లోచ్ నెస్ మాన్స్‌టర్  జీవి నిజంగా ఉందా?

దశాబ్దాలుగా లోచ్‌ నెస్ మాన్స్‌టర్ కు సంబంధించిన చర్చ కొనసాగుతోంది. ఇది తమకు కనిపించిందని అప్పుడప్పుడూ కొంతమంది చెబుతున్నారు. కానీ ఒక్కరూ ఆధారాలు చూపలేకపోతున్నారు. ఇలా కనిపించి, అలా మాయమవుతోందని అంటున్నారు. దీని వల్ల ఇప్పటివరకూ ఎవరికీ, ఏ హానీ కలగలేదు గానీ.. ఈ జీవి నిజంగా ఉందా, మన ప్రపంచంలోనే ఉందా అనేది తేలాల్సిన అంశం. తాజాగా ఇది మరో విశ్వంలో ఉందనే కొత్త సిద్ధాంతం తెరపైకి వచ్చింది. అదేంటో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఎన్నో […]

Share:

దశాబ్దాలుగా లోచ్‌ నెస్ మాన్స్‌టర్ కు సంబంధించిన చర్చ కొనసాగుతోంది. ఇది తమకు కనిపించిందని అప్పుడప్పుడూ కొంతమంది చెబుతున్నారు. కానీ ఒక్కరూ ఆధారాలు చూపలేకపోతున్నారు. ఇలా కనిపించి, అలా మాయమవుతోందని అంటున్నారు. దీని వల్ల ఇప్పటివరకూ ఎవరికీ, ఏ హానీ కలగలేదు గానీ.. ఈ జీవి నిజంగా ఉందా, మన ప్రపంచంలోనే ఉందా అనేది తేలాల్సిన అంశం. తాజాగా ఇది మరో విశ్వంలో ఉందనే కొత్త సిద్ధాంతం తెరపైకి వచ్చింది. అదేంటో తెలుసుకుందాం.

ఈ ప్రపంచంలో ఎన్నో మిస్టరీలున్నాయి. వాటిలో ఒకటి లోచ్‌ నెస్ మాన్స్‌టర్. దీన్నే లోచ్ నెస్ రాక్షసి, రాక్షసుడు అంటున్నారు. ఈ జీవి నిజంగా ఉందా? ఉంటే ఎక్కడుంది? అనే ప్రశ్నలకు ఇప్పటివరకూ ఆన్సర్ లేదు. దీనిపై దశాబ్దాలుగా ఎంతో మంది రకరకాల కథలు చెప్పారు. తాజాగా ఓ నిపుణుడు… ఇది ఈ విశ్వంలాంటి సమాంతర విశ్వంలో ఉండి ఉండొచ్చని అంచనా వేశారు. సమాంతర విశ్వం అంటే, అది కూడా మన విశ్వంతో పాటే, మన విశ్వంలోనే కలిసిపోయి ఉంటుంది. అంటే, మనం నిల్చున్నచోటే.. మరో విశ్వంలో మరో వ్యక్తి కూడా నిల్చోగలడు.

1933 మేలో స్కాట్లాండ్‌లో తొలిసారి ఈ వింత జీవి కనిపించిందనే ప్రచారం ఉంది. స్థానిక ఓ జంట ఈ భారీ రాక్షసి లాంటి జీవి నీటి లోంచీ నేలపైకి వచ్చి.. దొర్లుతూ పడిపోయిందని చెప్పింది. కానీ ఎలాంటి ఆధారాలూ చూపించలేకపోయింది. అప్పటినుంచి ఈ జీవికి సంబంధించి తరచూ కథలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఒక్కరు కూడా ఒక్క ఆధారం కూడా చూపించలేదు. నీటిలోనే ఈ భారీ జీవి ఉంటోందని చాలా మంది నమ్ముతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ జీవి ఫోటోలు 2018లో తీయబడ్డాయని అయితే ఫోటోగ్రాఫర్ చీ కెల్లీ(51) ప్రజల ఎగతాళికి భయపడి వాటిని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా తనలో ఉంచుకున్నానని అన్నారు. తాను చిత్రాలను తీశానని మరియు జీవి స్థిరమైన వేగంతో కదులుతున్నట్లు ఉంది అని తెలిపారు. 13, ఆగస్ట్ 2018న సెలవు దినం కావడంతో కుటుంబంతో సరదాగా బయటకి వెళ్లిన సమయంలో, తాను మరియు ఆమె భర్త స్కాట్ లోచ్ ఒడ్డున ఉన్న డోర్స్ ఇన్‌లో భోజనం చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని కెనాన్ కెమెరాతో ఫోటోలు తీశానని, ఒడ్డు నుండి దాదాపు 200 మీటర్ల దూరంలో, వేగంతో కుడి నుండి ఎడమకు కదులుతున్నప్పుడు ఈ జీవి అది తిరుగుతూ ఉందని, మేము తల లేదా మెడ చూడలేదు. కొన్ని నిమిషాల తర్వాత అది అదృశ్యమైంది. మరియు మేము దానిని మళ్లీ చూడలేదు. మొదట ఇది సీల్ అని నేను ఆశ్చర్యపోయాను, కాని మేము ఎప్పుడూ తల చూడలేదు మరియు అది గాలి కోసం మళ్లీ పైకి రాలేదు. ఇది నీటిపై వింత కదలికను చేస్తూ ఉందని, అది ఒక  పాములా కనిపించిందని, ఎలాంటి శబ్దం వినబడలేదని, చీ కెల్లీ చెప్పారు.

 చీ కెల్లీని ఫెల్తామ్ ఫోటోలు విడుదల చేయడానికి ఒప్పించారు.  ఫెల్తామ్ మాట్లాడుతూ.. అవి సరిగ్గా నేను మూడు దశాబ్దాలుగా తీయాలనుకున్న చిత్రాలే. ఉపరితలంపై ఈ జీవి ఇంత స్పష్టంగా కనిపించడం చాలా అరుదు. లోచ్ నెస్‌లో వివరించలేనిది ఏదో ఉందని తెలిపారు. కెల్లీస్ చివరకు పబ్లిక్‌గా వెళ్లాలని నిర్ణయించుకోవడం మా అదృష్టం. నేను కెల్లీస్‌ని రెండుసార్లు కలిశాను,  ఈ చిత్రాలు చాలా ముఖ్యమైనవని వాటిని పబ్లిక్‌గా ఉంచాలని నేను వారిని ఒప్పించాను. వారు తరువాత విచారణకు హామీ ఇచ్చారు. ఇది ఒక కదిలే జీవి అని పూర్తిగా వివరించలేనిది అని అతను చెప్పాడు.

తాజాగా దెయ్యాలపై పరిశోధనలు చేసే రాన్ హల్లిడే .. ఈ జీవికీ, సమాంతర విశ్వానికీ లింక్ పెట్టాడు. స్కాట్లాండ్ వాసి అయిన రాన్ ఈ మాన్‌స్టర్ మరో విశ్వంలో ఉండి ఉండొచ్చు అంటున్నాడు. ప్రత్యేక పోర్టల్స్ ద్వారా అప్పుడప్పుడూ మరో విశ్వంలోని జీవులు మన విశ్వంలోకి వస్తూ ఉండొచ్చని అంటున్నాడు. ఇలాంటి జీవులకు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రేంజర్ థింగ్స్ అనే షో ఉంది. అందులో ఈ రాక్షసి గురించి కూడా ఉండనుంది. ఇదే విధంగా వెంకా అనే రాక్షసుడి గురించి కూడా ఈ షోలో ఉంది. ఆ వెంకా…  మన విశ్వం లాంటి మరో విశ్వంలో రివర్సులో ఉంటుంది. అదే విధంగా లోచ్ నెస్ కూడా ఉండగలదు అని రాన్ అంటున్నారు.