ముంచుకొస్తున్న X..  5 కోట్ల ప్రాణాల‌కు ముప్పు

కరోనా మహమ్మారి చేసిన డ్యామేజ్ ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. కరోనా పేరు నిద్రలో గుర్తుకొచ్చినా కానీ ఇప్పటికీ కొంత మంది ఉలిక్కిపడుతున్నారంటే ఆ మహమ్మారి ఎంతలా తన పంజా విసిరిందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే ఏదైనా వైరస్ అంటే ప్రపంచవ్యాప్తంగా జనాలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనాకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి టీకాను కనిపెట్టినా కానీ మహమ్మారి మాత్రం పూర్తిగా పోలేదు. నేటికి కూడా మహమ్మారి ఎక్కడో ఓ చోట తన పంజాను విసురుతూనే […]

Share:

కరోనా మహమ్మారి చేసిన డ్యామేజ్ ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. కరోనా పేరు నిద్రలో గుర్తుకొచ్చినా కానీ ఇప్పటికీ కొంత మంది ఉలిక్కిపడుతున్నారంటే ఆ మహమ్మారి ఎంతలా తన పంజా విసిరిందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే ఏదైనా వైరస్ అంటే ప్రపంచవ్యాప్తంగా జనాలు ఆందోళనకు గురవుతున్నారు. కరోనాకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి టీకాను కనిపెట్టినా కానీ మహమ్మారి మాత్రం పూర్తిగా పోలేదు. నేటికి కూడా మహమ్మారి ఎక్కడో ఓ చోట తన పంజాను విసురుతూనే ఉంది. అందుకోసమే అందరూ కరోనా అంటేనే హడలిపోతున్నారు. ఎంతటి వైరస్ వచ్చినా దీనిలా ఉండదని అంతా నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. కానీ అంతకంటే డేంజరస్ వైరస్ డిసీజ్ x ను నిపుణులు గుర్తించారు.

కరోనాకు ఇది తాత

కరోనానే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందంటే దాని కంటే డేంజరస్ వైరస్ ను గుర్తించినట్లు నిపుణులు ప్రకటించారు. దీని వల్ల సంభవించే నష్టం ఊహకందని విధంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ ఓ) గురించి అందరికీ తెలుసు. ఈ సంస్థ ప్రపంచ మానవాళి ఆరోగ్యం గురించి చూసుకుంటుంది. అటువంటి సంస్థ కూడా ఈ వైరస్ డేంజరస్ అని తెలిపిందంటే అది ఎంత డేంజరో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ వైరస్ కు ఆరోగ్య సంస్థ డిసీజ్ ఎక్స్ అని నామకరం చేసింది ఇది కోవిడ్ -19 కంటే ప్రాణాంతకమైన మహమ్మారి అని యూకే ఆరోగ్య నిపుణురాలు ఒకరు స్పష్టం చేశారు. ఆమె 2020 మే నుంచి డిసెంబర్ వరకు యూకే వ్యాక్సిన్ టాస్క్‌ ఫోర్స్ అధ్యక్షురాలిగా సేవలందించిన కేట్ బింగ్‌ హామ్ తెలిపారు. ఆమె ఒక మీడియాతో మాట్లాడుతూ… కొత్త వైరస్ 1919-1920 నాటి వినాశకరమైన స్పానిష్ ఫ్లూకి సమానమైన ప్రభావాన్ని చూపుతుందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం డిసీజ్ ఎక్స్ అనేది ఒక కొత్త ఏజెంట్ కావచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. వైరస్, బాక్టీరియా లేదా ఫంగస్ వంటిది కూడా కావచ్చున్నారు. దీనికి ఎటువంటి చికిత్స కూడా అందుబాటులో లేదని తెలిపారు. 

50 మిలియన్లు ఔట్..! 

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని పొట్టన పెట్టుకుంది. ఇక ఇప్పుడు కొత్తగా వెలుగు చూసిన డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల మందిని పొట్టన పెట్టుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిపుణురాలు బింగ్‌ హామ్ ఇందుకు తన ఆందోళనను వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ… 1918-19 ఫ్లూ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కనీసం 50 మిలియన్ల మందిని చంపింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి కంటే రెండింతల ఎక్కువ మంది ఈ ఫ్లూ వల్ల మరణించారు. దీని వల్ల కూడా అదే సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. 

మరేం చేయాలి.. 

డిసీజ్ ఎక్స్ వ్యాధి నుంచి వచ్చే ముప్పును ప్రపంచం ఎదుర్కొనేందుకు ప్రపంచం సామూహిక టీకా డ్రైవ్‌లకు సిద్ధం కావాలని ఆమె తెలిపారు. అంతే కాకుండా రికార్డు సమయంలో ఆ టీకాలను అందించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లు లేదా అంతకంటే ఎక్కువ మరణాలకు కారణమైందని ఆమె తెలిపారు. కరోనా విషయంలో వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది కోలుకోగలిగారని తెలిపారు. డిసీజ్ ఎక్స్ విషయంలో అలా ఉండదని ఆమె హెచ్చరించారు. ఇది మీజిల్స్ వలే అంటు వ్యాధి అని పేర్కొన్నారు. అటవీ నిర్మూలన, ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు చిత్తడి నేలల నాశనం కారణంగా ఈ వైరస్ లు ఒక జాతి నుంచి మరొక జాతికి దూకుతున్నాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో ఈ పదాన్ని ఉపయోగించడం ప్రారంభించింది. మరియు ఒక సంవత్సరం తర్వాత, Covid-19 ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం ప్రారంభించింది. ఇక అప్పుడు అందరూ కరోనా గురించే ఎక్కువ చర్చించారు. కాబట్టి అది ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ డిసీజ్ ఎక్స్ అనేది అంతలా పాపులర్ కాకపోయినా కానీ కరోనా కంటే ఈ వ్యాధి ఎంత మాత్రం తక్కువ కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకు తగ్గట్లు మనం మెదులుకోవాలి.