బ్రిటిష్ మ్యూజియంలో దొంగతనం

బ్రిటిష్ మ్యూజియంలో ఎన్నో ఏళ్ల నాటి పొందుపరిచిన వస్తువులు ఉంచడం జరుగుతుంది.. అయితే ఇటీవల సంభవించిన ఒక సంఘటన కారణంగా కొన్ని పోయిన/ దొంగలించబడిన వస్తువులు గురించి తెలిసిన అనంతరం లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో పనిచేస్తున్న ఒకరిని తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఆ ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ విషయం తెలిసిన నేటిజెన్లు తమ వైపు నుంచి విచిత్రంగా స్పందించడం మొదలుపెట్టారు.  బ్రిటిష్ మ్యూజియం కేస్:  మ్యూజియం విడుదల చేసిన ఒక ప్రకటనలో, దొంగిలించబడిన […]

Share:

బ్రిటిష్ మ్యూజియంలో ఎన్నో ఏళ్ల నాటి పొందుపరిచిన వస్తువులు ఉంచడం జరుగుతుంది.. అయితే ఇటీవల సంభవించిన ఒక సంఘటన కారణంగా కొన్ని పోయిన/ దొంగలించబడిన వస్తువులు గురించి తెలిసిన అనంతరం లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో పనిచేస్తున్న ఒకరిని తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఆ ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ విషయం తెలిసిన నేటిజెన్లు తమ వైపు నుంచి విచిత్రంగా స్పందించడం మొదలుపెట్టారు. 

బ్రిటిష్ మ్యూజియం కేస్: 

మ్యూజియం విడుదల చేసిన ఒక ప్రకటనలో, దొంగిలించబడిన వస్తువులలో ఎక్కువ భాగం బంగారం, అందులో ముఖ్యంగా ఆభరణాలు మరియు రత్నాలు, 15 వ శతాబ్దం BC నుండి 19 వ శతాబ్దం AD నాటి గాజులు ఉన్నాయి. వస్తువులను స్టోర్‌రూమ్‌లో ఉంచడం జరిగింది. ముఖ్యమైన సంఘటన ఏంటంటే, ఇటీవల దొంగలించబడిన వస్తువులలో ఏదీ బహిరంగ ప్రదర్శనలో ఉంచబడలేదు. అవి ప్రధానంగా విద్యా మరియు పరిశోధన ప్రయోజనాల కోసం ఉంచినట్లు సమాచారం.

తాము నిజానికి తమ మ్యూజియంలో ఉంచిన అన్ని వస్తువుల బాధ్యతను ఎంతో సీరియస్గా తీసుకుంటామని, మరి ముఖ్యంగా ఇందులో పనిచేసే వారందరికీ తమ వైపు నుంచి ఎంతో సహకారం అందింది అని కూడా చెప్పారు. కానీ ఈ సంఘటన జరగడాన్ని తాము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామని అని బ్రిటిష్ మ్యూజియం డైరెక్టర్ హార్ట్‌విగ్ ఫిషర్ చెప్పడం జరిగింది. మ్యూజియంలో . ఏవైతే వస్తువులు కనిపించకుండా పోయాయో అవి తప్పకుండా తిరిగి అతి త్వరలోనే మ్యూజియంలో ఉంచబడతాయని కూడా ఆయన అన్నారు. ఇటీవల సంభవించిన ఒక సంఘటన కారణంగా కొన్ని పోయిన/ దొంగలించబడిన వస్తువులు గురించి తెలిసిన అనంతరం లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో పనిచేస్తున్న ఒకరిని తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఆ ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

మ్యూజియం కూడా భద్రతపై స్వతంత్ర సమీక్షను ప్రారంభించగా, ఈ విషయాన్ని పరిశోధించడానికి మెట్రోపాలిటన్ పోలీసు ఆర్థిక నేర కమాండ్‌ని పిలిచారు. మాజీ ట్రస్టీ సర్ నిగెల్ బోర్డ్‌మాన్ మరియు బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీస్ చీఫ్ కానిస్టేబుల్ లూసీ డి’ఓర్సీ ఈ సమీక్షకు నాయకత్వం వహిస్తారని Sky.com తెలియజేసింది.

బ్రిటీష్ మ్యూజియం దొంగతనానికి గురైంది మరియు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి మరియు అంతేకాకుండా ఈ సంఘటన ద్వారా లెసన్స్ నేర్చుకునేలా చేయడానికి సమీక్షను ఉపయోగించాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్లు.. అంతేకాకుండా తాము ప్రస్తుతం మెట్రోపాలిటన్ పోలీసులతో కలిసి పని చేస్తున్నామని బోర్డ్‌మాన్ చెప్పారు.

నెటిజన్లు ఏమంటున్నారు: 

అయితే ఈ సంఘటన గురించి విన్న కొంతమంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందించడం జరుగుతోంది. కొంతమంది మ్యూజియంలో పోయిన వస్తువులు త్వరగా దొరకాలని ఆశిస్తుంటే, మరికొందరు మ్యూజియంలో వస్తువులు పోవడం ఏంటి అంటూ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఇంకాస్త ముందుకు వెళ్లి, బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోండి వినాలని ఉంది అంటున్నారు.. మరి కొంతమంది ఆ వస్తువులు తమ సొంత యజమానుల దగ్గరికి వెతుక్కుంటూ వెళ్లి ఉండొచ్చు అంటూ తమ ఊహాల్ని బయటపెడుతున్నారు.

బ్రిటీష్ మ్యూజియం దాని చరిత్రలో భాగంగా UKలో అతిపెద్ద పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది 1759లో ప్రారంభించబడింది మరియు సందర్శకులను ఆకర్షిస్తుంది, ముఖ్యంగా వేసవి పర్యాటక సీజన్‌లో ఎక్కువగా మ్యూజియంలో రద్దీ కనిపిస్తుంది. నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం 60 లక్షల మందికి పైగా ప్రజలు దీనిని సందర్శిస్తారు. అయితే చాలామంది మ్యూజియంలో పోయిన అతి పురాతన, విలువైన వస్తువులు మరి అతి త్వరలోనే దొరకాలని ఆశిస్తున్నారు.