తైవాన్‌లో చైనీస్ బెలూన్ కలకలం

తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ దీవుల్లో ఒకదానిలో చైనా బెలూన్ కనుగొనబడిందని తెలిపింది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చైనా అనుమానిత గూఢచారి బెలూన్‌లను పంపిస్తోందన్న అమెరికా ఆరోపణల నేపథ్యంలో.. తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తమ దీవుల్లో ఒకదానిలో చైనా బెలూన్ కనుగొనబడిందని తెలిపింది. చైనా తీరానికి సమీపంలో ఉన్న మారుమూల మరియు వ్యూహాత్మకంగా ఉన్న ద్వీపంలో చైనా నుండి క్రాష్ అయిన వాతావరణ బెలూన్ అవశేషాలను కనుగొన్నట్లు తైవాన్ సైన్యం తెలిపింది. దీంతో […]

Share:

తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ దీవుల్లో ఒకదానిలో చైనా బెలూన్ కనుగొనబడిందని తెలిపింది

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చైనా అనుమానిత గూఢచారి బెలూన్‌లను పంపిస్తోందన్న అమెరికా ఆరోపణల నేపథ్యంలో.. తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తమ దీవుల్లో ఒకదానిలో చైనా బెలూన్ కనుగొనబడిందని తెలిపింది. చైనా తీరానికి సమీపంలో ఉన్న మారుమూల మరియు వ్యూహాత్మకంగా ఉన్న ద్వీపంలో చైనా నుండి క్రాష్ అయిన వాతావరణ బెలూన్ అవశేషాలను కనుగొన్నట్లు తైవాన్ సైన్యం తెలిపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా వస్తుందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ బెలూన్లలో చైనాలోని తైయువాన్ నగరంలోని ప్రభుత్వ యాజమాన్యం ఎలక్ట్రానిక్స్ కంపెనీగా రిజిస్టర్ చేయబడిన పరికరాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ బెలూన్ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ తీరానికి సమీపంలో మాట్సు ద్వీపంలోని తుంగ్యిన్‌లో కనుగొనబడిందని పేర్కొంది. ఇప్పటికే ఇటువంటి బెలూన్ ఒకటి అమెరికాలో కనిపించగా.. అక్కడి బైడెన్ ప్రభుత్వం దానిని కూల్చేసింది. అంతే కాకుండా బైడెన్ మాట్లాడుతూ.. తాము చైనాను అస్సలుకే క్షమాపణ అడగబోమని వెల్లడించారు. 

అంతర్యుద్ధం మధ్య 1949లో చైనా నుండి విడిపోయిన తర్వాత తైవాన్ ద్వీపాలపై నియంత్రణను నిలుపుకుంది. తైవాన్‌ను లొంగదీసుకోవడానికి చైనా దాడి చేస్తే ఈ ద్వీపాలు మొదటి రక్షణ శ్రేణిగా పనిచేస్తాయని నమ్ముతారు తైవాన్ ప్రజలు. కాబట్టే చైనా ఇక్కడి సమాచారాన్ని సేకరించేందుకు ఇలా చేసిందంటూ కొంత మంది ఆరోపిస్తుంటే.. అటువంటిదేం ఉండదు చైనా అలా చేయదు అని కొంత మంది అంటున్నారు. ఏదేమైనా అమెరికా దేశంతో పాటుగా తైవాన్​ దేశంలో కూడా చైనా బెలూన్లు కనిపించడం కలకలం రేపుతోంది.  

నివేదికలో గుర్తించబడిన తైయువాన్ వైర్‌సెల్ (రేడియో) ఫస్ట్ ఫ్యాక్టరీ లిమిటెడ్‌‌కి చేసిన  కాల్స్‌‌కి కానీ, మెసేజస్‌‌కి సమాధానం ఇవ్వలేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. పరికరంలోని సమాచారం చైనా ప్రధాన భూభాగంలో ఉపయోగించే సరళీకృత చైనీస్ అక్షరాలతో రాసి ఉన్నట్లు పేర్కొంది. ఈ బెలూన్ ఇక్కడి నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తోందని, లేకపోతే.. బెలూన్​ను తయారు చేసిన కంపెనీకి కాల్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు? 

కాగా.. చైనా బెలూన్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన తాజా ప్రకటనపై చైనా స్పందించింది. ’ఉత్తర అమెరికా ఆకాశంలో కూల్చివేసిన చైనీస్ బెలూన్ల ఉద్దేశ్యం గూఢచర్యం కాదని బైడెన్ చెప్పారు. ఈ విషయంపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మాట్లాడతానని కూడా ఆయన అన్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు, పెంచేందుకు చర్చలు జరపాలని అమెరికాను కోరలేమని చైనా తెలిపింది. అక్కడి బెలూన్​ను దారుణంగా కూల్చేసి మళ్లీ చర్చలు జరుపుతానడం భావ్యం కాదని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

బైడెన్​కు తాకిన సెగ.. 

చైనాకు చెందిన ఓ భారీ బెలూన్​ను అమెరికాలో కూల్చేసిన తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చైనాను క్షమాపణ అడిగే ప్రసక్తే లేదని అవసరమైతే తాను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్​తో సమావేశం అయ్యేందుకు కూడా రెడీగా ఉన్నట్లు తెలిపారు. కానీ అక్కడి మీడియా ప్రతినిధులు కొందరు మీ కుటుంబానికి చైనాలో వ్యాపారాలు ఉండడం వల్లే ఇలా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన బైడెన్ తనకు విశ్రాంతి కావాలని చెప్పి లోపలికి వెళ్లిపోయారు.