హర్దీప్ సింగ్ నిజ్జార్‌ హత్య వెనక చైనా ప్రమేయం! 

గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటుకు తెలియజేశారు. అయితే ఒక బ్లాగర్ ఇదంతా చైనా చేస్తున్న కుట్ర అంటూ పలు […]

Share:

గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటుకు తెలియజేశారు. అయితే ఒక బ్లాగర్ ఇదంతా చైనా చేస్తున్న కుట్ర అంటూ పలు ఆధారాలతో బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు, ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

ఇదంతా చైనా కుట్రేనా?: 

ఒక స్వతంత్ర బ్లాగర్, జెన్నిఫర్ జెంగ్ అని ఒక అమ్మాయి, ప్రపంచ దేశాల దృష్టిలో భారతదేశాన్ని తక్కువ చేయాలని, కొత్త ప్రణాళికతో హర్దీప్ సింగ్ నిజ్జార్‌ హత్య విషయంలో ఆరోపణలను భారతదేశం వైపు మళ్ళించడానికి చైనా కుట్ర పన్నింది అంటూ.. ఒక ఘాటైన వార్త బయట పెట్టింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా, తైవాన్‌కు సంబంధించి Xi Jinping సైనిక వ్యూహానికి అనుగుణంగా ప్రపంచాన్ని అంతరాయం కలిగించడం, CCP చేస్తున్న పకడ్బందీ ప్లాన్ లో భాగమే అంటూ ఆమె ఆరోపించింది. 

చైనీస్ రచయిత మరియు యూట్యూబర్ లావో డెంగ్, ఎవరైతే ప్రస్తుతం కెనడాలో అంటున్నారో, ఆ వ్యక్తి అందించిన సమాచారం ప్రకారం, ఈ విషయాన్ని మరింత నొక్కి చెప్పింది, జెన్నిఫర్ జెంగ్. కెనడాలోని సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హత్య చేసే పనిలో ఏజెంట్లు ఉన్నారని.. కుట్రకు సంబంధించిన సమావేశం తరువాత, CCP ఏజెంట్లు హత్యా ప్రణాళికను నిశితంగా అమలు చేశారు అని ఆమె పేర్కొంది. జూన్ 18న, సైలెన్స్డ్ తుపాకీలు తీసుకుని ఏజెంట్లు, నిజ్జర్‌ను ట్రాక్ చేశారని.. అయితే హత్య జరిగిన అనంతరం ఎటువంటి సాక్ష్యాలను బయటపడనివ్వకుండా నిజ్జర్స్ కారులోని డాష్ కెమెరాను ధ్వంసం చేశారని.. అయితే ఏజెంట్లకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకుండా మొత్తం అన్ని నాశనం చేశారని.. హత్య చేసిన అనంతరం కెనడా నుంచి పారిపోయారని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

దీనికి సంబంధించి ప్రస్తుతం ఎవరి వైపు నుంచి, ఏ దేశం నుంచి కూడా స్పందన అయితే ఇప్పటివరకు రాలేనట్లే కనిపిస్తోంది. 

ఆరోపణలను సహించబోము: 

అయితే దేశ పరువు తీయడానికి ట్రూడో చేసిన ప్రయత్నంపై భారత రాజకీయ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. 

బెదిరింపులకు దిగడమే కాకుండా, ప్రస్తుతం కెనడా, భారతదేశానికి ఒక వైపు నుంచి హాని కలిగించాలి అనుకునే కొన్ని దేశాలు చైనా, రష్యా, టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాలతో జతకట్టడానికి ప్రయత్నిస్తుంది. ఒబామా పరిపాలనలో 2013 చట్టం ప్రకారం US కూడా అదే ప్రింప్షన్ సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది.

ఏది ఏమైనప్పటికీ, ట్రూడో ఆరోపణలకు ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పడం జరిగింది భారత జాతీయ భద్రతా స్థాపన. అంతర్జాతీయ చట్టాల పరిధిలో ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటుందని స్పష్టంగా తెలుస్తోంది. నిజ్జర్‌ను కాల్చిచంపడంతో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, ఖలిస్తానీ రాడికల్‌లు విదేశాల్లో లేదా భారతదేశంలోని భారతీయ ఆస్తులకు ముప్పు కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవడం కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. అంతేకాకుండా నిజానికి భారతదేశం వెనక్కి తగ్గడం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీయనివ్వదని స్పష్టమవుతోంది. 

కెనడాలో ఒక అటాక్ ద్వారా ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగిందని తెలిసిన విషయమే. అయితే సరైన ఆధారాలు డాక్యుమెంట్స్ చూపించకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని జయశంకర్ అభిప్రాయపడ్డారు.. అంతేకాకుండా సరైన సమాచారం ఉంటే ముందడుగు వేయచ్చని ఎటువంటి ఆధారాలు లేకుండా, ముందుకు సాగడం కష్టమని మరొకసారి గుర్తు చేశారు జయశంకర్. ఇటీవల మరి ముఖ్యంగా భారతీయులకు కొత్త వీసాలను సస్పెండ్ చేసినందుకు కెనడా ప్రభుత్వం మీద మండిపడ్డారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్.