వీసాల విషయంలో కీలక ప్రకటన చేసిన అమెరికా

కరోనా వచ్చిన తర్వాత ప్రపంచ పర్యటక దేశాలలో పర్యటన రంగం ఎంతవరకు కుదేలైందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే కూడా కొన్ని దేశాలలో పర్యటన రంగంలో వృద్ధి అంతంత మాత్రం గానే ఉంది. అయితే ప్రస్తుతం అమెరికా పర్యటన రంగ వృద్ధి కోసం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రస్తుతానికి తెలుస్తోంది అంతేకాకుండా భారతీయుల వీసా మంజూరు విషయంలో నిరీక్షణ సమయం, అంటే వెయిటింగ్ టైం తగ్గించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అమెరికా.  కీలక ప్రకటన చేసిన […]

Share:

కరోనా వచ్చిన తర్వాత ప్రపంచ పర్యటక దేశాలలో పర్యటన రంగం ఎంతవరకు కుదేలైందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే కూడా కొన్ని దేశాలలో పర్యటన రంగంలో వృద్ధి అంతంత మాత్రం గానే ఉంది. అయితే ప్రస్తుతం అమెరికా పర్యటన రంగ వృద్ధి కోసం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రస్తుతానికి తెలుస్తోంది అంతేకాకుండా భారతీయుల వీసా మంజూరు విషయంలో నిరీక్షణ సమయం, అంటే వెయిటింగ్ టైం తగ్గించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చింది అమెరికా. 

కీలక ప్రకటన చేసిన యుఎస్: 

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సమయంలో పర్యటక రంగం సుమారు అన్ని దేశాలలో ఎన్నో నష్టాలను చవిచూసింది అయితే కరోనా తర్వాత కూడా పర్యాటక రంగంలో వృద్ధి కోలుకోలేని విషయంగా మారింది ముఖ్యంగా అమెరికాలో పర్యటక రంగ పరిస్థితి కూడా ఇప్పుడు ఇదే విధంగా నష్టాల్లోనే ఉన్నాదని చెప్పుకోవాలి. అందుకునే భారతీయుల వీసా విషయంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. వీసాలు మంజూరు చేసే వెయిటింగ్ టైం తగ్గించేందుకు ప్రయత్నాలు సిద్ధం చేసింది. 

స్పెయిన్ దేశంలో పర్యాటక రంగం: 

అయితే ఒక వైపు అన్ని దేశాలు నష్టాల్లో కూరుకుపోయి ఉంటే, మన స్పెయిన్ దేశంలో మాత్రం కరోనా ముందుతో పోలిస్తే ప్రస్తుతం 86% పర్యాటక రంగ వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే సుమారు పర్యట రంగ వృద్ధి 28% అభివృద్ధి జరిగినట్లు స్పెయిన్ దేశం ప్రకటించింది. అయితే మరోపక్క యూఎస్ లో మాత్రం గణాంకాలు దీనికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 

కరోనా తర్వాత కూడా అమెరికా వంటి అగ్రరాజ్యం ప్రస్తుతం పర్యటక రంగంలో మాత్రం వృద్ధిలోకి రాలేనట్లే కనిపిస్తుంది. అమెరికాలో ట్రావెల్ అసోసియేషన్ ప్రకారం అందిన సమాచారం ఏంటంటే, ఈ సంవత్సరం జూన్ నాటికల్లా యూఎస్ లో మొత్తం పర్యటించిన వారి సంఖ్య 2018 తో పోలిస్తే, సుమారు 26% తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నష్టాల్లో ఉన్న పర్యటక రంగంలో ఖర్చు విషయంలో కూడా అత్యధికంగా తగ్గిందని చెప్పుకోవాలి. ఎందుకంటే, 2020లో పర్యటక రంగానికి పర్యటకుల ద్వారా సుమారు 99 బిలియన్ డాలర్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇది మునప్పటి ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అంటే ఎందుకంటే, ఇతర దేశాల నుంచి వీసాలపై వచ్చిన పర్యటకుల కోసం 108 బిలియన్ డాలర్లు వరకు ఖర్చులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అంటే దీనితో పోలిస్తే, పర్యటకుల ద్వారా వచ్చిన ఆదాయం సగానికి తగ్గినట్లే అన్నమాట. అయితే అగ్రరాజ్యం అమెరికాలో పర్యటకుల అలికిడి తగ్గడానికి కారణం, వీసా ప్రాసెస్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. అంతేకాదు, నష్టాన్ని వృద్ధుల్లోకి తెచ్చుకోవడానికి విశాలమైన హోటల్స్, తమ రూమ్ రేట్స్ కూడా పెంచడం అనేది, అమెరికాలో పర్యటకుల రద్దీ తగ్గించడానికి ఒక కారణం అని చెప్పాలి.

ఎవరైనా అమెరికా వెళ్లడానికి వీసా కోసం అప్లై చేసుకోగా, మంజూరు చేయడానికి సుమారు 400 రోజులు పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పర్యటకుల రద్దీ కూడా తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యుఎస్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అమెరికాకు ఏటా ఎంతోమంది భారతీయులు వెళ్తారని గ్రహించిన అమెరికా, అందుకునే భారతీయుల వీసా విషయంలో కీలక ప్రకటన చేసింది. వీసాలు మంజూరు చేసే వెయిటింగ్ టైం తగ్గించేందుకు ప్రయత్నాలు సిద్ధం చేసింది.