా.. భారతదేశం నుండి ఆటోమొబైల్స్, వ్యవసాయ వస్తువులను దిగుమతి చేసుకోవాడానికి ప్రయత్నాలు చేస్తోంది.  రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో అప్పటి నుండి మాస్కో భారతదేశం నుండి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అటు భారతదేశం-రష్యా మధ్య సంబంధాలు  స్థిరంగా ఉన్నాయని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్  అన్నారు.

రష్యా దేశ  ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ హాజరైన కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగిస్తూ.. మాస్కో ఆసియా వైపు ఎక్కువగా చూస్తున్నందున రష్యాకు సంబంధించిన వనరులు, సాంకేతికత భారతదేశ వృద్ధికి శక్తివంతమైన సహకారం అందించగలదన్నారు. అదే విధంగా విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సంబంధాన్ని విస్తరించడానికి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

 అదే సమయంలో జైశంకర్ భారతదేశం మరియు రష్యా మధ్య ఆర్థిక సంబంధంలోవాణిజ్య అసమతుల్యత  గురించి అర్థమయ్యే విధంగా  ప్రస్తావించారు. అసమతుల్యతను పరిష్కరించడం అంటే మార్కెట్ యాక్సెస్, లాజిస్టిక్‌లకు సంబంధించిన సమస్యలు మరియు  ఇతర సమస్యలను పరిష్కరించడం అని  జైశంకర్ తెలిపారు. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత కూడా న్యూ ఢిల్లీ, మాస్కోలలో కొనసాగుతున్న ఆర్థిక పరిస్థితులపై పాశ్చాత్య దేశాల నుండి ఆందోళనలు పెరుగుతున్నప్పటికీ, భారతదేశం, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నాయి. కాగా వ్యాపారంలో స్వల్ప మరియు మధ్యకాలిక సవాళ్ల గురించి మనం కూడా నిజాయితీగా ఉండాలని జైశంకర్ అన్నారు. గత ఏడాది వ్యవసాయానికి సంబంధించి ఎరువుల వ్యాపారంలో ఇరువర్గాలు పరస్పరం ఆమోదయోగ్యమైన మార్గాలను కనుగొన్నాయని జైశంకర్ చెప్పారు.

కానీ భారత దేశానికి సంబంధించిన కొన్ని కంపెనీలు, బ్యాంకులు ప్రతికూల చర్యలకు భయపడి రష్యన్ సంస్థలతో వ్యవహరించడానికి ఇష్టపడటం లేదని రష్యాన్ అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు మాస్కోలో ఎక్కువ ఆవశ్యకత ఉందన్నారు. ఎందుకంటే ఆంక్షల నేపథ్యంలో అనేక కార్ల తయారీదారులు తమ కార్యకలాపాలను నిలిపివేసినందున వినియోగదారులు తమ వాహనాలకు విడిభాగాలను పొందడం కష్టంగా ఉందని చెప్పారు.

మేము వాణిజ్యం మరియు ఆర్థిక సంబంధాల గురించి మాత్రమే కాకుండా, విద్య మరియు సంస్కృతి వంటి పరస్పర మానవతా ప్రాంతాల గురించి కూడా మాట్లాడుతున్నాము” అని జైశంకర్ అన్నారు. రష్యా యొక్క సాంకేతిక సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల గురించి కూడా ఆయన వివరించడం జరిగింది.

అటు భారత ఆటో కాంపోనెంట్‌ల‌తో పాటు కార్ల కంపెనీలు రష్యాలోకి ప్రవేశించాలనే డిమాండ్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆటో విడిభాగాల ఎగుమతులు సాధ్యమయ్యేలా కనిపిస్తున్నప్పటికీ.. అనేక గ్లోబల్ వ్యాపారస్తులను కలిగి ఉన్న భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ వాహనాలను రవాణా చేయడానికి అంగీకరించే అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది. అటు టాటా మోటార్స్ మరియు మహీంద్రా కంపెనీ వంటి స్వదేశీ వ్యాపారులు కూడా అంతర్జాతీయ వ్యాపారాన్ని కలిగి ఉన్నారు. 

ప్రస్తుతం రష్యాలో ఉన్న ఎగుమతిదారుల బృందం సోయా మరియు అనేక ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేయడంపై చర్చలు జరిపింది. ఎందుకంటే మాస్కో సరఫరాలను పెంచడానికి ప్రయత్నిస్తుంది. “సూపర్ మార్కెట్లలోని షెల్ఫ్‌లు ఖాళీ అవుతున్నాయి మరియు డ్యూటీ-ఫ్రీ షాప్‌లో (విమానాశ్రయంలో) కూడా రష్యన్ వోడ్కాను మించినది లేదు” అని భారతదేశానికి తిరిగి వచ్చిన ఒక ఎగుమతిదారు చెప్పారు. గతంలో కూడా డిమాండ్లు ఉన్నప్పటికీ, ఒప్పందాలు కార్యరూపం దాల్చలేదు.

ఎగుమతిదారులు ప్రస్తుతం ప్రతి లావాదేవీలో దాదాపు 4% నష్టపోతున్నందున రూపాయి – రూబుల్ వ్యాపారం తమకు సహాయపడుతుందని చెప్పారు. ఇప్పుడు ప్రతి పదిహేను రోజులకు ఆర్‌బీఐ ఈ రేటును తెలియజేయవచ్చని వారు వాణిజ్య శాఖకు సూచించారు.