బరాక్ ఒబామా పర్సనల్ చెఫ్ అనుమానాస్ప‌ద  మృతి

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్సనల్ చెఫ్ అయిన టఫారి కాంప్‌బెల్, మార్తాస్ వైన్యార్డ్‌లోని ఒబామా ఇంటికి అతి దగ్గరలో ఉన్న ఒక చెరువు (pond)లో మునిగి చనిపోవడం జరిగింది. అయితే ఆదివారం ఆయన పెడల్ బోర్డింగ్ చేస్తూ, అంటే చిన్న పడవ మీద ఒక్కడే ప్రయాణించడం లాంటిది చేస్తూ, మునిగిపోయినట్లు ఆయనతో పాటు ఉన్న కొంతమంది పెడల్ బోటింగ్ చేస్తున్న వాళ్ళు సమాచారం ఇచ్చిన దాని ప్రకారం, పోలీసులు సోనార్ అన్వేషణ తర్వాత సోమవారం ఆయన […]

Share:

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్సనల్ చెఫ్ అయిన టఫారి కాంప్‌బెల్, మార్తాస్ వైన్యార్డ్‌లోని ఒబామా ఇంటికి అతి దగ్గరలో ఉన్న ఒక చెరువు (pond)లో మునిగి చనిపోవడం జరిగింది. అయితే ఆదివారం ఆయన పెడల్ బోర్డింగ్ చేస్తూ, అంటే చిన్న పడవ మీద ఒక్కడే ప్రయాణించడం లాంటిది చేస్తూ, మునిగిపోయినట్లు ఆయనతో పాటు ఉన్న కొంతమంది పెడల్ బోటింగ్ చేస్తున్న వాళ్ళు సమాచారం ఇచ్చిన దాని ప్రకారం, పోలీసులు సోనార్ అన్వేషణ తర్వాత సోమవారం ఆయన మృతదేహం లభ్యం అయింది. 

టఫారి కాంప్‌బెల్ గురించి: 

సోమవారం, ఒబామా ఇంటి దగ్గరలో ఉన్న ఎడ్గార్‌టౌన్ గ్రేట్ పాండ్ (కొలను) నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఆ మృతదేహం మరెవరిదో కాదు, పాడిల్‌బోర్డర్ వర్జీనియాలోని డంఫ్రీస్‌కు చెందిన టఫారి కాంప్‌బెల్, 45 అని మసాచుసెట్స్ స్టేట్ పోలీసులు ధృవీకరించారు. ఒబామా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ గా పాలనలో ఉన్నప్పుడు ఆయనకి పర్సనల్ చీఫ్ గాటఫారి కాంప్‌బెల్ పనిచేశారు. అయితే ప్రస్తుతం సోమవారం జరిగిన ప్రమాదం సమయంలో ఒబామా దంపతులు ఇంట్లో లేరు.

ఒక ప్రకటనలో, మాజీ అధ్యక్షుడు మరియు అతని భార్య మిచెల్ ఒబామా, మరణించిన చీఫ్ ‘మా కుటుంబంలో ఆయన ఒకరు’ అని పేర్కొన్నారు. టఫారి కాంప్‌బెల్ని మొదటిసారి ఒబామా దంపతులు కలిసినప్పుడు, అతను వైట్ హౌస్‌లో ఒక బెస్ట్ సౌస్ చెఫ్ గా పని చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఆయనకు సృజనాత్మకత మరియు ఆహారం పట్ల మక్కువ ఎక్కువ అందుకే ఆయన ఒక పెద్ద గొప్ప చెఫ్ గా ఎదిగారు అని గుర్తు చేస్తున్నారు ఒబామా జంట.

బాధలో ఒబామా కుటుంబం:

అయితే తర్వాత క్యాంప్‌బెల్ని గురించి ఇంకాస్త బాగా తెలుసుకుని, ఆయన మంచితనాన్ని గుర్తించామని.. అంతేకాకుండా ఆయన తమ కోసం ఒక చీఫ్ గా తమకు అప్పగించిన పనిని 1000 రెట్లు ఎక్కువ సామర్థ్యంతో చేయగల వ్యక్తి అని, అంతేకాకుండా, ఒబామా అమెరికా ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించిన తర్వాత కూడా, వారు వైట్ హౌస్ నుండి బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు, తఫారీని తమతో పాటు ఉండమని అడిగినట్లు ఒబామా, అలాగే ఆయన భార్య గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా అప్పటి నుంచి తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయాడని, ఇప్పుడు ఆయన మా మధ్యలో లేకపోవడం నిజంగా దురదృష్టకరమైన విషయమని బాధపడ్డారు ఒబామా జంట.

ఆదివారం రోజున పెడల్ బోర్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు, ఆయన కనిపించకుండా పోయారని తోటి వెడల్ బోటింగ్ చేస్తున్నా కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆదివారము పాండ్లో మునిగిపోయి కనిపించకుండా పోయిన టఫారి కాంప్‌బెల్ కోసం అన్వేషణ ఆదివారం మొదలుపెట్టినప్పటికీ కొన్ని కారణాలవల్ల అన్వేషణ మధ్యలో ఆగిపోయింది. అయితే తర్వాత, సోమవారం మళ్లీ పెడల్ బోటింగ్ పడవ నుంచి వచ్చిన సోనార్ సిగ్నల్స్ ద్వారా ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆయన మృతదేహాన్ని ఒడ్డు నుండి 100 అడుగుల (30 మీటర్లు) సుమారు 8 అడుగుల (2.4 మీటర్లు) లోతులో గుర్తించినట్లు తెలిపారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో క్యాంప్‌బెల్ లైఫ్ జాకెట్ వేసుకోలేదని పోలీసులు తెలిపారు. అందుకే ఊపిరి ఆడక నీటి ఉపరితలం మీద చాలా సేపు ఈదడానికి ప్రయత్నించి, మునిగిపోయినట్లు తెలిసింది. 

ఒబామా కుటుంబం 2021లో బోస్టన్ సెల్టిక్స్ యజమాని విక్లిఫ్ గ్రౌస్‌బెక్ నుండి మార్తాస్ వైన్యార్డ్‌లో దాదాపు 7,000 చదరపు అడుగుల భవనాన్ని కొనుగోలు చేసింది. ఇల్లు అట్లాంటిక్ మహాసముద్రం బీచ్ ద్వారా వేరు చేయబడిన ఒక చెరువును ఆనుకుని ఉంది.