శిధిలావస్థకు చేరుకున్న ఒకప్పటి జస్టిన్ ట్రూడో నివాసం

పూర్వకాలం నాటి నుంచి వస్తున్న రాజభవనాలకు ఎంతో ప్రసిద్ధి ఉంటుంది. పైగా ఆ రాజభవంతులు ఎంతోమంది అతిధులకు ఆహ్వానం ఇచ్చి ఉంటుంది. ఆ భవనంకు పేరు ప్రఖ్యాతలతో పాటు విలాసవంతమైన సౌకర్యాలను కలిగి ఉంటుంది. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ రాజ భవనం ఇప్పుడు కీటకాలు, ఎలుకలతో నివాసం ఉంటుంది. ఒకప్పుడు మిరుమిట్లు గొలిపే రాజభవనంలా మెరిసిపోతుంటే ఇప్పుడు పాడుబడ్డ భవంతిలా తయారయింది. ఎంతోమంది ప్రధానులకు ఆతిథ్యం ఇచ్చిన ఆ రాజభవనం శిధిలావస్థకు చేరుకుంది. ఆ […]

Share:

పూర్వకాలం నాటి నుంచి వస్తున్న రాజభవనాలకు ఎంతో ప్రసిద్ధి ఉంటుంది. పైగా ఆ రాజభవంతులు ఎంతోమంది అతిధులకు ఆహ్వానం ఇచ్చి ఉంటుంది. ఆ భవనంకు పేరు ప్రఖ్యాతలతో పాటు విలాసవంతమైన సౌకర్యాలను కలిగి ఉంటుంది. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ రాజ భవనం ఇప్పుడు కీటకాలు, ఎలుకలతో నివాసం ఉంటుంది. ఒకప్పుడు మిరుమిట్లు గొలిపే రాజభవనంలా మెరిసిపోతుంటే ఇప్పుడు పాడుబడ్డ భవంతిలా తయారయింది. ఎంతోమంది ప్రధానులకు ఆతిథ్యం ఇచ్చిన ఆ రాజభవనం శిధిలావస్థకు చేరుకుంది. ఆ భవనం ఎక్కడుంది అందుకు గల కారణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎందరో ప్రముఖులకు ఆతిథ్యమిచ్చిన కెనడా ప్రధాని ఒకప్పటి అధికార నివాసం శిధిలావస్థకు చేరుకుంది. పెద్ద పెద్ద విలాసవంతమైన గదులు కలిగి ఉన్న ఈ భవనం కొన్నేళ్లుగా ఖాళీగా ఉండటంతో, ఆ భవనం మొత్తం దుమ్ము, ధూళి, కీటకాలు, ఎలుకలు నివాసం ఉంటూ అద్వానంగా తయారయింది. ఈ భవనంలోని గాలి పీల్చడానికి కూడా సురక్షితం కాదని భావించే దుస్థితికి చేరుకుంది. 24 సెన్సెక్స్ డ్రైవ్ లో సున్నపురాయితో నిర్మించిన ఈ భవనం ఒట్టవా నదిపై ఉన్న ఒక కొండ మీద ఉంది. ఇది దేశంలో అతి ముఖ్యమైన భవనాలలో ఒకటి. అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ, బ్రిటిష్ దివంగత యువరాణి డయానా, సోవియట్ రష్యా మాజీ అధ్యక్షుడు మిఠాయిల్ గోర్బచేవ్ వంటి వారికి ఆతిథ్యమిచ్చిన ఘన చరిత్ర  ఈ భవనం కలిగి ఉంది. 

70 సంవత్సరాలకు పైగా దేశ ప్రధాన మంత్రులకు ఆతిథ్యం ఇచ్చిన నివాసం ఇప్పుడు ఖాళీగా ఉంది. విద్యుత్ వైరింగ్ తుప్పుపట్టిన నీటి పైపులతో నిండిపోయిందని BBC నివేదించింది. ఈ ఇల్లు చల్లటి గాలిని అనుమతించే డ్రాఫ్టీ కిటికీలు, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, ఆస్బెస్టాస్‌తో నిండిన అగ్ని ట్రాప్ వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటుందని స్థానిక ప్రభుత్వం తెలిపింది. కెనడియన్ PM యొక్క అధికారిక ఇల్లు, వైట్ హౌస్ , 10 డౌనింగ్ స్ట్రీట్ వలె కాకుండా, 2015 నుండి నిర్జీవంగా ఉంది. 

ఒట్టవాలో వారసత్వభవనాలను సంరక్షించే పనిలో ఉన్న నేషనల్ క్యాపిటల్ కమిషన్ ఈ నివాసాన్ని గత ఏడాది మూసివేసింది. దీన్ని పునరుద్ధరించడానికి సుమారు 26 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేసింది. భవనం దుస్థితిని వివరిస్తూ ఎన్సిసి ఓ నివేదికను విడుదల చేసింది. అందులో దశాబ్దాల నిర్లక్ష్యం కారణంగా భవనంలోని కీటకాలు పెరిగిపోయాయి. నీళ్ల పైపులు తుప్పుపట్టాయి, పాడైపోయిన ఎలక్ట్రిక్ సిస్టం వల్ల అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఎలుకల బెడద అదనపు తలనొప్పిగా మారింది. దుర్వాసన వ్యాపించి గాలి పూర్తిగా కలుషితమైంది. భవనం లోపలి గోడలపై ప్రమాదకరమైన నాచు విస్తరించింది. చరిత్ర గల ఈ భవనాన్ని కాపాడుకోవాలంటే నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని నేషనల్ క్యాపిటల్ కమిషన్ వివరించింది. 

12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 34 గదులతో ఉన్న ఇల్లు, ఒకప్పుడు జస్టిన్ ట్రూడో చిన్ననాటి ఇల్లు. కెనడా ప్రధానమంత్రి తన తండ్రి పియరీ ఇలియట్ ట్రూడో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి జీవించేవారు. కానీ 2015లో అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఇక్కడ నివసించలేదు. భవన ప్రాంగణంలోని విలాసమైన గార్డెన్ ను తరచుగా విందుల కోసం ఉపయోగించేవారు. భవనం ప్రాంగణంలోని స్విమ్మింగ్ పూల్ను థియరీ అభ్యర్థన మేరకు 1975లో నిర్మించారు.