బిల్ గేట్స్ ఫేక్ వీడియో వైరల్.. వెంటనే ఏం చేశారంటే.!?

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు ప్రపంచ టాప్ టెన్ కుబేరులలో ఒకరైన బిల్ గేట్స్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇటీవల బిల్ గేట్స్ ABC న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ వేసిన ప్రశ్నలు అందుకు బిల్ గేట్స్ చెప్పిన ఆన్సర్స్ తప్పు దోవ పట్టిస్తున్నాయి. ఇది ఫేక్ వీడియో అని నిర్ధారణ అయ్యింది. […]

Share:

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు ప్రపంచ టాప్ టెన్ కుబేరులలో ఒకరైన బిల్ గేట్స్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇటీవల బిల్ గేట్స్ ABC న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ వేసిన ప్రశ్నలు అందుకు బిల్ గేట్స్ చెప్పిన ఆన్సర్స్ తప్పు దోవ పట్టిస్తున్నాయి. ఇది ఫేక్ వీడియో అని నిర్ధారణ అయ్యింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఈ వీడియోలో ఆ జర్నలిస్ట్.. బిల్ గేట్స్ ను మీరు మైక్రోసాఫ్ట్ తరఫున కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ద్వారా  మీరు బిలియన్స్‌ను మూట కట్టుకున్నారు అనే ప్రశ్నలు అడిగినట్టుగా ఉంటుంది. ఆమె వేసిన ప్రశ్నలకు. బిల్ గేట్స్ కాస్త కోపంగా సమాధానం చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంటుంది.. ఇప్పుడు మీరు అలాంటి కీవర్డ్స్ తో, బిల్ గేట్స్ ఇంటర్వ్యూ సెర్చ్ చేస్తే.. అసలైన వీడియో దొరుకుతుంది. ఆ వీడియో ఏ బి సి న్యూస్ ఆస్ట్రేలియా యూట్యూబ్ ఛానల్ లో 31 జనవరి 2023న ఆ వీడియో అప్లోడ్ చేశారు. ఇది అసలైన వీడియో. 

బిల్ గేట్స్ ఫేక్ వీడియో..

ఏబిసి న్యూస్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియో కి పొంతన ఉండదు. ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ వేసిన ప్రశ్నలకు బిల్ గేట్స్ చెప్పిన సమాధానాలకి.. ఆ ఫేక్ వీడియోలో ఉన్న బిల్ గేట్ సమాధానాలకి అసలు పొంతన ఉండదు. 

అసలు వీడియోలో ఆ ఇంటర్వ్యూవర్ బిల్ గేట్స్ ని వేసిన ప్రశ్నలలో.. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తో పాటు మరికొన్ని అంశాలను కూడా అడిగింది. వాటిలో వాతావరణ మార్పులు, ఎలోన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలు, గేట్స్ అసోసియేషన్ విత్ జాఫ్రీ ఎక్స్టిన్, అతని మంచి నడవడిక , రైస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈ వీడియోలో చర్చించారు. కానీ ఫేక్ వీడియోలో మాత్రం టెక్నాలజీ మొత్తాన్ని తప్పుగా భావిస్తున్నట్లు సమాచారం ఉంటుంది. ఈ వైరల్ వీడియోని డీప్ ఫేక్ టెక్నాలజీ క్రియేట్ చేసింది. వీళ్ళు ఇంతకుముందు కూడా మరికొన్ని ఫేక్ వీడియోలను అప్లోడ్ చేశారు. మొత్తానికి ఇది ఫేక్ వీడియో అని అందరికీ అర్థమవుతుంది. అంతే కాకుండా ప్రస్తుతం ఈ వీడియోను డిలీట్ కూడా చేశారు..

బిల్ గేట్స్ ఇండియా టూర్

భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి చెందుతుందని.. దేశాన్ని సందర్శించడం ఎంతగానో స్ఫూర్తి కలిగిస్తోందని.. టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. భారతదేశం అభివృద్ధి చెందుతున్న తీరును బిల్ గేట్స్ తన అధికారిక బ్లాగ్ గేట్స్ నోట్స్ లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచమంతా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో.. భారత్ లాంటి ఓ సృజనాత్మక, డైనమిక్ దేశాన్ని సందర్శించడం ఎంతగానో స్ఫూర్తి కలిగిస్తోందని గేట్స్ తెలిపారు. అంతే కాకుండా బిల్ గేట్స్ తృణధాన్యాలతో తయారుచేసిన చపాతీని స్వయంగా తానే తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తయారీ కేంద్రంలో బిల్ గేట్స్ ఆటోను నడిపిన వీడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్చల్ చేస్తుంది.