ఫోటోగ్రాఫ‌ర్‌తో కాబోయే భ‌ర్త‌కు ఎఫైర్

ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు ముందు ప్రీ వెడ్డింగ్ షూటింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ వంటివి చేయడం కామన్ అయిపోయింది. వధూవరుల ఇద్దరి మధ్య బంధం ఇంకా బలపడడానికి ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనేది ప్లాన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. చిరకాల జీవితాన్ని ప్రారంభించేముందు తమకు కావలసిన జ్ఞాపకాలను ఫోటోల రూపంలో పదిలం చేసుకోవాలనుకుంటున్నారు వధూవరులు. ఇదే క్రమంలో పెళ్లి చేసుకోబోయే ఒక జంట ప్రీ వెడ్డింగ్ షూట్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. కానీ […]

Share:

ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు ముందు ప్రీ వెడ్డింగ్ షూటింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ వంటివి చేయడం కామన్ అయిపోయింది. వధూవరుల ఇద్దరి మధ్య బంధం ఇంకా బలపడడానికి ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనేది ప్లాన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. చిరకాల జీవితాన్ని ప్రారంభించేముందు తమకు కావలసిన జ్ఞాపకాలను ఫోటోల రూపంలో పదిలం చేసుకోవాలనుకుంటున్నారు వధూవరులు. ఇదే క్రమంలో పెళ్లి చేసుకోబోయే ఒక జంట ప్రీ వెడ్డింగ్ షూట్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. కానీ తీరా పెళ్లి అనంతరం, పెళ్లికూతురు ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసినందుకుగాను తాము ఇచ్చిన డబ్బులు వాపస్ చేయమని అడిగింది. 

అసలు విషయం: 

పెళ్లి చేసుకోబోయే ఒక జంట ప్రీ వెడ్డింగ్ షూట్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. కానీ తీరా పెళ్లి అనంతరం, పెళ్లికూతురు ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసినందుకుగాను తాము ఇచ్చిన డబ్బులు వాపస్ చేయమని అడిగింది. అంతేకాకుండా ఫోటోగ్రాఫర్ తో వచ్చిన మ‌రో ఫోటోగ్రాఫర్తో తన భర్తకు ఉన్న ఎఫైర్ గురించి కూడా మాట్లాడింది. నిజానికి ఈ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ మెయిన్ ఫోటోగ్రాఫర్. అయితే, తను ఇటీవల కాలంలో ఒక మహిళను తనతో పాటు హెల్పర్ గా అంటే అసిస్టెంట్ గా పెట్టుకోవడం జరిగింది. అయితే అనుకోకుండా కొ- వర్కర్ గా చేస్తున్న ఆమె ఫోటోగ్రాఫర్ తో పాటు ఈ జంట ఫోటోలు తీయడానికి కుదుర్చుకోవడం జరిగింది. 

అయితే పెళ్లి తర్వాత, ఫోటోగ్రాఫర్ కు ఇచ్చిన పేమెంట్ రిటర్న్ కోరుతూ ఒక ఇమెయిల్‌ను అందుకున్నాడు ఫోటోగ్రాఫర్. అయితే ఇక్కడ తన సహోద్యోగి వరుడితో హద్దు దాటి ప్రవర్తించినట్లు కూడా మెయిల్లో మెన్షన్ చేయడం జరిగింది. వధువు తన మొబైల్ ఫోన్‌లో ఫోటోలు తీసినట్లు ఆమె వద్ద రుజువు ఉన్నట్లు కూడా తెలిపింది. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న పెళ్ళికొడుకు గురించి అసలు విషయం తెలుసుకోవడం జరిగింది. ఫోటోగ్రాఫర్ ఇమెయిల్‌కి రిప్లై ఇస్తూ, ” మీ విషయంలో ఇలా జరిగినందుకు బాధపడుతున్నాను, కానీ నేను డబ్బు తిరిగి ఇవ్వలేను, ఎందుకంటే ఇది నా చేతుల్లో ఉన్న విషయం కాదు కాబట్టి నేను ఏం చేయలేను” అంటూ రాసుకొచ్చాడు. 

కామెంట్ల వర్షం: 

ఇప్పుడు ఫోటోగ్రాఫర్ తనకు అందిన ఈమెయిల్ గురించి అంతేకాకుండా తనకు జరిగిన దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఫోటోగ్రాఫర్ పోస్ట్ పెట్టిన అనంతరం ఇది వైరల్ గా మారింది. వెంటనే ప్రతి ఒక్కరు కామెంట్స్ పెడుతూ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. వారి గతంలో జరిగిన దాని గురించి మీరు ఎలా బాధ్యత వహిస్తారు అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మీకు వర్కర్ ని అసలు విషయం గురించి అడిగి చూడండి అంటూ మరి కొంతమంది కామెంట్స్ పెట్టారు. 

అయితే వచ్చిన కామెంట్లకు ఫోటోగ్రాఫర్స్ స్పందిస్తూ అన్ని విషయాలు చెప్పరు. మొదట ఈ విషయం గురించి కోవర్కర్కు అడగగా మొదటగా ఆమె ఒప్పుకోలేదని, తరవాత గట్టిగా అడగక అసలు విషయం చెప్పినట్లు కామెంట్ పెట్టాడు. వారిద్దరి రిలేషన్ గురించి ఓపెన్ అయినట్లు చెప్పుకొచ్చాడు. 

ఫోటోగ్రాఫర్ ఇప్పటికీ ఈ విషయం గురించి ఏం చేయాలో అయోమయంలో ఉన్నాడు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలిదని, కాబట్టి అతను Redditలో పరిస్థితి గురించి నేటిజన్ల నుండి సహాయం కోరాడు. మరోవైపు, పెళ్లికూతురు పట్ల తనకు బాధగా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.