బేబీ సిట్ట‌ర్‌కు 690 ఏళ్ల యావజ్జీవ శిక్ష..!

చిన్నతనం నుంచి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వారికి ఎలాంటి విషయాలు నేర్పాలి, చెడు స్నేహాల నుంచి ఎలా దూరం చేయాలి, క్రమశిక్షణగా ఒక పద్ధతిలో వారిని చూసుకోవాలి అంటూ తల్లిదండ్రులు చిన్నతనం నుంచి పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ వహిస్తున్నప్పటికి కొంతమంది పిల్లలు మాత్రం తప్పుదారి పట్టడం, చివరికి జైలు పాలు అవ్వడం, ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్న సంఘటనలు మరొకసారి గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి ఒక […]

Share:

చిన్నతనం నుంచి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వారికి ఎలాంటి విషయాలు నేర్పాలి, చెడు స్నేహాల నుంచి ఎలా దూరం చేయాలి, క్రమశిక్షణగా ఒక పద్ధతిలో వారిని చూసుకోవాలి అంటూ తల్లిదండ్రులు చిన్నతనం నుంచి పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ వహిస్తున్నప్పటికి కొంతమంది పిల్లలు మాత్రం తప్పుదారి పట్టడం, చివరికి జైలు పాలు అవ్వడం, ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్న సంఘటనలు మరొకసారి గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి ఒక సంఘటన యుఎస్ లో చోటు చేసుకుంది. చెడు ఆలోచనలకు తావు ఇచ్చి జైలు పాలు అయ్యాడు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్న పోలీసులు అసలు ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని ఆలోచనలో పడ్డారంటే, నిందితుడు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చెప్పనాల్సిన అవసరం లేదు. 

690 ఏళ్లు జైలు శిక్ష: 

34 ఏళ్ల ఒక కుర్రాడికి ఏకంగా 690 ఏళ్ల యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ అందించిన సమాచారం ప్రకారం, అతను 16 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించినందుకు, అంతేకాకుండా మరొక అబ్బాయికి అశ్లీల చిత్రాలను చూపించినందుకుగాను, దోషిగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. 

కోస్టా మెసాకు చెందిన మాథ్యూ జక్ర్‌జెవ్‌స్కీ 34 నేరాలలోగాను దోషిగా నిర్ధారించడం జరిగింది, అయితే ఇందులో 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్‌లతో 27 అసభ్యకరమైన లైంగిక చర్యలకు పాల్పడినట్లు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల నోటితో అసభ్యకరమైన చర్యలకు పాల్పడినట్లు, చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా నిర్వహించిన క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా చిన్న పిల్లలను టార్గెట్ చేసి, వాళ్ళని పోర్నోగ్రఫీ చేసే విధంగా ప్రేరేపించినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు, మాథ్యూ జక్ర్‌జెవ్‌స్కీ నేరాల చిట్టి చూసి వళ్ళు గగరపురిచిందని చెప్పుకొచ్చారు. మొత్తం 34 నేరాలు నిర్ధారణ జరిగింది కాబట్టి ,ఇప్పుడు తనకి 690 ఏళ్ల యావజ్జీవ పడే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

తల్లితండ్రులు ఉద్యోగాల కోసం, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తమ పిల్లలను సంరక్షించేందుకు బేబీ సిట్టర్ ఎంచుకున్న క్రమంలో అస్సలు పొరపాటు జరగకుండా చూసుకోవాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇప్పుడు జరిగిన విషయం తీసుకున్నట్లయితే, పిల్లలను ఒక రక్షకుడి చేతిలో ఉంచి ధైర్యంగా తమ పనులను చేసుకుంటున్నాం అనుకున్న తల్లిదండ్రులకు, నిజానికి తమ పిల్లలు ఒక రాక్షసుడు చేతిలో బలైపోతున్నారని తెలుసుకోలేకపోయారని, కేవలం కొంతమంది పిల్లలు ధైర్యం చేసి తమకు జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టిన నిజాలు కారణంగానే ఇప్పుడు చాలామంది పిల్లలను కాపాడగలిగామని, ఇటువంటి ధైర్య సాహసాలు ఉన్న పిల్లల తల్లితండ్రుల పెంపకాన్ని గురించి గర్వపడుతున్నామని మాట్లాడారు జిల్లా అటార్నీ టాడ్ స్పిట్జర్. 

నానీగా పనిచేసిన నిందితుడు: 

Zakrzewski దక్షిణ కాలిఫోర్నియా అంతటా ఉన్న కుటుంబాలకు మగ బేబీ సిట్ట‌ర్‌ గా పనిచేశాడు నిందితుడు. తన వెబ్‌సైట్‌లో “రియల్ సిట్టర్ బడ్డీ” అని తనకి తాను పేరు పెట్టుకున్నారు. ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్ ప్రకారం, మెంటార్‌షిప్‌లు, ఓవర్‌నైట్ మరియు వెకేషన్ బేబీ సిట్టింగ్‌తో సహా పలు రకాల బేబీ సిట్టింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని వెబ్సైట్ ద్వారా, నిందితుడు చాలామందిని ఆకర్షించేవాడని చెప్పకొచ్చారు.

ఇలా బయటపడిన నిజం: 

మే 2019లో లగునా బీచ్ దంపతులు తమ బేబీ సిటర్, జక్ర్‌జెవ్‌స్కీ తమ ఎనిమిదేళ్ల బాబుని కాస్త అసభ్యకరంగా తాకారని గమనించి వెంటనే పోలీసులను ఆశ్రయించడం జరిగింది. తమ పిల్లలకు జరిగినట్లుగా ఇతర పిల్లలకు కూడా జరుగుతుందేమో అని భయంతో పోలీసులను ఆశ్రయించినట్లు దంపతులు చెప్పుకొచ్చారు. అప్పుడే అసలు విషయం గురించి విచారించిన పోలీసులకు బేబీ సీటర్ బండారం బయటపడింది.