విద్యార్థుల‌కు విషం పెట్టిన‌ టీచ‌ర్‌కు ఉరి శిక్ష‌

అయితే చైనాలో ఇటువంటి కిండర్ గార్డెన్ దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతుండడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అయితే మార్చి 2019లో, వాంగ్ యున్ తోటి టీచర్‌తో వివాదం పెట్టుకున్న తర్వాత, కొంత సోడియం నైట్రేట్‌ను కొనుగోలు చేయడం జరిగింది. మరుసటి రోజు ఉదయం కిండర్ గార్టెన్‌లో ఆమె పిల్లల “ఎయిట్ ట్రెజర్స్ గంజి”లో కొంత సోడియం నైట్రేట్ కలపడం కారణంగా చాలామంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు. అంతేకాకుండా ఒక పిల్లవాడు చనిపోయాడు. అయితే ఈ సంఘటనలో సుమారు పాతికమంది […]

Share:

అయితే చైనాలో ఇటువంటి కిండర్ గార్డెన్ దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతుండడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అయితే మార్చి 2019లో, వాంగ్ యున్ తోటి టీచర్‌తో వివాదం పెట్టుకున్న తర్వాత, కొంత సోడియం నైట్రేట్‌ను కొనుగోలు చేయడం జరిగింది. మరుసటి రోజు ఉదయం కిండర్ గార్టెన్‌లో ఆమె పిల్లల “ఎయిట్ ట్రెజర్స్ గంజి”లో కొంత సోడియం నైట్రేట్ కలపడం కారణంగా చాలామంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు. అంతేకాకుండా ఒక పిల్లవాడు చనిపోయాడు. అయితే ఈ సంఘటనలో సుమారు పాతికమంది పిల్లలు అస్వస్థకు గురైనట్లు అప్పట్లో పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఆమె మీద కేసు నమోదు చేశారు. ఇటీవల ఈ కేసు విషయంలో తుది జడ్జిమెంట్ తీసుకోవడం జరిగింది. పిల్లల మీద కక్ష తీర్చుకోవటానికి ప్రయత్నించిన టీచర్ కి మరణశిక్ష విధించారు చైనా ప్రభుత్వం. 

విషయం ఏంటంటే: 

నాలుగేళ్ల క్రితం పిల్లలు తాగే గంజిలో సోడియం నైట్రేట్‌తో కలిపి ఒక చిన్నారిని చంపి, మరో 24 మందిని అస్వస్థకు గురయ్యేలా చేసిన ఒక మాజీ కిండర్ గార్టెన్ టీచర్‌ను ఈ వారం సెంట్రల్ చైనాలో ఉరితీసినట్లు రాష్ట్ర మీడియా శుక్రవారం నివేదించింది. 39 ఏళ్ల వాంగ్ యున్, హెనాన్ ప్రావిన్స్‌లోని జియాజువో సిటీ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు 2020 సెప్టెంబరులో మొదట్లో శిక్ష గురించి సరైన ఆధారాలు లేక శిక్ష విషయంలో వెనక్కి తగ్గింది.

గురువారం, అదే కోర్టు వాంగ్ చేసిన ఘోరాన్ని స్పష్టంగా తెలుసుకుని ఆధారాలతో సహా పట్టుకుని, ఆమెకు మరణశిక్షను అమలు చేసింది. 

ఆమె ఎందుకు ఇలా చేసింది: 

కిండర్ గార్డెన్ లో పనిచేస్తున్న ఒక టీచర్ మరొక టీచర్ తో వాగ్వాదం దిగింది. అయితే టీచర్ మీద కోపంతో పిల్లల్ని ఏదో ఒకటి చేయాలనుకుంది. మరుసటి రోజు ఉదయం కిండర్ గార్టెన్‌లో ఆమె పిల్లల ఆహారంగా తీసుకునే “ఎయిట్ ట్రెజర్స్ గంజి”లో విషపూరితమైన పదార్థం కలిపింది. అయితే నిజానికి “ఎయిట్ ట్రెజర్స్ గంజి” అనేది తియ్యగా ఉండే బియ్యం-ఆధారిత గంజి లాంటిది, ఇది చైనాలో బాగా చాలా ఫేమస్ ఫుడ్.

జనవరి 2020లో, ఈ గంజి తిన్న పిల్లలలో ఒకరు, అందులో కలిసిన విషం కారణంగా అవయవ వైఫల్యంతో మరణించారు. మరో 24 మందికి స్వల్ప అస్వస్థత కలిగింది, అని రాష్ట్ర మీడియా నివేదించింది.

ఇటీవలి సంవత్సరాలలో చైనీస్ కిండర్ గార్టెన్‌లలో మరణాలకు, హింసకు సంబంధించిన అనేక హై ప్రొఫైల్ కేసులలో వాంగ్ కేసు ఒకటి.

ఇలాంటివి మరెన్నో జరిగాయి: 

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌పై సోమవారం 25 ఏళ్ల వ్యక్తి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు, ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు మరియు ఒకరికి గాయాలు, పాఠశాలలో పిల్లలపై హింస గురించి ఆందోళన చెందుతున్నారు తల్లితండ్రులు. మానవ హక్కుల NGO ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంచనాల ప్రకారం, చైనా ప్రతి సంవత్సరం వేల మందిని ఉరితీస్తుంది, ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ.

అసలు ఎలాంటి సంఘటనలు పాఠశాలలో ఎందుకు జరుగుతున్నాయో కూడా అంచనా వేయడానికి చాలా ఊహాగానాలు వెలుగులోకి వస్తున్నాయి. టీచర్ మీద మరొక టీచర్ కి కోపం వస్తే పిల్లల మీద కోపం చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు.