అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వాడీవేడి చర్చ…

అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ పోటీలో భారత సంతతి వ్యక్తి వివేక్‌ రామస్వామి ముందజలో ఉన్నాడు. రోజురోజుకూ ఆయనకు మద్దతు పెరుగుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న 8 మంది అభ్యర్థుల మధ్య వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాటు భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి, నిక్కీహేలీ కూడా ఉన్నారు. మొదటి డిబెట్‌లో చాలా మంది వివేక్‌ రామస్వామిని టార్గెట్‌ […]

Share:

అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ పోటీలో భారత సంతతి వ్యక్తి వివేక్‌ రామస్వామి ముందజలో ఉన్నాడు. రోజురోజుకూ ఆయనకు మద్దతు పెరుగుతుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న 8 మంది అభ్యర్థుల మధ్య వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాటు భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి, నిక్కీహేలీ కూడా ఉన్నారు. మొదటి డిబెట్‌లో చాలా మంది వివేక్‌ రామస్వామిని టార్గెట్‌ చేస్తూ అవమానకర రీతిలో మాట్లాడారు. ‘‘స్కీన్ని గాయ్‌  విత్‌ ఫన్నీ నేమ్‌ (ఫన్నీ పేరుతో సన్నగా ఉండే వ్యక్తి)” అని రామస్వామిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు.. మాజీ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామాను గుర్తుచేశాయి. ఈ విమర్శలపై ఆయన స్పందించిన తీరు అక్కడున్న వారిని అక్టటుకుంది. 

ఆ తర్వాత తనని తాను రామస్వామి పరిచయం చేసుకుంటూ, “మీరు చెప్పింది నిజమే. అందుకే నేను మీకో విషయం చెప్పాలనుకుటుంన్నాను. నేను రాజకీయ నాయకుడిని కాను. నేను బిజినెస్‌ మ్యాన్‌ను. నా తల్లిదండ్రులు 40 సంవత్సరాల క్రితం చేతిలో డబ్బులు లేకుండా ఈ దేశానికి వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ కంపెనీలు పెట్టి నేను బిలియన్‌ డాలర్ల డబ్బు ఇక్కడ సంపాదించాను. అది అమెరికన్ల కల. మనం దీని గురించి ఏదైనా చేస్తే తప్ప ఆ అమెరికన్‌ కల మా ఇద్దరు కుమారులకు, వారి తరానికి ఉండదని నేను నిజంగా ఆందోళన చెందుతున్నాను” అని రామస్వామి అన్నారు. 

ఈ క్రమంలో న్యూజెర్సీ మాజీ గవర్నర్‌‌ క్రిస్‌ క్రిస్టీ మాట్లాడుతూ, ‘‘చాట్‌ జీపీటీలా అనిపించే వ్యక్తిని  నేను ఈ రాత్రి కలిశాను. ఈ చర్చలో చివరి వ్యక్తి, వేదిక మధ్యలో నిలబడి, సన్నగా ఒబామాలాగా ఉండే ఇక్కడ ఏమి చేస్తున్నాడు. ఈ రాత్రి వేదికపై నిలబడి అదే రకమైన వ్యక్తితో డీలింగ్‌ చేయడానికి మేము భయపడుతున్నాం” అని వ్యంగ్యంగా అన్నారు. దీనిపై రామస్వామి స్పందిస్తూ.. ‘‘మీరు ఒబాను హగ్‌ చేసుకున్నట్లుగానే నన్ను కూడా హగ్‌ చేసుకోండి. మీరు ఒబాకు చేసినట్లే నన్ను కూడా ఎన్నుకోవడంలో సహాయం చేస్తారు బ్రదర్‌‌” అని అన్నారు.  

2012 అధ్యక్ష ఎన్నికలకు ముందు వచ్చిన శాండీ హరికేన్‌ తర్వాత క్రిస్‌ క్రిస్ట్రీ ఒబామాను ‘‘హగ్గింగ్‌” చేశాడని ఆరోపిస్తూ 2012 ఘటనను రామస్వామి ప్రస్తావించారు. అయితే, తాను అతనిని కౌగించుకోలేదు అని 2012 నుంచి చెబుతూ వస్తున్నారు.

ఫన్నీ నేమ్‌తో ఉండే సన్నగా ఉండే వ్యక్తి ఒబామాలాగా కనిపిస్తున్నాడు అని బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీగా పనిచేసిన జెన్‌సాకి ట్విట్టర్‌‌లో పేర్కొన్నారు. డిశాంటిస్ మద్దతుదారులు కూడా ట్విట్టర్‌‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. 

ఉక్రెయిన్‌పై ఏకాభిప్రాయంపై తిరస్కరణ..

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధంపై కూడా డిబెట్‌లో చర్చ జరిగింది. ఉక్రెయిన్‌ సమస్యను తాను పరిష్కరిస్తానంటూ గతంలో రామస్వామి చెప్పారు. అయితే, ఉక్రెయిన్‌ విషయంలో తోటి డిబేటర్‌‌లతో రామస్వామి విభేదించారు. ‘‘ఉక్రెయిన్‌ను గెలిపించుకోవాలనుకోవంపై కీలకమైన ఏకాభిప్రాయాన్ని నేను  అంగీకరించను. బైడెన్‌ ఆధ్వర్యంలో విదేశాంగ విధానం సరిగ్గా లేదు. అమెరికా ఫస్ట్ 2.0 నినాదంతో నేను వెళ్తాను’’ అని రామస్వామి అన్నారు. 

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాను.. ఎంఎస్‌ఎన్బీసీకి కాదు..

రామస్వామి వ్యాఖ్యలకు క్రిస్‌ క్రిస్టీ స్పందిస్తూ.. ‘‘దేశంలో ఉంటూ ట్రంప్‌ని తిట్టడాన్ని చూడాలనుకుంటే వారు ఇప్పుడే ఎంఎస్‌ఎన్‌బీసీ చానెల్‌ నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. అయితే, నేను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను.. ఎంఎస్‌ఎన్‌బీసీకి కాదు” అని అన్నారు. 

చర్చ సందర్భంగా వివేక్‌ రామస్వామి టాప్‌ 10 సత్యాలు…

1. దేవుడు నిజమైనవాడు

2. రెండు జెండర్స్‌ ఉన్నాయి. 

3. మానవ వికాసానికి శిలాజ ఇంధనాలు అవసరం.

4. రివర్స్‌ జాత్యహంకారం జాత్యహంకారమే

5. ఓపెన్‌  బార్డర్‌‌ ఈజ్‌ నో బార్డర్‌‌

6. తల్లిదండ్రులు తమ పిల్ల చదువును నిర్ణయిస్తారు.

7. న్యూక్లియర్‌‌ ఫ్యామిలీ అనేది మానవాళికి తెలిసిన గొప్ప పాలనా విధానం

8. పెట్టుబడిదారీ విధానం ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుంది.

9. అమెరికా ప్రభుత్వంలొ మూడు శాఖలు ఉన్నాయి. నాలుగు కాదు

10. అమెరికా రాజ్యాంగం చరిత్రలో అత్యంత బలమైనది స్వేచ్ఛ