డజన్ల కొద్దీ శునకాలపై అత్యాచారం..

కొంతమంది వ్యక్తులు కుక్కలను కొట్టడం, తన్నడం, హింసించడం, యాసిడ్ పోయడం, శరీర భాగాలను కత్తిరించడం, కత్తి లేదా పదునైన వస్తువుతో దాడి చేయడం వంటి వాటిని ఆటలుగా భావిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వారు చేసే పనులు చూస్తుంటే వీళ్లు అసలు మనుషులేనా అనిపిస్తుంది. ఎందుకంటే వారు కొంచెం కూడా మానవత్వం లేని పనులు చేస్తూ ఉంటారు. అలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం బ్రిటన్ లో వెలుగులోకి వచ్చింది. ఇలాంటి కర్కశ పనులకు పాల్పడింది సాధారణ […]

Share:

కొంతమంది వ్యక్తులు కుక్కలను కొట్టడం, తన్నడం, హింసించడం, యాసిడ్ పోయడం, శరీర భాగాలను కత్తిరించడం, కత్తి లేదా పదునైన వస్తువుతో దాడి చేయడం వంటి వాటిని ఆటలుగా భావిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వారు చేసే పనులు చూస్తుంటే వీళ్లు అసలు మనుషులేనా అనిపిస్తుంది. ఎందుకంటే వారు కొంచెం కూడా మానవత్వం లేని పనులు చేస్తూ ఉంటారు. అలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం బ్రిటన్ లో వెలుగులోకి వచ్చింది. ఇలాంటి కర్కశ పనులకు పాల్పడింది సాధారణ వ్యక్తి కాదు ఓ జంతుశాస్త్ర నిపుణుడు. తన పశు వాంఛలను కుక్కలపై తీర్చుకుని.. అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. జంతువుల గురించి అన్ని విషయాలు తెలిసిన ఆ వ్యక్తి 42 కుక్కలపై అత్యాచారానికి పాల్పడ్డ వాటిని అత్యంత క్రూరంగా హింసించి వాటిలో 39 ప్రాణాలు కోల్పోయేలా చేశాడు అంటే అతడి క్రూరత్వం ఏంటో ఇట్టే అర్ధమవుతుంది. ఇంత  నీచమైన చర్యలకు పాల్పడ్డాడు.. బ్రిటన్‌కు చెందిన మొసళ్ల నిపుణుడు, జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఆడం బ్రిట్టన్. ఇతడు ప్రముఖ ఛానళ్లు బీబీసీతో పాటు, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కు కూడా పనిచేశాడు.

ప్రముఖ బ్రిటీష్ జీవశాస్త్రవేత్త సర్ డేవిడ్ అటెన్‌బరోతో కలిసి పనిచేస్తూ వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్‌ ఆడం బ్రిట్టన్ బాగా పాపులర్ అయ్యాడు. బ్రిటన్‌కు చెందిన ఆడం, జంతు శాస్త్రవేత్త కుక్కల పట్ల అత్యంత హేయమైన చర్యలకు పాల్పడ్డాడు. పదుల సంఖ్యలో శునకాలపై అత్యాచారం చేసి తన పశు వాంఛను తీర్చుకుని, అనంతరం కుక్కలను హింసించి, చంపేసి వీడియోలు తీసి.. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినట్టు అంగీకరించాడు. బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్‌లతో కలిసి పనిచేసిన జంతుశాస్త్రవేత్త ఆడమ్ బ్రిటన్.. డజన్ల కొద్దీ కుక్కలను చనిపోయే వరకు హింసించినట్టు ఆస్ట్రేలియా కోర్టుకు వెల్లడించాడు. అతడి క్రూరత్వానికి సంబంధించినవన్నీ కెమెరాలో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు సహా 60 ఆరోపణలలో తన నేరాలను అంగీకరించిన దోషికి ఇంకా శిక్ష ఖరారు కాలేదు.

కేసు విచారణ సందర్భంగా హాలులో ఉన్నవారిని బయటకు వెళ్లిపోవాలని నార్తర్న్ టెరిటరీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి సూచించారు. ఘోరమైన నేరాలకు పాల్పడ్డాడని, ఆ వివరాలు తెలిస్తే షాక్‌లోకి వెళ్లిపోయే అవకాశం ఉన్నందున కోర్టు గది నుంచి ప్రజలను బయటకు వెళ్లమని హెచ్చరించారని స్థానిక మీడియా తెలిపింది. బ్రిటన్‌కు 2014 నుంచి జంతువులపై శాడిస్ట్ లైంగిక ఆసక్తి ఉందని, తన పెంపుడు శునకాలతో పాటు ఇతర యజమానులు వదిలిపెట్టిన కుక్కలపై కూడా అత్యాచారానికి పాల్పడ్డినట్టు ప్రాసిక్యూటర్లు చెప్పారు.

ప్రయాణాలు లేదా పనిపై బయటకు వెళ్లేవారి పెంపుడు జంతువులను తన అదుపులోకి ఉంచుకోవడానికి ప్రయత్నించాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. కట్టుకథలతో మోసపూరితంగా యజమానుల నుంచి పెంపుడు జంతువులను తీసుకునేవాడని వివరించారు. జంతువులపై లైంగిక దాడికి ఓ షిప్పింగ్ కంటెయిన్‌ర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. టార్చర్ రూమ్‌గా పేర్కొన్న కంటెయినర్‌లో వీడియో రికార్డింగ్ సాధనాలను కూడా ఏర్పాటు చేశాడు.

జువాలజీలో పీహెచ్‌డీ చేసి, చార్లెస్ డార్విన్ యూనివర్శిటీలో అకడమిక్ హోదాలో ఉన్న బ్రిటన్.. బీబీసీ, ఎన్జీసీలతో కలిసి పనిచేశాడు. కుక్కలపై అత్యాచారం చేస్తున్న వీడియో బయటపడటంతో నార్తర్న్ టెరిటరీ పోలీసులు 2022లో అతడ్ని అరెస్టు చేశారు. డార్విన్ సమీపంలోని అతని ఇంటిపై దాడి చేసినప్పుడు కంప్యూటర్లు, కెమెరాలు, సెక్స్ టాయ్‌లతో నిండిన కంటైనర్‌ను పోలీసులు కనుగొన్నారు. నేరాలకు సంబంధించి పక్కా ఆధారాలు, సాక్ష్యాలు లభ్యం కావడంతో బ్రిటన్‌ను న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. అతడికి డిసెంబర్‌లో శిక్ష ఖరారు కానుంది. అరెస్టుకు ముందు ఏడాదిన్నర వ్యవధిలో అతడు వేధించిన 42 కుక్కల్లో 39 చనిపోయాయని నివేదిక పేర్కొంది.