Dogs: యుద్ధ సమయంలో ఇజ్రాయిలీలకు సహాయం చేసిన కుక్కలు

పెంపుడు జంతువులు అనగానే ముఖ్యంగా మనకి శునకాలు (Dogs) గుర్తొస్తాయి. తన యజమాని ఎంత కఠినమైన వాడైనా సరే, ఆ మనిషిని రక్షించేందుకు శునకం ఎప్పుడు సానుభూతి చూపిస్తూనే ఉంటుంది. యజమాని తప్పిపోయినప్పుడు, యజమానికి ఎటువంటి హాని కలిగినా శునకం ఎప్పుడు కాపాడ్డానికి ముందే ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ (Israel) హమ్మస్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో కూడా శునకాలు (Dogs) సహాయం చేయడానికి ముందే ఉన్నాయి.  యుద్ధ సమయంలో ఇజ్రాయిలీలకు సహాయం చేసిన శునకాలు:  టెల్ […]

Share:

పెంపుడు జంతువులు అనగానే ముఖ్యంగా మనకి శునకాలు (Dogs) గుర్తొస్తాయి. తన యజమాని ఎంత కఠినమైన వాడైనా సరే, ఆ మనిషిని రక్షించేందుకు శునకం ఎప్పుడు సానుభూతి చూపిస్తూనే ఉంటుంది. యజమాని తప్పిపోయినప్పుడు, యజమానికి ఎటువంటి హాని కలిగినా శునకం ఎప్పుడు కాపాడ్డానికి ముందే ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ (Israel) హమ్మస్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో కూడా శునకాలు (Dogs) సహాయం చేయడానికి ముందే ఉన్నాయి. 

యుద్ధ సమయంలో ఇజ్రాయిలీలకు సహాయం చేసిన శునకాలు: 

టెల్ అవీవ్ నగరం, ఇజ్రాయెల్ (Israel) మరియు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య కొనసాగుతున్న వివాదం నుండి ఆశ్రయం పొందేందుకు చాలామంది తమ గాయాలతో బయటపడ్డ వైనం కనిపిస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో చెల్లాచెదురుగా వెళ్లిపోయిన చాలామందికి, గాయాలతో బాధపడుతున్న మరి ఎంతో మందికి ఆహారం, నీరు మరియు ఆశ్రయం కల్పించడానికి టెల్ అవీవ్‌లో కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్ (Israel) ప్రభుత్వం. ఇండియా టుడే టీవీ టెల్ అవీవ్‌లోని అటువంటి కేంద్రాన్ని సందర్శించి, ఇజ్రాయెల్ (Israel)‌లు ఉద్రిక్త పరిస్థితులతో ఎలా వ్యవహరిస్తున్నారనే దాని గురించి మాట్లాడింది.

Read More: Joe Biden: గాజా ఆక్రమణపై ఇజ్రాయేల్‌కు అమెరికా వార్నింగ్

అయితే ఆశ్రయం ఏర్పాటు చేసిన కొన్ని కేంద్రాలలో, అనేక సేవా శునకాలు (Dogs) కూడా ఉన్నాయి, వాటిలో చాలా వరకు గాయం ఉన్న వ్యక్తులతో వ్యవహరించడానికి శిక్షణ పొందాయి. ఇజ్రాయెల్ (Israel)‌లో పరిస్థితిని ఎదుర్కోవటానికి శునకాలు (Dogs) ప్రజలకు ఎలా సహాయపడతాయనే దాని గురించి మాట్లాడుతూ, సెంటర్‌లోని వ్యక్తులలో ఒకరు, కుక్కలు నిజంగా స్నేహపూర్వకంగా మరియు మద్దతుగా ఉంటాయి కాబట్టి, ప్రజలు గాయంతో బాధపడుతున్న సమయంలో, శునకాలతో ఉండటం చాలా ముఖ్యం.. అంటూ చెప్పుకొచ్చారు

సెంటర్‌లోని మరొక వ్యక్తి ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ, ఒక వ్యక్తి నుండి కార్టిసాల్ స్థాయిని ఎలా పసిగట్టాలో శునకాలు (Dogs)కు తెలుస్తాయి కాబట్టి, ఎవరైనా ఆత్రుతగా ఉంటే, లేదా భయాందోళన చెందుతున్నట్లయితే, శునకాలు (Dogs) ఇట్టే పసికట్టగలవు అని చెప్పుకొచ్చారు. ఇల్లు వదిలి టెల్ అవీవ్‌లోని ఓ కేంద్రానికి చేరుకున్నట్లు చాలామంది కుటుంబీకులు తెలిపారు. యుద్ధం(War) ప్రారంభమైన తర్వాత దక్షిణ ఇజ్రాయెల్ (Israel) నుండి దాదాపు 60,000 మంది టెల్ అవీవ్‌కు వచ్చారు. 

కొనసాగుతున్న యుద్ధం: 

వారం రోజులుగా బాంబు దాడులు కారణంగా, ఇజ్రాయెల్ (Israel) వణికిపోతున్న క్రమం కనిపిస్తోంది. గాజా(Gaza)లోని అనేక ప్రాంతాలు బాంబు(Bomb) దాడులకు గురైపోయాయి. ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోగా, చాలామంది తమ కుటుంబాలను సైతం విడిచిపెట్టి ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతున్న దీన పరిస్థితి నెలకొంది. 

సుజాన్ బర్జాక్, 37 మరియు గాజా(Gaza)లోని ది అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మ్యాథమెటిక్స్ చెప్పే ఉపాధ్యాయురాలు. ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ గాజా(Gaza) పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ భవనంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఒక్కసారిగా దాడు(attack)లు మొదలైన క్రమంలో తమ కుటుంబ సభ్యులు అదేవిధంగా తమ చుట్టుపక్కల అపార్ట్మెంట్లలో ఉండే అందరూ కలిసి, ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోతే సురక్షితంగా ఉండొచ్చని అందరూ ఒకచోటే ఉండడం జరిగింది. నిజంగా ఆ రోజు ఒక పీడకలలా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

Read More: Joe Biden: గాజా ఆక్రమణపై ఇజ్రాయేల్‌కు అమెరికా వార్నింగ్

తన భర్త తన కొడుకు తమ చుట్టుపక్కల కొంతమందితో కలిసి గాజా(Gaza) సిటీ సెంటర్లో ఉండే తన అంకుల్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే అక్కడికి వెళ్లినప్పటికీ కూడా బాంబు(Bomb)దాడులు ఆగలేదని, మా కుటుంబ సభ్యులు మా ఆత్మీయలతో కలిసి ఒక రూములో బిక్కుబిక్కుమంటూ బాంబు(Bomb)ల సౌండ్ వింటూ భయభ్రాంతులకు గురయ్యామని తనకి జరిగిన పీడకలను గుర్తు చేసిందే బర్జాక్. అయితే తమని మరింత భయపెట్టకూడదని తమ కుటుంబ సభ్యులలో కొంతమంది గాజా(Gaza)లోని కొన్ని ప్రదేశాలలో భూకంపం సంభవించిందని తమని ఓదార్చడానికి చెప్పుకొచ్చినట్లు వెల్లడించింది. 

అయితే ఇప్పటివరకు తమకి సహాయం చేయడానికి ఒక ఎన్జీవో లేదంటే యునైటెడ్ నేషన్స్ తరఫునుంచి ఎవరు రాలేదని, అసలు లోకల్ సర్వీస్ నెంబర్లు కూడా తమకే తెలియదని, నిజంగా చుట్టుపక్కలంతా కూడా స్మశానంలా మారిందని ఆమె మాట్లాడింది. పిల్లల(Children) ఆర్తనాదాలు వినైనా ఇప్పటికైనా తమ ప్రాణాలను కాపాడి, తమకు సహాయం చేయాలని వేడుకుంటుంది బర్జాక్.