జో బైడెన్‌ను విమర్శించిన డోనాల్డ్ ట్రంప్

మాజీ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనకి ఎప్పుడు ఏం అనిపిస్తే అదే చేస్తాడు. ఏమనాలనిపిస్తే అనేస్తాడు. ఇప్పుడు అదే విధంగా ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ గా ఉంటున్న జో బీడెన్ను కూడా ఆయన వదిలిపెట్టలేదు. అతను ఒక మూర్ఖుడు అంటూ, స్టుపిడ్ అంటూ, మరోసారి తనకి నచ్చిన విధంగా మాట్లాడేస్తాడు డోనాల్డ్ ట్రంప్. జరిగిన విషయం:  డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, అధ్యక్ష పదవి పట్ల గౌరవం ఉన్నందున తాను ఎప్పుడూ […]

Share:

మాజీ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనకి ఎప్పుడు ఏం అనిపిస్తే అదే చేస్తాడు. ఏమనాలనిపిస్తే అనేస్తాడు. ఇప్పుడు అదే విధంగా ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ గా ఉంటున్న జో బీడెన్ను కూడా ఆయన వదిలిపెట్టలేదు. అతను ఒక మూర్ఖుడు అంటూ, స్టుపిడ్ అంటూ, మరోసారి తనకి నచ్చిన విధంగా మాట్లాడేస్తాడు డోనాల్డ్ ట్రంప్.

జరిగిన విషయం: 

డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, అధ్యక్ష పదవి పట్ల గౌరవం ఉన్నందున తాను ఎప్పుడూ కూడా బిడెన్‌ను ఫాలో అవ్వలేదు అని అన్నారు.

2024 రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం తన ప్రచారాన్ని కొనసాగిస్తూ, ప్రస్తుత జో బిడెన్ “చాలా తెలివితక్కువ వ్యక్తి, స్టుపిడ్” అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. GOP ప్రెసిడెంట్ నామినేషన్ కోసం పోల్స్‌లో ప్రధాన పోటీదారునిగా కొనసాగుతున్న డొనాల్డ్ ప్రెసిడెంట్, రియల్ అమెరికాస్ వాయిస్‌కి చెందిన వేన్ అలిన్ రూట్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అధ్యక్ష పదవి పట్ల గౌరవం ఉన్నందున తాను ఎప్పుడూ కూడా బిడెన్‌ను ఫాలో అవ్వలేదు అని అన్నారు.

అమెరికా ప్రెసిడెంట్ ఒక ఏమీ తెలియని మూర్ఖుడు అని, అతనో సాధారణ దొంగ. అతను మూర్ఖుడు కన్నా ఎక్కువ, అతను చాలా తెలివితక్కువ వ్యక్తి అన్నారు డోనాల్డ్ ట్రంప్. అన్నిటికీ మించి, తన ఉద్దేశ్యం ప్రకారం, అతను తెలివితక్కువ వ్యక్తి అన్నాడు. ఎందుకంటే, జోబిడెన్ ఇప్పుడు తన ప్రత్యర్థి కాబట్టి, జోబిడెన్ చేసే అభియోగాలు కూడా-ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ చట్టం కిందకు వస్తాయని అన్నారాయన.

అధ్యక్షుడిపై దర్యాప్తు: 

డోనాల్డ్ ట్రంప్ మాటల ద్వారా, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు మరియు అతని కుటుంబం మీద ఉన్న అవినీతిపై హౌస్ ఓవర్‌సైట్ కమిటీ నిర్వహిస్తున్న దర్యాప్తును ఉద్దేశించి మాట్లాడి ఉండొచ్చు అని నివేదికలు అంచనా వేస్తున్నాయి. మేరీల్యాండ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది అనాలిసిస్ ఆఫ్ గ్లోబల్ సెక్యూరిటీకి సహ-డైరెక్టర్ అయిన గల్ లుఫ్ట్ విజిల్‌బ్లోయర్ నుండి వచ్చిన వాంగ్మూలంపై ఆరోపణలు దృష్టి సారించాయి. అంతేకాకుండా ఇప్పుడు వైట్ హౌస్ లో దొరికిన కొకైన్ కారణంగా దర్యాప్తుకు ఇంకా ఆద్యం పోసినట్లు అయింది.

GOP విచారణను వైట్ హౌస్ తీవ్రంగా విమర్శించింది, అంతేకాకుండా ఐదేళ్లుగా, కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లు అధ్యక్షుడు మరియు అతని కుటుంబ సభ్యులపై తమ వాదనలకు సాక్ష్యాలు, మరే ఇతర రుజువులను అందించకుండా దర్యాప్తు చేయడంపై, రాజకీయంగా ప్రేరేపించబడిన దాడులను చేస్తున్నారు అంటూ మండిపడింది. 

డోనాల్డ్ ట్రంప్ గురించి మరింత: 

డోనాల్డ్ జాన్ ట్రంప్ , జూన్ 14, 1946న జన్మించాడు. ఆయన ఒక అమెరికన్ రాజకీయవేత్త, మీడియా వ్యక్తి మరియు వ్యాపారవేత్త, అతను 2017 నుండి 2021 వరకు యునైటెడ్ స్టేట్స్ 45వ అధ్యక్షుడిగా తన విధులను నిర్వహించాడు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. అతను ఓటమిని అంగీకరించడానికి నిరాకరించాడు, విస్తృతమైన ఎన్నికల మోసాన్ని తప్పుగా క్లెయిమ్ చేశాడు. ప్రభుత్వ అధికారులఫై ఒత్తిడి తీసుకువచ్చి ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించాడు, తప్పుడు దారిలో వెళ్ళినందుకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. అధ్యక్ష పరివర్తనను అడ్డుకున్నాడు. జనవరి 6, 2021న, అతను తన మద్దతుదారులను U.S. క్యాపిటల్‌కు మార్చ్చేయవలసిందిగా కోరాడు, ఆ తర్వాత వారిలో చాలామంది దాడి చేశారు, ఫలితంగా అనేకమంది మరణించారు, అలా ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అంతరాయం ఏర్పడింది. 

కానీ తాను ఓటమిని అంగీకరించకుండా ఈ విధంగా చేయడం, చాలా మంది ప్రాణాలు కోల్పోయేలా చేయడం అప్పట్లో నిజానికి ఎవరికీ నచ్చని విషయంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం 2024లో జరగబోయే, ఎలక్షన్స్ కోసం ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో తనధైనసైలిలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు.