బంగా బట్టల బజార్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 3000 దుకాణాలు అగ్నికి ఆహుతి..

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న బట్టల బజారులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ఉన్న సుమారు 3000 దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి.  దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణంగా వేసవికాలంలో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని దాఖలు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చేసుకుంది. మార్కెట్ సముదాయంలో పలు కాంప్లెక్స్ లలో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో సుమారు మూడువేల బట్టల దుకాణాలు పూర్తిగా […]

Share:

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న బట్టల బజారులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ఉన్న సుమారు 3000 దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. 

దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణంగా వేసవికాలంలో పలుచోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని దాఖలు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చేసుకుంది. మార్కెట్ సముదాయంలో పలు కాంప్లెక్స్ లలో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో సుమారు మూడువేల బట్టల దుకాణాలు పూర్తిగా దగ్ధమయయ్యాయి. దీంతో వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. పూర్తి వివరాలు ఇలా  ఉన్నాయి.. బంగ్లాదేశ్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఒకేచోట 3 వేల షాపులు దగ్ధం అవడంతో ఆ ఏరియా అంతా నిర్మానుష్యంగా మారిపోయింది..

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న బట్టల బజారులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అందులో ఉన్న సుమారు 3000 దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. భారీగా చెలరేగిన మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది, ఆర్మీ సిబ్బంది తీవ్రంగా కృషి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.. బంగ్లా దేశం లోనే క్లాత్ మార్కెట్లకు నిలయం బంగా బజార్.. ఇరుకైన దుకాణాలు.. పెద్ద ఎత్తున జనాలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.. ఇందులోనే తెల్లవారుజామున మంటలు రగులుకున్నాయి..

ప్రాణ నష్టం లేదు..

అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.. ఈ విషయమై అగ్నిమాపక సేవ అధికారి రషీద్ బిన్ ఖలీల్ మాట్లాడుతూ.. ఉదయం నుంచి మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది పనిచేస్తున్నాయని.. అయితే మంటలు చెలగలేయడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని తెలిపారు.. చాలా దుకాణాలు మంటల్లో బూడిదయ్యాయని, అయితే లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనేదానిపై ఎటువంటి సమాచారం లేదని, చాలా దుకాణాలు తెరవకముందే తెల్లవారుజామున మంటలు చెలరేగాయని ఖలీద్ తెలిపారు.

ఇటీవల మరో ప్రమాదం..

బంగ్లాదేశ్‌లో మరో ఘోర బస్సు ప్రమాదం ఇటీవల జరిగింది వేగంగా వెళుతున్న బస్సు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి చోచ్చుకుపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాంగ్లాదేశ్ రాజధాని దాకా కు చెందిన వేగంగా వెళ్తోంది ఈ క్రమంలో ఉదయం 7 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది మరణించారు. మరో 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. 

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ..రక్షణ సిబ్బంది అక్కడికి చేరుకునే సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిపాపక సిబ్బంది కూడా సహాయక చర్యలలో పాల్గొన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అధికారులు భావించారు బస్సు టైర్ పేలిపోవడం వల్ల కూడా ఈ ఘటన జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఈ ఘటనపై విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీస్తామని అధికారులు తెలిపారు.