మయన్మార్‌లో సైనిక వైమానిక దాడి: 133 మంది మృతి, మృతుల్లో 20 మంది చిన్నారులు

ఇటీవలి సంవత్సరాలలో జరిగిన అత్యంత ఘోరమైన దాడులలో ఇది ఒకటి. ఇంకా సమ్మె కారణంగా మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 100 కంటే మరణాలు సంభవించినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా.. మానవ హక్కుల మంత్రి ఆంగ్ మైయో మిన్‌ మాట్లాడుతూ.. మహిళలు మరియు చిన్న పిల్లలతో సహా దాదాపు 133 మందినిస్ సైనిక జుంటా పొట్టన పెట్టుకుందని అన్నారు. ఈ 133 మరణాల్లో సుమారు 20 మంది చిన్నపిల్లలు ఉన్నారని అయన తెలిపారు. ఇక […]

Share:

ఇటీవలి సంవత్సరాలలో జరిగిన అత్యంత ఘోరమైన దాడులలో ఇది ఒకటి. ఇంకా సమ్మె కారణంగా మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 100 కంటే మరణాలు సంభవించినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి.

కాగా.. మానవ హక్కుల మంత్రి ఆంగ్ మైయో మిన్‌ మాట్లాడుతూ.. మహిళలు మరియు చిన్న పిల్లలతో సహా దాదాపు 133 మందినిస్ సైనిక జుంటా పొట్టన పెట్టుకుందని అన్నారు. ఈ 133 మరణాల్లో సుమారు 20 మంది చిన్నపిల్లలు ఉన్నారని అయన తెలిపారు. ఇక మారణ హోమంలో సుమారు 50 మంది గాయపడ్డారు.

మంగళవారం ఉదయం సగయింగ్ ప్రాంతంలోని మారుమూల కంత్‌బాలు టౌన్‌షిప్‌లో సమ్మె చేపట్టారు. స్థానిక పరిపాలన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా పజిగి గ్రామంలో సుమారు 300 మంది ప్రజలు గుమిగూడి సమ్మె చేపట్టినట్టు సమాచారం. 

దీంతో మిలిటరీ జుంటా ఈ సంఘటన గురించి స్థానికుల నుండి సమాచారం స్వీకరించిన తర్వాత అవసరమైన వైమానిక దాడులను ప్రారంభించినట్లు ధృవీకరించింది. చనిపోయిన వారిలో కొందరు తిరుగుబాటు దారులుండగా, కొంత మంది సాధారణ పౌరులు కూడా ఉన్నారని జుంటా పేర్కొంది. 

ఈ మరణహోమాన్ని చేప్పట్టిన సైనిక జుంటాపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అనేక దేశాలు మరియు అంతర్జాతీయ ఏజెన్సీలు మయన్మార్ సైన్యాన్ని విమర్శించాయి.

UN హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ మాట్లాడుతూ.. ప్రాణాంతక వైమానిక దాడిని చూసి తాను “భయపడ్డాను” అని చెప్పాడు, దీని బాధితులు పాఠశాల పిల్లలు నృత్యాలు చేస్తున్నారని చెప్పారు, బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని ప్రపంచ సంస్థ పిలుపునిచ్చింది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ మాట్లాడుతూ, ఘోరమైన వైమానిక దాడితో తాను కూడా ఎంతగానో భయపడ్డానని అన్నారు. ఈ జుంటా డాన్స్ చేస్తున్న పాఠశాల విద్యార్థులను చంపిందన్న ఆయన.. బాధ్యులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ జుంటా గత రెండేళ్ళకు పైగా మయన్మార్ ప్రజలను హింసిస్తుందని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా కూడా ఇదొక హేయమైన చర్య అని ఆ దాడిని ఖండించింది.

తిరుగుబాటు వ్యతిరేకదారులని ఉగ్రవాదులగా ఆరోపిస్తున్న సైన్యం, గ్రామాలను ధ్వంసం చేయడం, సామూహిక హత్యలు మరియు పౌరులపై వైమానిక దాడులు వంటి హింసలకు పాల్పడటంతో  అంతర్జాతీయంగా విమర్శలు ఎదురవుతున్నాయి.

ఒకప్పుడు బర్మా పెరుగణించిన మయన్మార్(ప్రస్తుతం) అనే దేశం ఆగ్నేయాసియాలోని ఒక దేశం. దాదాపు 5 కోట్ల 70 లక్షల జనాభా ఉంది. ఇది మన ఆంధ్రప్రదేశ్‌ ఉన్నంత పెద్దది. ప్రస్తుతం మయన్మార్ ఆర్థిక, సామాజిక, రాజకీయ, మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎందుకంటే రెండేళ్ల క్రితం మొదలైన ప్రజాస్వామిక పునరుద్ధరణ ఉద్యమం అంతర్యుద్ధంగా మారింది.

గత రెండేళ్ల క్రితం మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వం..  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసింది. దీనిపై పలువురు నిరసన వ్యక్తం చేశారు.. వారిలో కొందరు అయిదాలతో నిరసన చేస్తే, మరికొందరు శాంతియుతంగా నిరసన చేపట్టారు. దీంతో సైనికులు వారిని చంపడం మొదలు పెట్టారు.  అప్పటి నుంచి డెబ్బై వేల మందికి పైగా దేశం విడిచి పారిపోయారని, మరో పది వేల మంది నిర్వాసితులయ్యారని నివేదికలు చెప్తున్నాయి. విద్యా, వైద్య వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని, దేశం విడిచి వెళ్లిన వారి కంటే సహాయం అవసరమైన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అంచనా.