మరోమారు తన వక్రబుద్ధి బయటపెట్టిన చైనా

చైనా కంట్రీ మన దేశం మీద అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. మన పొరుగున ఉండి నిత్యం దాడులు చేస్తూనే ఉంది. దీంతో మన దేశం చైనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. మన దేశం ఎటువంటి ఘనతను సాధించినా కానీ దానిని ఒప్పుకునేందుకు చైనా దేశం సిద్ధంగా ఉండడం లేదు. మనం చాలా విషయాలలో కాంప్రమైజ్ అవుతున్నా కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. రీసెంట్ గా చూసుకుంటే చైనాలో […]

Share:

చైనా కంట్రీ మన దేశం మీద అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. మన పొరుగున ఉండి నిత్యం దాడులు చేస్తూనే ఉంది. దీంతో మన దేశం చైనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. మన దేశం ఎటువంటి ఘనతను సాధించినా కానీ దానిని ఒప్పుకునేందుకు చైనా దేశం సిద్ధంగా ఉండడం లేదు. మనం చాలా విషయాలలో కాంప్రమైజ్ అవుతున్నా కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. రీసెంట్ గా చూసుకుంటే చైనాలో నిరుద్యోగం ఘోరంగా పెరిగిపోతుంది. అదే సమయంలో మన ఇండియన్ ఎకానమీ మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. దీంతో చైనా మన మీద మరింత అక్కసును పెంచుకుంటోంది. మన దేశ సరిహద్దుల మీద దాడులు చేస్తోంది. అయినా కానీ ఇండియా ఏ మాత్రం భయపడడం లేదు. 

జీ20 మీద కూడా అక్కసే.. 

మన ఇండియాలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని విధంగా జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. జీ20 సమావేశాలను దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇటు ఢిల్లీ గవర్నమెంట్ తో పాటు అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సమావేశాలను ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తున్నాయి. ఇటువంటి సమయంలో కూడా చైనా తన అక్కసును వెళ్లగక్కింది. జీ 20 సమావేశాలను తన సొంత ఎజెండా కోసం భారత్ వాడుకుంటోందని చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖతో అనుబంధంగా ఉన్న థింక్ ట్యాంక్ ఆరోపించింది. అంతే కాకుండా ఇండియా చైనా ప్రయోజనాలకు హాని కలిగించడానికి G20 సమ్మిట్‌ ను హోస్ట్ చేస్తోందని అంది. ఆ విధంగా ఇండియా తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని కూడా ఆరోపించింది. 

అధ్యక్షుడు కూడా హాజరు కాలే

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఈ సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో చైనా దుర్బుద్ధి మరోమారు బయటపడింది. చైనా అధ్యక్షుడు రాకపోగా.. ఆ దేశానికి చెందిన సంస్థలు కూడా ఇండియా మీద అక్కసును బయటపెట్టాయి. చేయనివి చేసినట్లు చెబుతూ ఆ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. చైనా ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జీ 20 సమ్మిట్ హోస్ట్‌ గా ఇండియా తన బాధ్యతను నెరవేర్చడానికి సహాయపడటమే కాకుండా మరిన్ని సమస్యలను కూడా సృష్టిస్తుందని థింక్ ట్యాంక్ ఆరోపించింది. 

ఇటీవలే వివాదాస్పద మ్యాప్

చైనా ఇటీవలే వివాదాస్పద మ్యాప్ ను రిలీజ్ చేసింది. ఎప్పటి నుంచో ఇండియా భూభాగాలు తనవని చెబుతూ వస్తున్న చైనా జీ20 సమావేశాలకు కొద్ది రోజుల ముందు అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని భూభాగాలు మరియు కాశ్మీర్ లోని కొన్ని భూభాగాలను తమ భూభాగాలని క్లెయిమ్ చేస్తూ మ్యాప్ రిలీజ్ చేసింది. ఈ మ్యాప్ చాలా వివాదాస్పదం అయింది. సోషల్ మీడియాలో థింక్ ట్యాంక్ ఇలా పేర్కొంది. దౌత్యపరమైన మరియు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేయడంతో పాటు, వివాదాస్పద భూభాగాల్లో సమావేశాలను నిర్వహించడంలో భారతదేశం యొక్క చర్యలు కూడా ఆందోళనలకు గురి చేసేలా ఉన్నాయని ఆరోపించింది. 

నరేంద్రమోదీ నిర్వహిస్తున్న జీ 20 శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కాలేదు. దీనిపై మన అధికారులు, మీడియా చైనాను ఎన్ని ప్రశ్నలు సందించినా కానీ ఎవరూ ఆన్సర్ చేయలేదు. జిన్ పింగ్ ప్లేస్ లో చైనా తరపున ప్రధాని ప్రీమియర్ లీ కియాంగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చైనా అంటే ఇప్పటికే మన దేశంలో చాలా మంది అదో దేశమా అని అంటూ ఉంటారు. జీ 20 సమావేశాల నేపథ్యంలో చైనా వక్ర బుద్ధి మరోసారి బయటపడింది. ఎన్ని రోజులైనా సరే చైనా మారదంటూ ఈ విషయం విన్న చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఇండియా ఓ పక్క దూసుకుపోతుంటే మాత్రం చైనా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దీనిపై ఒక్కోరు ఒక్కోలా స్పందిస్తున్నారు. చైనా వైఖరిని తప్పుబడుతున్నారు.