Netanyahu: ఇది జీవన్మరణ సమస్య అన్న ప్రధాని నెతన్యాహు

ఇజ్రాయెల్ (Israel) పాలస్తీనా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సైలెంట్ గా ఉన్న తమను హమాస్ గ్రూప్ అవనవసరంగా యుద్ధం చేసేలా చేస్తోందని ఇజ్రాయెల్ (Israel) ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. హమాస్ గ్రూప్ ను అంతమొందించే వరకు యుద్ధం ఆపేదే లేదని ఇజ్రాయెల్ (Israel) ప్రధాని నెతన్యాహు (Netanyahu) తో పాటుగా అనేక మంది అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇజ్రాయెల్ (Israel) ప్రధాని నెతన్యాహు (Netanyahu) బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సహనాన్ని […]

Share:

ఇజ్రాయెల్ (Israel) పాలస్తీనా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సైలెంట్ గా ఉన్న తమను హమాస్ గ్రూప్ అవనవసరంగా యుద్ధం చేసేలా చేస్తోందని ఇజ్రాయెల్ (Israel) ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. హమాస్ గ్రూప్ ను అంతమొందించే వరకు యుద్ధం ఆపేదే లేదని ఇజ్రాయెల్ (Israel) ప్రధాని నెతన్యాహు (Netanyahu) తో పాటుగా అనేక మంది అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇజ్రాయెల్ (Israel) ప్రధాని నెతన్యాహు (Netanyahu) బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సహనాన్ని పరీక్షించిన టెర్రరిస్ట్ గ్రూప్ హమాస్ ను ఎట్టి పరిస్థితుల్లో తుద ముట్టిస్తామని నెతన్యాహు (Netanyahu) తెలిపారు. ప్రపంచ దేశాలు కూడా ఇజ్రాయెల్ (Israel) ప్రధాని నెతన్యాహు (Netanyahu) చెప్పిన విషయానికి అంగీకరిస్తున్నాయి. హమాస్ ఉగ్రవాద గ్రూపే అని అంతా అంటున్నారు. అందుకోసమే హమాస్ ను తుదముట్టించడమే తమ లక్ష్యమని చెప్పకనే చెబుతున్నారు. దీంతో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. 

సంచలన ప్రకటన చేసిన ప్రధాని

తాజాగా ప్రధాని నెతన్యాహు (Netanyahu) సంచలన ప్రకటన చేశారు. పాలస్తీనాతో జరుగుతున్న యుద్ధంపై ప్రధాని నెతన్యాహు (Netanyahu) సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా (Israel) యుద్ధం రెండవ దశ (సెకండ్ స్టేజ్) లోకి ప్రవేశించిందని, ఇది జీవన్మరణ సమస్య అని ప్రధాని (Netanyahu) నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్ (Israel) బలగాలు గాజా సిటీలోకి మరింత ముందుకు వెళ్లాయని అతడు ప్రకటించాడు. హమాస్ సమూహం కు చెందిన అనేక మంది అనేక రకాలుగా నాశనం చేయబడుతున్నారని, ఈ ఏరివేత ఇంకా కొనసాగుతుందని అతడు తెలిపాడు. విలేకరుల సమావేశంలో.. నెతన్యాహు (Netanyahu) మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ (Israel) దేశానికి చెందిన వారిని బంధీలుగా తీసుకెళ్లడం హమాస్ చేసిన పెద్ద నేరం అని ప్రకటించారు. బంధీలను వెనక్కి రప్పించేందుకు తమ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఆయన వివరించారు. 

Also Read: Israel-Hamas war: అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్‌..!

వణుకుతున్న గాజా 

హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇజ్రాయెల్ (Israel) మీద దాడులు చేయడంతో ఇజ్రాయెల్ (Israel) దేశం యుద్ధ ప్రారంభించింది. ఇజ్రాయెల్ హమాస్ టెర్రరిస్టులు ఉండే గాజా సిటీ మీద భయంకర దాడులు చేస్తోంది. ఈ దాడులతో గాజా సిటీ మొత్తం అల్లకల్లోలం అవుతోంది. దీంతో గాజా నగరం మొత్తం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని భయం నడుమ జీవనం సాగిస్తోంది. మేము పోరాటంలో వెనక్కి తగ్గమని ప్రధాని నెతన్యాహు (Netanyahu) ప్రకటించారు. మేము భూమిపై, సముద్రంలో మరియు గాలిలో పోరాడుతామని తెలిపారు. మేము భూమి పైన మరియు భూమి క్రింద ఉన్న శత్రువులను నాశనం చేస్తామని ప్రకటించారు. 

నా జీవిత లక్ష్యం అదే.. 

భయంకరమైన హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ ను అంతం చేయడమే తన జీవిత లక్ష్యం అని ఇజ్రాయెల్ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) తెలిపారు. గాజా సిటీలోకి భూదాడిని విస్తరించాలనే నిర్ణయాన్ని వార్ క్యాబినెట్ మరియు సెక్యూరిటీ క్యాబినెట్ ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర విధి మరియు మన సైనికుల భద్రత రెండింటినీ నిర్ధారించే నిబద్ధత ఆధారంగా మేము దీన్ని సమతుల్యంగా మరియు పరిగణించబడే విధంగా చేశామని పేర్కొన్నారు. అక్టోబరు 7న యూదు దేశం ఇజ్రాయెల్ (Israel) పై టెర్రర్ గ్రూప్ హమాస్ చేసిన ఆకస్మిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ (Israel) సైన్యం హమాస్‌ పై వైమానిక దాడులు చేసిందని నెతన్యాహు (Netanyahu) పేర్కొన్నారు. కొనసాగుతున్న యుద్ధంలో గాజాలో ఇప్పటికే 7,000 మందికి పైగా మరియు ఇజ్రాయెల్‌లో 1,400 మందికి పైగా మరణించారన్నారు. పూర్తి స్థాయి, సురక్షితమైన దాడిని ప్రారంభించడంలో భూ బలగాలకు సహాయం చేయడానికి ఇటీవలి రోజుల్లో బాంబు దాడుల తీవ్రత పెరుగుతోందని ఆయన హైలైట్ చేశారు. ఇజ్రాయెల్ (Israel) డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ని అద్భుతమైన వీరోచిత సైనికులతో కూడిన అద్భుతమైన సైన్యంగా ఆయన అభివర్ణించారు. తాను ముందు వరుసలో ఉన్న దళాలను కలుసుకున్నానని మరియు వారి పోరాట పటిమను ప్రశంసించానని పేర్కొన్నారు. ఐడీఎఫ్ సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన ఖండించారు. అలాంటి వాదనలు చేస్తున్న వారు మితిమీరిన అబద్దాలు చెబుతన్నవారు అని ఆయన అన్నారు. మనం ఇప్పుడు యుద్ధంలో కీలకమైన రెండో దశ (Second Stage) లో కి చేరుకున్నామని ఇది మనకు జీవన్మరణ సమస్య వంటిదని ఆయన తెలిపారు. యుద్ధం నుంచి వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని, హమాస్ ను తుద ముట్టించడమే లక్ష్యమని తెలిపారు. 

Also Read: Israel Hamas War: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై ఐరాసలో ఓటింగ్..

ఊసురుమంటున్న ప్రపంచ దేశాలు

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఆగుతుందేమో అని చాలా ప్రపంచ దేశాలు ఎదురు చూశాయి. కానీ ఇజ్రాయెల్ (Israel) ప్రధాని నెతన్యాహు (Netanyahu) తాజాగా చేసిన ప్రకటనతో వారి ఆశలు అడియాసలయ్యాయి. అసలు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ప్రధాని తేల్చి చెప్పారు. దీంతో ఈ యుద్ధం ఇప్పట్లో క్లోజ్ కాదని అందరికీ అర్థం అయింది. తాము అనుకున్నదొకటి అయితే ఇక్కడ అయింది మరొకటని అంతా అనుకుంటున్నారు. యుద్ధాన్ని శాంతియుత చర్చలతో క్లోజ్ చేయించాలని చాలా దేశాలు ప్రయత్నాలు కూడా చేశాయి. కానీ ఆ దేశాల ప్రయత్నాలు అన్నీ ప్రస్తుతం ఎటువంటి ప్రయోజనం లేకుండా ముగిశాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu) కుండబద్దలు కొట్టడంతో ప్రపంచ దేశాలు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాయి.