వారికి యూకే అండ‌గా నిల‌వ‌దు

భారత సంతతికి చెందిన యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ వచ్చే నెలలో భారతదేశ పర్యటనకు రానున్నారు. సెప్టెంబర్ నెలలో న్యూ ఢిల్లీ లో జరిగే G20 సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సుకు ఆ దేశం నుండి అంతర్జాతీయ ప్రతినిధులు కూడా హాజరు అవుతున్నారు.  భారతదేశం లోని బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారతదేశం మరియు UK దేశాల మధ్య సంబంధాలు గతంలో […]

Share:

భారత సంతతికి చెందిన యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ వచ్చే నెలలో భారతదేశ పర్యటనకు రానున్నారు. సెప్టెంబర్ నెలలో న్యూ ఢిల్లీ లో జరిగే G20 సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సుకు ఆ దేశం నుండి అంతర్జాతీయ ప్రతినిధులు కూడా హాజరు అవుతున్నారు. 

భారతదేశం లోని బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారతదేశం మరియు UK దేశాల మధ్య సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు దృఢంగా ఉన్నాయి అని ఆయన అన్నారు. వచ్చే నెలలో జరిగే G20 సదస్సులో బ్రిటీష్ ప్రధాని హెల్త్ , ఎనర్జీ ట్రాన్సిషన్ గురించి భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ తో చర్చిస్తారు అని ఎల్లిస్ తెలిపారు. ఖలిస్తాన్ తీవ్రవాద సమస్య ఇరు దేశాల మీద ప్రధానమైన సమస్య గా ఉండేది, కానీ ఇప్పుడు ఇది భారతదేశ సమస్య కాదు. కేవలం UK సమస్య మాత్రమే అని ఆయన అన్నారు. ఈ కేసులో అనేక అరెస్టులు కూడా జరిగాయని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. 

భారతదేశం నుండి పారిపోయి చాలా కాలంగా UK లో తల దాచుకుంటూ ఉన్న విజయ్ మాల్యా మరియు నీరవ్ మోడీ గురించి ప్రస్తావిస్తూ వారిని తిరిగి భారత దేశానికి అప్పగించడానికి వారి దేశ పద్ధతిని అనుసరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వారి విషయంలో చేయగలిగిన సహాయాన్ని తప్పకుండా చేస్తాం అని కూడా వ్యాఖ్యానించారు. 

భారతదేశం మరియు UK మధ్య సంస్కృతి, కళలు , ఆహారపు అలవాట్లు మొదలైనవి ఒకే పోలిక కలిగి ఉన్నాయి అని, ఇంకా విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ లకు బ్రిటీష్ పౌరులు ఫిదా అవుతారు అని అన్నారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక పరిచయం ఉండడం వలన వారి మధ్య బంధం ఇంకా దృఢంగా చేయవచ్చు అని ఎల్లిస్ తెలిపారు. UK లో పెట్టుబడి పెట్టడం చాలా సులభంగా ఉంటుంది అని భారతీయ పెట్టుబడి దారులు తరచుగా ఆయనతో అంటూ ఉండే విషయాలలో ఒకటి అని కూడా అన్నారు. 

G20 సదస్సు లో ఆరోగ్యం, ఎనర్జీ మాత్రమే కాకుండా రెండు దేశాల మధ్య వాణిజ్య అవకాశాలు గురించి కూడా చర్చ జరగవచ్చు అని అతను అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశానికి ఎల్లప్పుడూ UK మద్దతు ఉంటుంది అని చెప్పడానికే రిషి సునాక్ వస్తున్నారు. గత వారం బెంగుళూరు లో జరిగిన పబ్లిక్ ఇన్ఫ్రా కు UK మద్దతు ఇస్తుంది అని ఆయన అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ , ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలు పెట్టడం వలన చాలా దేశాలకు ధాన్యం రవాణా తగ్గింది అని అన్నారు. UK లో జరిగిన చివరి సదస్సు వాణిజ్య ఒప్పందాలలో చాలా పురోగతి సాధించింది. ఈ సదస్సు ద్వారా ఇది మరింత పటిష్టం అవుతుంది అనే నమ్మకం ఉంది అన్నారు. జైపూర్ లో జరిగిన G20 సమావేశానికి కూడా UK వాణిజ్య శాఖ మంత్రి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

విజయ్ మాల్యా, నీరవ్ మోడీ విషయంలో భారతీయుల నిరాశ ను నేను అర్థం చేసుకోగలను కానీ ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా చేయగలిగినది ఏమీ లేదు అని ఆయన అన్నారు.  భారతదేశానికి తమ సహకారాన్ని మెరుగు పరచడానికి ప్రయత్నిస్తున్నాం అని అన్నారు.