ముదురుతున్న సూడాన్ సంక్షోభం

సుడానీస్ సైన్యం మరియు ఆ దేశంలోని శక్తివంతమైన పారామిలిటరీ దళాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల మధ్య తమ పౌరులను రక్షించిన దేశాల్లో US మరియు UK ఉన్నాయి. ఆ దేశంలోని వివిధ ప్రాంతాలలో యుద్ధం కొనసాగుతున్నందున సూడాన్ నుండి తమ తమ పౌరులను తరలించడానికి పలు దేశాలు తమ ప్రయత్నాన్ని వేగవంతం చేశాయి. దేశంలోని పారామిలటరీ దళాల చీఫ్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మరియు సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫట్టా […]

Share:

సుడానీస్ సైన్యం మరియు ఆ దేశంలోని శక్తివంతమైన పారామిలిటరీ దళాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల మధ్య తమ పౌరులను రక్షించిన దేశాల్లో US మరియు UK ఉన్నాయి.

ఆ దేశంలోని వివిధ ప్రాంతాలలో యుద్ధం కొనసాగుతున్నందున సూడాన్ నుండి తమ తమ పౌరులను తరలించడానికి పలు దేశాలు తమ ప్రయత్నాన్ని వేగవంతం చేశాయి. దేశంలోని పారామిలటరీ దళాల చీఫ్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మరియు సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫట్టా అల్-బుర్హాన్‌లకు విధేయులైన బలగాల మధ్య దేశంలో హింస చెలరేగింది. ఇది వందల మంది ప్రాణాలను బలిగొంది. ఈ ఘర్షణలో వేలాది మంది గాయపడినట్లు నివేదికలు వెల్లడించబడ్డాయి.

యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ తమ దౌత్యవేత్తలు మరియు దేశం నుండి ఇతర ప్రవాసులను ‘సంక్లిష్టమైన మరియు వేగవంతమైన’ తరలింపును పూర్తి చేసినట్లు ఆదివారం ప్రకటించాయి. అదేవిధంగా, ఇతర దేశాలు కూడా తమ తరలింపులకు చర్యలు చేపట్టినట్లు తెలిపాయి.

రాజధాని నగరం ఖార్టూమ్‌లో చిక్కుకున్న ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆసియా నుండి చాలా మంది విదేశీ విద్యార్థులు కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో , వివిధ నగరాల్లో చిక్కుకుపోయిన వారికి సహాయం చేయడానికి ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు. కాగా సూడాన్ నుండి నిర్వాసితులు విజయవంతంగా ఖాళీ చేసిన దేశాలు:

సౌదీ అరేబియా

విదేశీయులు మరియు అధికారులతో సహా 150 మందిని సుడాన్ నుండి తరలించి సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్‌ను సౌదీ నావికా దళాలతో పాటు ఆర్మీలోని ఇతర శాఖలు నిర్వహించాయి. సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రక్షించబడిన వారిలో భారతదేశంతో సహా 12 దేశాలకు చెందిన విదేశీయులు ఉన్నారు. ఇతర దేశాల పౌరులలో కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ట్యునీషియా, పాకిస్తాన్, బల్గేరియా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, కెనడాతో పాటు మరికొన్ని దేశాలు ఉన్నట్లు సౌదీ అరేబియా దేశ అధికార వర్గాలు తెలిపాయి.

సంయుక్త రాష్ట్రాలు

సుడాన్ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) ఆదివారం మాట్లాడుతూ.. విదేశీయులు మరియు వారి కుటుంబాలను ఆ దేశం నుండి ఖాళీ చేయడానికి అమెరికన్ దళాలను ‘సమన్వయం’ చేశామన్నారు. పారామిలిటరీ బలగాలు’ అన్ని దౌత్య కార్యకలాపాలతో పూర్తి సహకారాన్ని అందిస్తామని, అవసరమైన అన్ని రక్షణ మార్గాలను అందజేస్తామని’ ప్రతిజ్ఞ చేశాయి. 

కెనడా

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం మాట్లాడుతూ.. తమ దేశానికి చెందిన దౌత్యవేత్తలందరినీ సురక్షితంగా తీసుకువచ్చామని, ఇప్పుడు సూడాన్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేశామని, అన్నారు. మేము సుడాన్‌లో కెనడా కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశామని… అదేవిధంగా మా ప్రజలు సురక్షితంగా ఉన్నారని అన్నారు.

యూరోపియన్ దేశాలు

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జిబౌటి మాట్లాడుతూ.. వివిధ దేశాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ధృవీకరించారు. 101 మందితో కూడిన విమానం సూడాన్ నుంచి బయలుదేరిందని జర్మనీ సైన్యం తెలిపింది. అదేవిధంగా, ఇటలీ మరియు స్పెయిన్ కూడా అర్జెంటీనా, కొలంబియా, పోర్చుగల్, మెక్సికో, ఐర్లాండ్, వెనిజులా, పోలాండ్ మరియు సూడాన్ నుండి ఇతర విదేశీ పౌరులతో పాటు తమ పౌరులను ఖాళీ చేయించారన్నారు.