Nawaz Sharif: సంచలన వ్యాఖ్యలు చేసిన నవాజ్ షరీఫ్

పాకిస్తాన్ కు ప్రధానిగా సేవలందించిన నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. పాక్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ రాజకీయ నేత (Nawaz Sharif) తర్వాత దేశంలో ఉండకుండా అయ్యాడు. దీంతో వేరే దేశానికి వెళ్లి అక్కడ నివసించాడు. కానీ ఇటీవలే పాక్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) సోదరుడు పాక్ కు ప్రధానిగా ఉన్నాడు. సోదరుడు షరీఫ్ కూడా తన అన్న వస్తాడని […]

Share:

పాకిస్తాన్ కు ప్రధానిగా సేవలందించిన నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. పాక్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ రాజకీయ నేత (Nawaz Sharif) తర్వాత దేశంలో ఉండకుండా అయ్యాడు. దీంతో వేరే దేశానికి వెళ్లి అక్కడ నివసించాడు. కానీ ఇటీవలే పాక్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) సోదరుడు పాక్ కు ప్రధానిగా ఉన్నాడు. సోదరుడు షరీఫ్ కూడా తన అన్న వస్తాడని ఎప్పటి నుంచో చెబుతున్నాడు. ప్రన్తుతం పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో (Financial Crises) ఉంది. పాక్ ను గట్టెక్కించేందుకు నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) వస్తాడని ప్రధాని చెబుతూ వస్తున్నాడు. అంతే కాక గత ప్రభుత్వం (Government) చేసిన తప్పుల వల్లే పరిస్థితి ఇలా దాపురించిందని కూడా విమర్శలు చేస్తూ వస్తున్నాడు. 

వస్తూనే అమెరికా మాజీ అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు 

పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీకి చెందిన నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) గత కొద్ది రోజుల నుంచి దుబాయ్ (Dubai) లో ఉంటున్నాడు. దుబాయ్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో (Special Flight) పాకిస్తాన్ కు తిరిగి వచ్చాడు. వస్తూనే ఆయన ఒకప్పటి అమెరికా అధ్యక్షుడిపై సంచలన ఆరోపణలు చేశారు. 1998లో తాను ప్రధానిగా ఉన్నపుడు అణు పరీక్షలు నిర్వహించడం ద్వారా భారత్ కు గట్టి బదులిచ్చామని అతడు తెలిపాడు. ఈ అణు పరీక్షలు జరపకుండా ఉండేందుకు అప్పటి అధ్యక్షుడు  బిల్ క్లింటన్ తనకు దాదాపు 5 బిలియన్ అమెరికన్ డాలర్లను ఆఫర్ చేశాడని చెప్పుకొచ్చాడు. వేరే వ్యక్తులు ప్రధానులుగా ఉంటే ఆ ఆఫర్ ను యాక్సెప్ట్ చేసే వారని తాను మాత్రం దేశ ప్రయోజనాల కోసం ఆఫర్ ను రిజెక్ట్ చేశానని తెలిపారు. 

Also Read: Nawaz Sharif: భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంటా- నవాజ్ షరీఫ్

2024 ఎన్నికలే టార్గెట్ 

పాకిస్తాన్ లో 2024లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసి దేశానికి ప్రధాని అవడం కోసం నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) ప్రస్తుతం దుబాయ్ నుంచి పాక్ కు వచ్చారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు స్వదేశానికి వచ్చారు. వస్తూనే తన ఎన్నికల ప్రచారాన్ని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) మొదలుపెట్టారు. వస్తూనే తన పదవీకాలం విజయాల గురించి నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) ప్రస్తావించడం క్లియర్ స్ట్రాటజీ అని అంతా చర్చించుకుంటున్నారు. 73 సంవత్సరాల వయసు ఉన్న నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో పాక్ కు తిరిగి వచ్చాడు. ఆయన గత నాలుగు సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నాడు. తిరిగి 2024 ఎన్నికల్లో తన తన పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ 2024 జనవరిలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయి స్థానాల్లో విజయం సాధించి.. నాలుగోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించేందుకు నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) ప్రయత్నిస్తున్నారు. దుబాయ్ నుంచి ఇస్లామాబాద్‌ కు ‘ఉమీద్-ఎ-పాకిస్తాన్’ అనే చార్టర్డ్ ఫ్లైట్ లో మధ్యాహ్నం 1:30 కు బయల్దేరారు. 

వస్తూనే భారీ ర్యాలీ

పాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన రాజతంత్రం చూపించాడు. అతడు వస్తూనే భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. తన పార్టీకి కంచుకోటలా ఉన్న లాహోర్ కు చేరుకుని అక్కడ ర్యాలీ తీశాడు. ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తర్వాత నేను ఈ రోజు మిమ్మల్ని కలుస్తున్నాను, కానీ మీతో నా ప్రేమ బంధం అలాగే ఉందని పేర్కొన్నాడు. ఈ సంబంధంలో ఎటువంటి తేడా లేదన్నాడు. మీ దృష్టిలో నేను చూస్తున్న ప్రేమ, దాని గురించి నేను గర్వపడుతున్నానని వివరించాడు. 

1998లో భారత్ అణుపరీక్షపై పాక్ స్పందించాలని అకున్నప్పుడు విదేశీ ప్రభుత్వాల నుంచి తాను ఎదుర్కొన్న ఒత్తిడిని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. క్లింటన్ (Bill clinton) (అమెరికా మాజీ అధ్యక్షుడు) నాకు 5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు విదేశాంగ కార్యాలయంలో రికార్డులు ఉన్నాయని తెలిపారు.  ఈ ఘటన 1999లో జరిగిందని, నాకు కూడా 1 బిలియన్ డాలర్లు ఇవ్వొచ్చని, కానీ నేను పాక్ గడ్డ మీద పుట్టాను కాబట్టి అలా చేయలేదని తెలిపాడు. నా స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే, అతను అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన ఆఫర్ ను అంగకరించే వారని తెలిపాడు. (మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran khan) ను విమర్శిస్తూ).. పలు విషయాల్లో ఇమ్రాన్ పై విరుచుకుపడ్డాడు.  

ఆనాడు మేము అణు పరీక్ష (Nuclear Test)  నిర్వహించి… భారత్ కు గట్టి సమాధానం ఇచ్చామని తెలిపారు. ఆయన ఈ ర్యాలీలో దాదాపు 60 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన ప్రసంగం మొత్తం రాజకీయ కోణంలోనే సాగింది. తాను తన మద్దతుదారులకు ద్రోహం చేయలేదని, ఎలాంటి త్యాగాలకు సిగ్గుపడలేదని తెలిపారు.  తనపై, తన కూతురుపై, పార్టీ నేతలపై ఫేక్‌ కేసులు బనాయించారని గుర్తు చేశారు. అయినా కానీ ఎవరూ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) జెండాను విడిచిపెట్టలేదని తెలిపారు. తాను అధికారంలో ఉన్నప్పటి కంటే ఈరోజు రోటీ ధర ఎంత ఎక్కువగా ఉందో ఆయన పోల్చి చూశారు. ఇందుకే నన్ను తొలగించారా? అని ప్రశ్నించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) అధిష్టానం.. నేడు దేశం ఉన్న దారుణమైన స్థితిని గురించి విచారం వ్యక్తం చేసింది.