దొరికిపోయిన బైడెన్ సీక్రెట్ ఏజెంట్

దాదపు సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఈ మధ్య ఆగేలా కనిపించడం లేదు. ఒక వైపు రష్యానే తప్పు చేసిందని ఉక్రెయిన్ వాదిస్తుంటే… లేదు లేదు ఉక్రెయిన్ దేశమే అతి చేసిందని రష్యా అంటోంది. తప్పు ఎవరిది అయినా ఈ యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. చాలా వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. అదేంటి ఉక్రెయిన్-రష్యా యుద్ధం చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సఫర్ అవడం ఏంటని ఎవరికైనా అనుమానం వస్తుంది. […]

Share:

దాదపు సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఈ మధ్య ఆగేలా కనిపించడం లేదు. ఒక వైపు రష్యానే తప్పు చేసిందని ఉక్రెయిన్ వాదిస్తుంటే… లేదు లేదు ఉక్రెయిన్ దేశమే అతి చేసిందని రష్యా అంటోంది. తప్పు ఎవరిది అయినా ఈ యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. చాలా వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. అదేంటి ఉక్రెయిన్-రష్యా యుద్ధం చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సఫర్ అవడం ఏంటని ఎవరికైనా అనుమానం వస్తుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒక దేశం మీద మరో దేశం ఆధారపడుతోంది. దీంతో ఏ దేశం నుంచి వచ్చే సరకులు ఆగిపోయినా కానీ ఆ దేశంలో రేట్లు పెరగడం లేదా అక్కడి ప్రజలకు ఆ వస్తువులు దొరక్కపోవడం జరుగుతోంది. దీంతో ఈ యుద్ధానికి వీలైనంత త్వరగా రెండు దేశాలు ముగింపు పలకాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ ఈ రెండు దేశాల తీరు చూస్తుంటే వారి మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. 

ఉక్రెయిన్ కు పెద్దన్న అండ

ప్రపంచ దేశాలకు పెద్దన్న గా చాలా రోజుల నుంచి అమెరికా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని దేశాల కంటే ఆర్థికంగా బలంగా ఉన్న అమెరికాను కాదని ప్రపంచంలోని ఏ దేశం ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉందంటే అది అతిశయోక్తి కాదు. అటువంటి అమెరికా మాత్రం ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్ దేశానికి అండగా నిలుస్తూ వస్తోంది. ఆయుధాలను అందించడంతో పాటు ఉక్రెయిన్ దేశానికి భారీగా ఆర్థిక సాయం కూడా చేస్తోంది. దీంతో రష్యాకు కడుపు మండిపోతుంది. ఎలాగైనా అమెరికా మీద పై చేయి సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకోసమే అమెరికా తీసుకుంటున్న చాలా నిర్ణయాలకు రష్యా అభ్యంతరం తెలుపుతోంది. 

పట్టుబడిన సీక్రెట్ ఏజెంట్

అమెరికా బైడెన్ ప్రభుత్వంలో సీక్రెట్ ఏజెంట్ ఉన్నారని గత కొద్ది రోజుల నుంచి రష్యా ఆరోపిస్తుంది. కానీ ఈ ఆరోపణలను మాత్రం అమెరికా కొట్టి పారేస్తూ వస్తుంది. దీంతో ఇరుదేశాల మధ్య వైరం పతాక స్థాయికి చేరుకుంది. దీంతో ఎలాగైనా తన ఆరోపణలను నిజం చేసుకోవాలని రష్యా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే గూఢచార్యం ఆరోపణల మీద అమెరికాకు చెందిన ఒక పౌరుడిని రష్యా అధికారులు అరెస్ట్ చేశారు. ఇతను అమెరికాకు చెందిన సీక్రెట్ ఏజెంట్ అనే చెబుతున్నారు. అతడిని కస్టడీలో కూడా ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో రష్యా పోలీసులు అతడి నుంచి మరిన్ని వివరాలను పొందేందుకు సిద్ధం అవుతున్నారు. ఇతడి పేరు ఎమ్. స్పెక్టర్ అని రష్యా అధికారులు తెలుపుతున్నారు.

కస్టడీకి ఇచ్చిన లెఫెర్టోవో కోర్టు

ఇలా అమెరికాకు చెందిన సీక్రెట్ ఏజెంట్ అని చెప్పగానే మాస్కోలోని లెఫర్టోవో కోర్టు అతడిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా అతడిని తమ కస్టడీకి ఇవ్వడంతో మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం తమకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.అతడి మీద మోపిన అభియోగాలను బయటకు వెల్లడించేందుకు కోర్టు నిరాకరించింది. 2020లో గూఢచర్యానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్న యూఎస్ మాజీ సైనికాధికారి మెరైన్ పాల్ వీలన్ కు యూఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ఫోన్ చేశాడనే వార్తలు వచ్చిన ఒక రోజు తర్వాత రష్యాలో స్పెక్టర్ అరెస్ట్ కావడం గమనార్హం.

యుద్ధం ఆగేనా… 

ఉక్రెయిన్ కు తొలి నుంచి అమెరికా సాయంగా ఉంటోందని రష్యా ఆరోపిస్తుంది. అందుకే అమెరికాకు గట్టిగా బదులు చెప్పాలని నిర్ణయించుకున్న రష్యా బైడెన్ సీక్రెట్ ఏజెంట్ అంటూ అమెరికా పౌరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. అతడి మీద తీవ్రమైన అభియోగాలు కూడా మోపింది. ఈ నేపథ్యంలో అమెరికా ఉక్రెయిన్ కు సహాయం చేయడం ఆపుతుందా? అని అంతా చర్చించుకుంటున్నారు. అమెరికా సాయం విషయంలో వెనకడుగు వేస్తే ఉక్రెయిన్ కూడా యుద్ధం విషయంలో వెనకడుగు వేసే అవకాశం ఉందని అంటున్నారు.