చైనా జైలులో ఆస్ట్రేలియ‌న్ జ‌ర్న‌లిస్ట్

చైనీస్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CGTN చెందిన మాజీ యాంకర్ 2020లో “విదేశాలకు ప్రభుత్వ రహస్యాలను చేర వేస్తున్నందుకు” అధికారికంగా అభియోగాలు మీడియా ముందుకు రావడంతో ఆమెను అరెస్టు చేయడం జరిగింది. ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చెంగ్ లి తన పిల్లల కోసం మిస్ అవుతున్న అంటూ ఇటీవల ఉత్తరం రాసినట్లు తెలుస్తోంది. ఉత్తరంలో ఏముంది:  మూడు సంవత్సరాల క్రితం అరెస్టయినా ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చెంగ్ లీ తన పిల్లలని చూడాలని అదేవిధంగా బయట సూర్యుడి వెలుగును చూడాలని ఆశపడుతున్నట్లు […]

Share:

చైనీస్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ CGTN చెందిన మాజీ యాంకర్ 2020లో “విదేశాలకు ప్రభుత్వ రహస్యాలను చేర వేస్తున్నందుకు” అధికారికంగా అభియోగాలు మీడియా ముందుకు రావడంతో ఆమెను అరెస్టు చేయడం జరిగింది. ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చెంగ్ లి తన పిల్లల కోసం మిస్ అవుతున్న అంటూ ఇటీవల ఉత్తరం రాసినట్లు తెలుస్తోంది.

ఉత్తరంలో ఏముంది: 

మూడు సంవత్సరాల క్రితం అరెస్టయినా ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ చెంగ్ లీ తన పిల్లలని చూడాలని అదేవిధంగా బయట సూర్యుడి వెలుగును చూడాలని ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె చైనాలో రహస్యంగా అరెస్టు అయిన తర్వాత, మూడు సంవత్సరాలను గుర్తు చేస్తూ ఆమె అరుదైన బహిరంగ లేఖలో పేర్కొంది. కాన్‌బెర్రా మరియు బీజింగ్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఘర్షణను గుర్తు చేస్తూ, తన సెల్ నుండి ఆస్ట్రేలియన్ అధికారులకు నిర్దేశించిన నోట్‌లో చెంగ్ తన జైలు పరిస్థితులను వివరిస్తుంది.

“నేను చాలా రోజులుగా వెలుగులోకి వెళ్ళలేదు,” అనే అనే మెసేజ్ ఆస్ట్రేలియా కి చేరింది. “నా సెల్‌లో, సూర్యకాంతి కిటికీలోంచి కనిపిస్తుంది, కానీ నేను సంవత్సరానికి 10 గంటలు మాత్రమే సూర్యుని వెలుగులో నిలబడే అవకాశం ఉంటుంది” అంటూ ఆమె లేఖలు రాసుకుంది. ఆమె మెసేజ్న్ని ఆస్ట్రేలియన్ న్యూస్ అవుట్‌లెట్‌లతో మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో చెంగ్ భర్త నిక్ కోయిల్ గురువారం సాయంత్రం షేర్ చేసుకోవడం జరిగింది.

ఆమెను ఎందుకు అరెస్టు చేశారు: 

చైనా మరియు ఆస్ట్రేలియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో చెంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు, ఆమె అరెస్ట్‌లో రాజకీయ వ్యూహాలు పాత్ర పోషించాయా అని కొందరు ప్రశ్నించారు. ఆమె కేసు తరచుగా చైనీస్-ఆస్ట్రేలియన్ రచయిత యాంగ్ జున్‌తో పోల్చుతూ ఉంటారు, ముఖ్యంగా చెంగ్ లి ఒక గూఢచర్యం ఆరోపణలపై 2019 నుండి చైనాలో జైల్లో వేయడం జరిగింది

ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ, దేశం మొత్తం చెంగ్ “తన పిల్లలతో మళ్లీ కలిసిపోవాలని” కోరుకుంటున్నట్లు చెప్పారు. “Ms చెంగ్ కోసం ఆస్ట్రేలియా వాదించింది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా న్యాయం, విధానపరమైన న్యాయమైన ప్రాథమిక ప్రమాణాలను పాటించాలని కోరింది” అని పెన్నీ వాంగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం, చెంగ్ కటకటాల వెనుక ఎదుర్కొన్న “ఆరోగ్య సమస్యల” గురించి తనకు తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయని కోయిల్ చెప్పాడు.

‘నా పిల్లలను మిస్ అవుతున్నాను’ మెసేజ్ లో, ఇద్దరు పిల్లలు ఉన్న చెంగ్ లి తాను మూడేళ్లుగా చెట్టును చూడలేదని మరియు ఆస్ట్రేలియా యొక్క బుష్‌వాక్‌లు, బీచ్‌లు మరియు సూర్యకాంతిని చూడాలని చెంగ్ లి తన కోరిక గురించి మాట్లాడింది. జైలులో ఉన్న తన పరుపును ఏడాదికి ఒకసారి మాత్రమే బయట ఎండబెట్టేవారని చెప్పింది. ఆమె తనను తాను చైనీస్-ఆస్ట్రేలియన్ అని వర్ణించుకుంటుంది. “అన్నింటికంటే నేను పిల్లలను మిస్ అవుతున్నాను,” అంటూ ఆమె లేఖను ముగించింది. చెంగ్ ఆగస్టు 2020 నుండి ఆమెను బంధించడం జరిగింది , అయితే అధికారికంగా ఫిబ్రవరి 2021లో మాత్రమే అరెస్టు చేయడం జరిగింది.

గత మార్చిలో ఆమెను విచారించారు, చైనాలోని ఆస్ట్రేలియా రాయబారి కూడా విచారణల లో పాల్గొనడానికి, కోర్టులోకి ప్రవేశించకుండా చేయడం ఇక్కడ గమనార్హం. కోర్టు తీర్పును అదేవిధంగా చెంగ్ శిక్షను వాయిదా వేసింది, ఇది జీవితకాలం వరకు పొడిగించవచ్చు అంటూ కొందరు ఆస్ట్రేలియన్ అధికారులు ఊహిస్తున్నారు.