భారత్‌లో కరోనా కేసులు పెరిగాయన్న WHO చీఫ్.. తాజా నివేదికలో విస్తుపోయే నిజాలు..

కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేసుల సంఖ్య నమోదు అవుతుంది. గడిచిన 24 గంటల్లో , ఈ శనివారంతో పాటు ఇప్పటివరకు 6,155 కేసులు నమోదు అయ్యాయని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ ఓ ప్రకటనలో తెలిపారు క్రియాశీల కేసుల సంఖ్య 31,194 కు పెరిగింది. ఈ పరిస్థితులు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశ జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడంతో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయని, దీనిని పరిష్కరించడానికి భారతదేశానికి అధిక […]

Share:

కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేసుల సంఖ్య నమోదు అవుతుంది. గడిచిన 24 గంటల్లో , ఈ శనివారంతో పాటు ఇప్పటివరకు 6,155 కేసులు నమోదు అయ్యాయని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ ఓ ప్రకటనలో తెలిపారు క్రియాశీల కేసుల సంఖ్య 31,194 కు పెరిగింది. ఈ పరిస్థితులు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి.

భారతదేశ జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడంతో కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయని, దీనిని పరిష్కరించడానికి భారతదేశానికి అధిక వ్యాక్సిన్ కవరిస్తూ పాటు బలమైన సర్వే టీం కూడా అవసరం అని వరల్డ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ ఆసియా చీఫ్ డాక్టర్ పూనమ్ కేత్రాపాల్ సింగ్ గట్టిగా చెప్పారు. భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ కేసుల పెరుగుదల నమోదు అవుతోంది. 2022లో ఒమిక్రాన్ సమయంలో కనిపించిన కేసుల కంటే కూడా ఇప్పుడు కేసులు మరింతగా పెరిగాయని.. గత సంవత్సరం సెప్టెంబర్ 16 తర్వాత మొదటిసారిగా రోజువారీ కేసులు 6000 మార్కులు దాటాయని తెలిపారు.  కోవిడ్ కేసులలో 14 మరణాలు సంభవించాయని మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా,  గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ , జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లో ఒక్కొక్కరి చొప్పున మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాలో తెలిపింది. 

ప్రస్తుతం భారతదేశంలో అంటువ్యాధులు అత్యధికంగా ప్రబలుతున్నాయని, ముఖ్యంగా కొత్త కొవిడ్ వేవ్‌లను మనందరం తట్టుకునే దిశగా అడుగులు వేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ శానిటైజింగ్ చేసుకోవడంతో పాటు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, వ్యక్తిగత శుభ్రత కూడా ఉండాలని సూచించారు. అదేవిధంగా చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలని అన్నారు. అదే విధంగా వైరస్ వ్యాప్తి చెందకుండా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని, వాక్సినేషన్ వేయించుకోవడం వల్ల ముందస్తుగా వైరస్ రాకుండా అడ్డుకోవచ్చని, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. అందువలన కోవిడ్ 19 ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవచ్చు అని ప్రమాదాన్ని అరికట్టవచ్చని ఆయన తెలిపారు.

కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వెంటనే కేసులను గుర్తించి చికిత్స తీసుకోవాల్సిన చర్యల పైన దృష్టి సారించాలని తెలిపింది. కేసుల ట్రాకింగ్ – ట్రేసింగ్ గురించి ప్రత్యేకంగా శ్రద్ద చూపించాలని తెలిపింది.. వచ్చే వారం దేశ వ్యాప్తంగా కోవిడ్ సంసిద్దత పైన మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ వివరించింది. 

తమిళనాడులో మాస్కు వినియోగం తప్పనిసరి చేసారు. ఉత్తరప్రదేశ్‌లో ఫ్రంట్ లైన్ వర్కర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రతీ ప్రాంతంలోనూ ముందుగా కోవిడ్ ఇన్ఫెక్షన్లను గుర్తించేలా పరీక్షల సంఖ్య పెంచాలని నిర్దేశించింది. ఢిల్లీ, హర్యానా ,కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకుల విషయంలోనూ కీలక సూచనలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తం అయ్యాయి. H3N2 ఇన్ఫ్లెయూంజా కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ప్రజలందరూ కూడా తప్పకుండా మాస్కులు ధరిస్తూ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాలని ప్రజలకు సూచనలు ఇస్తున్నాయి.