అండాలను భద్రపరుచుకునే ప్రక్రియలో తైవాన్ మహిళలు

రీప్రొడక్టివ్ టెక్నాలజీతో వేలాది మంది తైవాన్ మహిళలు తమ అండాలను భద్రపరుచుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ అండాలను భద్రపరుచుకునే ధోరణి, ప్రస్తుతం తైవాన్ లో 33 మరియు 39 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలలో కనిపిస్తుంది. వారు తమ సంతానోత్పత్తిని కాపాడుకోవడానికి, జీవితంలో కాస్త లేటుగా బిడ్డను కనే అవకాశాన్ని కల్పించడానికి వారి అండాలను భద్రపరచుకుంటున్నారు.  బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్ ఇందులో ఒకరు:  ఈ మహిళల్లో 33 ఏళ్ల తైవాన్ బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్ […]

Share:

రీప్రొడక్టివ్ టెక్నాలజీతో వేలాది మంది తైవాన్ మహిళలు తమ అండాలను భద్రపరుచుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ అండాలను భద్రపరుచుకునే ధోరణి, ప్రస్తుతం తైవాన్ లో 33 మరియు 39 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలలో కనిపిస్తుంది. వారు తమ సంతానోత్పత్తిని కాపాడుకోవడానికి, జీవితంలో కాస్త లేటుగా బిడ్డను కనే అవకాశాన్ని కల్పించడానికి వారి అండాలను భద్రపరచుకుంటున్నారు. 

బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్ ఇందులో ఒకరు: 

ఈ మహిళల్లో 33 ఏళ్ల తైవాన్ బ్రాండ్ మార్కెటింగ్ డైరెక్టర్ వివియన్ తుంగ్ కూడా తమ అండాలను భద్రపరుచుకోవడంలో భాగమైనట్లు తెలుస్తోంది. ఆమె ఇటీవల అండాలను భద్రపరుచుకునే ప్రాసెస్ మొదలుపెట్టారంట, అంతే కాకుండా, ఈ ప్రాసెస్ సుమారు రెండు వారాలు ఉంటుంది అని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ప్రాసెస్ లో భాగంగా హార్మోన్లకు సంబంధించిన ఒక ఇంజక్షన్ తమకు తాముగా, రెండు వారాలపాటు ఇంజక్ట్ చేసుకుంటూ ఉంటారు ఆమె వెల్లడించింది.

తుంగ్ చెప్పిన విధానం బట్టి, అండాలను భద్రపరుచుకునే ప్రాసెస్ అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. తైవాన్‌లోని చాలా మంది స్వతంత్ర, కెరీర్ లక్ష్యంగా చేసుకున్న మహిళలు ఎక్కువగా ఉండటం, లేటుగా పెళ్లిళ్లు చేసుకునే విషయంలో మహిళలు తీసుకుంటున్న నిర్ణయాలు వల్ల, ఇటువంటి ప్రాసెస్ మీద చాలామంది ఆధారపడుతున్నారు తైవాన్ మహిళలు. వారు అండాలను భద్రపరుచుకునే ప్రాసెస్ వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఒక మార్గంగా చూస్తారు. అంతేకాకుండా వారు ఎప్పుడైతే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంటారు వారు అప్పుడు, తమ ముందుగానే భద్రపరచుకున్న అండాలను ఉపయోగించే క్రమంలో పడతారు. తుంగ్ కుటుంబం ఆమె నిర్ణయానికి చాలా మద్దతునిస్తుంది, ఇది మహిళలకు వారి పిల్లల కనడం విషయంలో అధికారం ఇచ్చే వ్యక్తిగత బెస్ట్ ఆప్షన్ అని అర్థం చేసుకున్నారు.

పెరుగుతున్న డిమాండ్: 

అండాలను భద్రపరుచుకునే ప్రాసెస్ కి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, తైవాన్ లోని సంతానోత్పత్తి రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. ప్రతి స్త్రీకి 0.89 మంది పిల్లలు, అంటే నిజానికి నార్మల్ గా ఉండాల్సిన రేట్ 2.1 కంటే సగం కంటే తక్కువ. దేశంలోని చట్టాలు ప్రస్తుతం పెళ్లయిన వారు మాత్రమే తాము భద్రపరుచుకున్న అండాలను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తోంది. అంటే పెళ్లి కాకుండా ఈ ప్రాసెస్ ఉపయోగించినప్పటికీ, అండాలను ఉపయోగించడం మాత్రం పెళ్లయిన తర్వాత మాత్రమే పరిమిత చేసింది. ఫలితంగా, తైవాన్‌లో కేవలం 8% మంది మహిళలు మాత్రమే తాము భద్రపరచుకున్న అండలను ఉపయోగిస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్‌లో  38% మంది అండాలను భద్రపరుచుకునే ప్రాసెస్ ఉపయోగిస్తున్న వారు ఉన్నారు.

అయితే,తైవాన్‌ దేశంలో కూడా పిల్లల విషయంలో మార్పుపై ఆశ ఉన్నట్లే కనిపిస్తోంది. తైవాన్‌ 2019లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఆసియాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల స్వలింగ జంటలకు ఉమ్మడిగా బిడ్డను దత్తత తీసుకునే హక్కును మంజూరు చేసింది. భద్రపరచుకున్న అండాల యాక్సెస్‌కు సంబంధించి తైవాన్ చట్టాలు భవిష్యత్తులో కూడా అభివృద్ధి చెందవచ్చని చాలా మంది నిపుణులు విశ్వసిస్తున్నారు.

తైపీలోని షిన్ కాంగ్ వు హో-సు మెమోరియల్ హాస్పిటల్‌లోని పునరుత్పత్తి వైద్య కేంద్రం, చీఫ్ డైరెక్టర్ లి యి-పింగ్, ఈ సమస్యపై సామాజిక ఏకాభిప్రాయం ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. విధాన మార్పులకు అవకాశం ఉన్నప్పటికీ, వివిధ కారణాలవల్ల దీనికి సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. తైవాన్ రిప్రొడక్టివ్ అసోసియేషన్ ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేయడానికి, అండాలను భద్రపరుచుకునే ప్రాసెస్ మాత్రమే కాకుండా, భద్రపరచుకున్న అండాలను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.