బంగ్లాదేశ్‌లో  ఘోర  బస్సు ప్రమాదం

బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.రోడ్డుపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదానికి గురైన బస్సులో 52 మంది మాత్రమే కూర్చునే సామర్ద్యం ఉంది కాని 60 మంది ప్రయాణికులతో బస్సు భండారియా సబ్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి సౌత్‌వెస్ట్‌ డివిజన్‌ ​​ప్రధాన కార్యాలయమైన బరిసాల్‌కు వెళ్తుండగా జలకాతి జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ  రోజు జరిగిన ఈదుర్ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు, ప్రయాణికులు ఆరోపించారు. క్రేన్ […]

Share:

బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.రోడ్డుపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదానికి గురైన బస్సులో 52 మంది మాత్రమే కూర్చునే సామర్ద్యం ఉంది కాని 60 మంది ప్రయాణికులతో బస్సు భండారియా సబ్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి సౌత్‌వెస్ట్‌ డివిజన్‌ ​​ప్రధాన కార్యాలయమైన బరిసాల్‌కు వెళ్తుండగా జలకాతి జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ  రోజు జరిగిన ఈదుర్ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు, ప్రయాణికులు ఆరోపించారు.

క్రేన్ సహాయంతో చెరువు నుంచి బస్సును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భారీ వర్షాల కారణంగా చెరువు పూర్తిగా నీటితో నిండి ఉంది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటనలోఈ ఘటనలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పిల్లలు సహా 17 మంది మృతి చెందారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

 రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత బస్సులో మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మరో 20 మంది ప్రయాణికులు జలకత్తిలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ జహీరుల్ ఇస్లాం ప్రకారం, రెస్క్యూ కార్మికులు సంఘటనా స్థలం నుండి 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, మరో నలుగురు ఆసుపత్రిలో మరణించారు. గాయపడిన వారిలో ఐదుగురిని బరిషల్‌లోని షేర్-ఎ-బంగ్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

ప్రమాదంలో గాయ పడిన వ్యక్తి మాట్లాడుతూ ….

ఈ ప్రమాదంలో గాయపడిన ఎండీ మోమిన్ అనే వ్యక్తి  తాను భండారియాలో బస్సు ఎక్కానని..అప్పటికే బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోయిందన్నాడు. వారిలో కొందరు కారిడార్‌లో నిలబడి ఉన్నారు.ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి కిందపడిందని తెలిపాడు. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటం కారణంగా నీళ్లలో మునిగిపోయిందన్నాడు. తాను ఎలాగోలా బస్ లోంచి దిగినట్లు ఆయన తెలిపాడు .

బంగ్లాదేశ్‌లో బస్సు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ (RSF) ప్రకారం.. జూన్‌లో మాత్రమే మొత్తం 559 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 562 మంది, 812 మంది గాయపడ్డారు. ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం..  దేశవ్యాప్తంగా 207 మోటార్‌సైకిల్ ప్రమాదాల్లో 169 మంది మరణించారని, ఇది మొత్తం మరణాలలో 33.75 శాతంగా ఉందని బుధవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

నివేదిక ప్రకారం.. 78 మంది మహిళలు, 114 మంది పిల్లలు ఉన్నారు.  తొమ్మిది జలమార్గ ప్రమాదాల్లో తొమ్మిది మంది మరణించారు. ఏడుగురు తప్పిపోయారు. అదే సమయంలో 21 రైల్వే ప్రమాదాల్లో కనీసం 18 మంది మరణించారు. పదకొండు మంది గాయపడ్డారు. రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ పరిశీలన , విశ్లేషణ ప్రకారం.. అత్యధికంగా 247 (44.18 శాతం) ప్రాంతీయ రహదారులపై, 182 (32.55 శాతం) జాతీయ రహదారులపై, 59 (10.55 శాతం) గ్రామీణ రహదారులపై, మూడు (0.53 శాతం) పట్టణ రహదారులపై జరిగాయి.

బారిషల్ డివిజనల్ కమిషనర్ MD షౌకత్ అలీ మొత్తం 17 మంది అక్కడికక్కడే మరణించారని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది పిరోజ్‌పూర్‌లోని భండారియా ఉపజిల్లా మరియు ఝల్‌కతీలోని రాజాపూర్ ప్రాంతంలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు.ఈ సంఘటన తర్వాత ఖుల్నా-జలకతి రహదారిపై ట్రాఫిక్ మూసివేయబడింది, ప్రతి వైపు వందలాది వాహనాలు నిలిచిపోయాయి.