వినూత్న ఆలోచనతో లక్షల్లో సంపాదిస్తున్న ఆస్ట్రేలియా మహిళ

మనీ మైండ్ ఉన్న ఎవరైనా సరే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మరికొందరు లేని అవకాశాన్ని సృష్టించుకుని సంపాదించడం మొదలుపెడతారు. ఇదే తరహాలో, మోనిక్ జెరెమియా అనే ఆస్ట్రేలియన్ మహిళ తన ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఒక విచిత్రమైన మార్గాన్ని కనిపెట్టింది, “హాట్ బెడ్డింగ్” అని పిలిచే ఒక అసాధారణ పద్ధతిని పాటిస్తూ తను ఇప్పుడు నెలకు దాదాపు రూ. 42,000 సంపాదిస్తున్నట్లు సమాచారం. హాట్ బెట్టింగ్ కాన్సెప్ట్ ఏంటి?:  మోనిక్ జెరెమియా అనే ఆస్ట్రేలియన్ […]

Share:

మనీ మైండ్ ఉన్న ఎవరైనా సరే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మరికొందరు లేని అవకాశాన్ని సృష్టించుకుని సంపాదించడం మొదలుపెడతారు. ఇదే తరహాలో, మోనిక్ జెరెమియా అనే ఆస్ట్రేలియన్ మహిళ తన ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఒక విచిత్రమైన మార్గాన్ని కనిపెట్టింది, “హాట్ బెడ్డింగ్” అని పిలిచే ఒక అసాధారణ పద్ధతిని పాటిస్తూ తను ఇప్పుడు నెలకు దాదాపు రూ. 42,000 సంపాదిస్తున్నట్లు సమాచారం.

హాట్ బెట్టింగ్ కాన్సెప్ట్ ఏంటి?: 

మోనిక్ జెరెమియా అనే ఆస్ట్రేలియన్ మహిళ తన రోజు వారు గడవడానికి, కరోనా సమయంలో ఎంతగానో కష్టపడిందట. ఇదే క్రమంలో తనకి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. తాను నిద్రపోవడానికి ఉపయోగించే బెడ్ మరోకరికి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధపడింది.

ఈ క్రమంలో అందిన నివేదించిన ప్రకారం, జెరెమియా తన పడకను పంచుకోవడానికి, రెంట్ కు ఇవ్వటానికి ముందుకొచ్చింది. చివరికి ఈ ప్రయత్నం ద్వారా సుమారు రూ. 41,624.92 నెలవారీ ఆదాయాన్ని పొందింది. ఈ వినూత్నమైన ఆలోచన ద్వారా తను సంపాదించడమే కాకుండా, మరి ఎంతోమందిని కలుసుకునే అవకాశాన్ని కల్పించుకుంది. అయితే ఆమె ఏర్పాటు చేసిన ఈ వినూత్నమైన హాట్ బెడ్డింగ్ కాన్సెప్ట్ లో, పక్క వారికి మనకి ఎటువంటి సంబంధం లేకుండా, రొమాంటిక్ యాంగిల్ లేకుండా ఉంటుందని ఆమె స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా బెడ్ షేర్ చేసే క్రమంలో ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తప్పకుండా ఆమె పాటిస్తుందని మరొకసారి గుర్తు చేస్తుంది.

COVID-19 మహమ్మారి తెచ్చిన ఒంటరితనం ద్వారా హాట్ బెడ్డింగ్‌ కాన్సెప్ట్ గురించి జెరెమియా తీసుకున్న నిర్ణయం బాగా ప్రభావితమైంది. ఆమె తన ఇంటికే పరిమితమైన ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఒక మార్గాన్ని వెతుకింది. అయితే ఇప్పుడు ఆమె వినూత్నంగా ఆలోచించిన హాట్ బెడ్డింగ్  కాన్సెప్ట్ ద్వారా ఆమె భావోద్వేగ అవసరాలను తీర్చడమే కాకుండా ఆర్థికపరంగా కూడా బలంగా మారడానికి సహాయపడుతుంది. ఈ ఆలోచన గురించి తెలిసిన తర్వాత, చాలామంది నెటిజన్స్ తమవైపు నుంచి కొంతవరకు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

జాగ్రత్తలు తప్పనిసరి: 

హాట్ బెడ్డింగ్ వంటి పద్ధతులతో ముడిపడి ఉన్న ప్రమాదాలను గుర్తించినప్పటికీ, జెరెమియా ధైర్యంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఫలితం నిజానికి ఆమె అంచనాలను మించిపోయింది, నెలవారి ఆదాయంతో పాటుగా మరింత కనెక్షన్స్ పెంచే నెట్వర్క్ సృష్టించుకోవడంలో సహాయపడింది. జెరేమియా హాట్ బెడ్ గురించి ఆసక్తిగా ఉన్నవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు, ఇలాంటి ఏర్పాట్లను కోరుకునే వ్యక్తులు పూర్తిగా ప్లాటోనిక్ కనెక్షన్‌ని పాటించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 

ఆస్ట్రేలియా యువతి మోనిక్ జెరెమియా, ఇటువంటి హాట్ బెడ్డింగ్ కాన్సెప్ట్ పాటిస్తూ సంవత్సరానికి లక్షలలో సంపాదిస్తున్నప్పటికీ, ఆమెలో కాస్త భయాందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హాట్ బెడ్డింగ్ పద్ధతిని పాటించే కొంతమందికి ఆమె తరపు నుంచి సలహా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ వ్యాపారం నిజంగా కాస్త ఆందోళనకు గురి చేసే ఆలోచన అని ఆమె క్రమంగా గ్రహించింది, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ విషయానికొస్తే, ముఖ్యంగా తెలియని వారితో బెడ్ షేర్ చేసుకోవడం అనేది చాలా రిస్కీ. హాట్ బెడ్డింగ్ విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తికి మంచి విలువలు ఉన్నాయని, ఓపెన్ మైండెడ్, గౌరవప్రదంగా మరియు ప్లాటోనిక్ సంబంధాన్ని మాత్రమే అవతల వ్యక్తి కోరుకుంటున్నాడో లేదో ముందుగా నిర్ధారించుకోవాలని, మోనిక్ హాట్ బెడ్డింగ్ కాన్సెప్ట్ ఉపయోగిస్తున్న యజమానులను కోరింది. యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ చేసిన సర్వే ప్రకారం, వేల మంది అంతర్జాతీయ విద్యార్థులు హాట్ బెడ్డింగ్‌పై ఆధారపడుతున్నారు.