2023 సంవత్సరం మొదట్లో, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వైట్ హౌస్ సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా అదే విధంగా భారతదేశం మధ్య బంధం మరింత బలపడుతుందని, అమెరికా సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే కెనడాలో ఉగ్రవాది మరణానికి సంబంధించి భారత హస్తం ఉంది అంటూ ఆరోపిస్తున్న కెనడా విషయం మీద స్పందించింది యూఎస్.
కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని ఒట్టావా చెప్పడంతో, అమెరికా భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని, ఈ విషయంలో వాషింగ్టన్ ఎలాంటి ‘ప్రత్యేక మినహాయింపు’ ఇవ్వడం లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా గురువారం తెలిపారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని..భారత ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ ఏడాది ప్రారంభంలో వైట్‌హౌస్‌లో రాష్ట్ర పర్యటన కోసం ఆతిథ్యం ఇచ్చారని.. సుల్లివన్ మరోసారి గుర్తు చేశారు.
అయితే ఈ క్రమంలో భారత్ అదేవిధంగా అమెరికా మధ్య ఉన్న సానుకూల బంధానికి, ఇప్పుడు కెనడాలో జరిగిన సంఘటన ఏ విధంగాను ప్రభావితం చేసినప్పటికీ, యుఎస్ మాత్రం ఎప్పుడు తమ ప్రిన్సిపల్స్ ప్రకారమే నడుచుకుంటుందని సుల్లివన్ అన్నారు. నిజానికి ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఆందోళన కలిగించే విషయం అని, అంతేకాకుండా ఈ సంఘటన తీవ్రంగా పరిగణించే విషయం అని.. ఈ విషయానికి సంబంధించి తాము చేయాల్సిన పని తప్పకుండా చేసి తీరుతామని సుల్లివన్ వైట్ హౌస్ దగ్గర విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
అంతేకాకుండా ముఖ్యంగా ఇలాంటి చర్యలకు ప్రత్యేక మినహాయింపులు ఉండవని గుర్తు చేశారు యూఎస్ ప్రతినిధి. దేశంతో సంబంధం లేకుండా, తాము ఎప్పటికీ కూడా నిలబడి తమ ప్రాథమిక సూత్రాలను కాపాడుకుంటామని, అదే విధంగా కెనడా వంటి మిత్రదేశాలు, వారి తరుపు నుంచి చట్ట ప్రకారం చేయాల్సిన ప్రాసెస్ చేస్తున్నప్పుడు.. తమ వైపు నుంచి కూడా వారితో కూడా సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతామని యూఎస్ ప్రతినిధి చెప్పుకొచ్చారు.
ఎప్పటికీ కూడా యూఎస్, కెనడాల మధ్య భిన్నత్వం ఉంటుందన్న ఆరోపణలు తిరస్కరిస్తుందని, యుఎస్ ప్రతినిధి గుర్తు చేశారు. కెనడా ప్రస్తుతం భారతదేశం మీద చేసిన ఆరోపణలపై, యూఎస్ తరపున తమకి తీవ్ర ఆందోళనలు ఉన్నాయని, ఈ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి, నేరస్థులను పరిగణనలోకి తీసుకోవాలని తమ కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు యూఎస్ ప్రతినిధి.
గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటుకు తెలియజేశారు.
పంజాబ్‌లోని లూథియానాలో 2007లో ఆరుగురు మరణాలకు గాను, 40 మంది గాయపడిన పేలుడుతో సహా అనేక కేసుల్లో నిజ్జర్ కూడా ఒక నిందితుడు. అతను రాష్ట్రీయ సిక్కు సంగత్ అధ్యక్షుడు రుల్దా సింగ్ (పాటియాలా, 2009) హత్యలో కూడా హస్తమున్న వ్యక్తి. గత జూలైలో, పంజాబ్‌లోని జలంధర్‌లో హిందూ పూజారి హత్య కేసులో నిజ్జర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ₹ 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. కెనడా, యుకె మరియు యుఎస్‌లలోని భారత దౌత్య కార్యాలయాలపై ఇటీవలి జరిగిన దాడులను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18, 2023న కెనడాలో కాల్చి చంపబడ్డాడు. సర్రేలోని గురుద్వారా బయట హర్దీప్ సింగ్ నిజ్జర్ ను తుపాకీలతో కాల్చి చంపేశారు.