క్రిప్టో కరెన్సీ కింగ్ ఫెర్నాండో దారుణ హత్య

ఫెర్నాండో పెరేజ్ అల్గాబా క్రిప్టో కరెన్సీ లో వీరుడు. ఇతను చాలా కోట్ల డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ట్రిప్టో కరెన్సీ కింగ్ ఫెర్నాండో మృతి చెందినట్లు, ఇతని మృతదేహం బుధవారం ఒక సూట్ కేసులో లభ్యమైనట్లు పోలీసు వారు చెప్పారు. ఫెర్నాండో క్రిప్టో కరెన్సీలో ఆరితేరిన వ్యక్తి. ఇతను క్రిప్టో కరెన్సీ మీద కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. అతనికి సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్నట్లు […]

Share:

ఫెర్నాండో పెరేజ్ అల్గాబా క్రిప్టో కరెన్సీ లో వీరుడు. ఇతను చాలా కోట్ల డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ట్రిప్టో కరెన్సీ కింగ్ ఫెర్నాండో మృతి చెందినట్లు, ఇతని మృతదేహం బుధవారం ఒక సూట్ కేసులో లభ్యమైనట్లు పోలీసు వారు చెప్పారు. ఫెర్నాండో క్రిప్టో కరెన్సీలో ఆరితేరిన వ్యక్తి. ఇతను క్రిప్టో కరెన్సీ మీద కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. అతనికి సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.

దారుణ హత్య:

అల్గాబా మియామీలో జూలై 19న తను రెంటుకు తీసుకున్న అపార్ట్మెంట్ ఖాళీ చేసి ప్రాపర్టీ ఓనర్ కి అప్పగించే రోజు నుంచి తను మిస్ అయినట్లు తెలిపారు. అయితే ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ బుధవారం ఒక సూట్ కేసులో అల్గాబా మృతదేహం లభించింది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ఇతనిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆ తర్వాత ముక్కల కింద నరికి సూట్ కేసులో పెట్టి స్ట్రీమ్ లోకి విసిరేసినట్లు తెలుస్తోంది. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఆ సూట్ కేసును గమనించి, వారి తల్లిదండ్రులకు చెప్పగా, వాళ్లు పోలీసులుకి ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని ఫింగర్ ప్రింట్స్ మరియు శరీరం మీద ఉన్న టాటూ లను బట్టి అల్గాబా మృతదేహం అని గుర్తించారు.

సెల్ఫ్ మేడ్ బిలియనయర్: 

మిస్టర్ అల్గాబా సెల్ఫ్ మేడ్ బిలియనయర్. ఇతను అర్జెంటినాకు చెందిన వ్యక్తి . బార్సిలోనలో  నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం మియామీకి షిఫ్ట్ అయినట్లు అక్కడే తన హత్య చేయబడ్డాడని పోలీసులు చెప్పారు. అల్గాబాకి తన సంపాదించిన మొత్తం డబ్బు, తన లగ్జరీ వెహికల్స్ మీద మరియు తన లైఫ్ స్టైల్ మీద ఖర్చు పెట్టేవాడు. ఇతనికి చాలా ఫాలోయింగ్ ఉంది దాదాపు వన్ మిలియన్. ఇతడికి క్రిప్టో కరెన్సీ మీద ఆసక్తే తనని బిలియనీర్ గా మార్చింది.

అల్గాబాకి చాలామంది అభిమానులు మరియు ఎంతోమంది తన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇతను క్రిప్టో కరెన్సీ మీద చాలామందిని ట్రైన్ చేశారు. దానివల్ల ఇతనికి చాలామంది ఫాలోవర్స్ మరియు ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు పెరిగారు. క్రిప్టో కరెన్సీలో ప్రపంచంలో కోటీశ్వరుల జాబితాలో ఇతను నిలుస్తాడు. ఇతను క్రిప్టో కరెన్సీ అమ్మి చాలా డబ్బులు సంపాదించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ బాగా పేరుగాంచింది. దీని మీద చాలామంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కొన్ని దేశాల్లో డబ్బులకు బదులు క్విప్టో కరెన్సీలే వాడుతున్నారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా నష్టాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిగా 2009లో బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ వచ్చింది. అది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులారిటీని పెంచుకుంది. ఆన్లైన్ ద్వారా నడిచేయి క్రిప్టో కరెన్సీ జనాలకు చాలా ఉపయోగపడే సూచనలు కనిపించాయి.

ప్రపంచ కప్టో కరెన్సీ వాడకంలో అల్గాబా ఒక కోటీశ్వరుడు అని చెప్పవచ్చు. బుధవారం లభించిన ఇతని మృతదేహాన్ని పోలీస్ వారు ఆటాప్సీకి పంపించారు. ఒక అనుమాన వ్యక్తిని పట్టుకుని పోలీస్ కస్టడీ లో విచారణ చేపడుతున్నారు. ఎంతో పేరుగాంచిన వ్యక్తి ఇలా మృత్యువాత పడటం అందులోకి హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు. ఇతని శత్రువులు ఎవరు, ఆస్తి ఎంత మరియు ఇతనిపై ఇంతకుముందు ఏవైనా నేరాలు గాని పోలీస్ కేసులు గాని ఉన్నాయేమోనని పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసు వారు తెలిపిన సమాచారం ప్రకారం ఇతను చాలా అప్పులు చేసినట్లు దాని వల్లే ఇతన్ని చంపినట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.