UKలో 20 సంవత్సరాల కనిష్టానికి జననాల రేటు

UKలో జననాల రేటు 20 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. UKలో జననాల రేటు పడిపోయిన సమయంలో ఇండియన్స్ క్రియేట్ చేసిన రికార్డు అక్కడ చర్చనీయాంశమైంది. ఇండియన్స్ కనుక లేకపోతే UK పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు. అసలు ఇండియన్సే లేకపోతే UKకు మరీ గడ్డుకాలం వచ్చేదని ఒప్పుకోవాల్సిందే. అసలు UKకు ఇటువంటి పరిస్థితి వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.  23.1 శాతం బయటోళ్లే.. UKలో పుట్టిన […]

Share:

UKలో జననాల రేటు 20 సంవత్సరాల కనిష్టానికి పడిపోయింది. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. UKలో జననాల రేటు పడిపోయిన సమయంలో ఇండియన్స్ క్రియేట్ చేసిన రికార్డు అక్కడ చర్చనీయాంశమైంది. ఇండియన్స్ కనుక లేకపోతే UK పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు. అసలు ఇండియన్సే లేకపోతే UKకు మరీ గడ్డుకాలం వచ్చేదని ఒప్పుకోవాల్సిందే. అసలు UKకు ఇటువంటి పరిస్థితి వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

23.1 శాతం బయటోళ్లే..

UKలో పుట్టిన శిశువుల్లో దాదాపు 23.1 శాతం శిశువులు బయటి దేశం వారే కావడం గమనార్హం. వారు ఆ దేశంలోనే పుట్టి ఆ దేశ పౌరసత్వంతో జన్మించినా కానీ ఆ చిన్నారులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బయటి దేశం వారు కావడం గమనార్హం. ఈ లెక్క 2008వ సంవత్సరంలో 16.7 శాతంగా ఉండేది. కానీ ఈ ఏడాది వచ్చే సరికి ఈ నిష్పత్తి ఏకంగా 23.1 శాతానికి ఎగబాకింది. విదేశీయులు లేకపోతే అసలు దేశం పరిస్థితి ఎలా ఉండేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్ లో అన్ని దేశాల వారికి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ముందే మేల్కోకపోతే చాలా దారుణ పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన ఈ గణాంకాలు షాకింగ్ కు గురి చేస్తున్నాయి. విదేశీ తల్లిదండ్రులకు పుట్టిన వారి శిశువుల జనాభా పెరిగితే అదే సమయంలో బ్రిటీషర్లను జన్మించిన చిన్నారుల నిష్పత్తి 62 శాతం నుంచి 60.3 శాతానికి పడిపోయినట్లు ఈ నివేదిక వివరించింది. 

అది మంచి విషయమే..

UK సొంత దేశం తల్లిండ్రులకు పుట్టిన చిన్నారుల జనాభా నిష్పత్తి తగ్గిన వేళ.. వేరే దేశం వారికి పుట్టిన చిన్నారుల జనాభా నిష్పత్తి పెరగడం మంచి పరిణామం అని లండన్ లో ఉన్న కింగ్స్ కాలేజ్ ఆర్థిక శాస్త్రం మరియు పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ జొనథాన్ పోర్టెస్ అన్నారు. కానీ జననాల సంఖ్య తగ్గడం ఆందోళన కర విషయమని ఆయన తెలిపారు. ఈ సమస్య ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఉందని ఆయన తెలిపారు. అక్కడ జనాభా తగ్గుదల అనేది ఉద్యోగాలకు ఢోకా లేదనే విషయాన్ని సూచిస్తుంది. కానీ అదే సమయంలో బ్రిటీష్ దేశానికి అనేక మంది వలస వస్తున్నారు. ఈ నేపథ్యంలో వలస వచ్చిన వారు ఆ ఉద్యోగాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాదే అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

ఆ లెక్కకు ఇంకా సరిపోలేదు.. 

ప్రస్తుతం దేశంలో పదవీ విరమణ చేస్తున్న వారితో పోల్చుకుంటే పుట్టిన పిల్లల నిష్పత్తి సరిపోలేదని మైగ్రేషన్ అబ్జర్వేటరీ ఇటీవల చేసిన సర్వేలో వెల్లడైంది. దీంతో అంతా ఆందోళన చెందుతున్నారు. మైగ్రేషన్ అబ్జర్వేటరీకి చెందిన పరిశోధకులు నుని జోర్గెన్ సన్ మాట్లాడుతూ… రీప్లేస్‌మెంట్ లెవల్ ఫెర్టిలిటీ లేదా పాత తరన్ని భర్తీ చేసేందుకు ప్రతి స్త్రీ కనాల్సిన పిల్లల సంఖ్య 2.1 అని ఆమె తెలిపారు. విదేశాలకు చెందిన తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల సంఖ్య గత సంవత్సరం 139,953 ఉండగా.. అంతకు ముందు ఏడాది 134,308గా ఉండేది. ప్రతి ఏడాది ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సంఖ్య పెరుగుతూ పెరుగుతూ 2017 నుంచి అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. ఇదే సమయంలో ఇద్దరు పిల్లలున్న యూకే తల్లిదండ్రుల సంఖయ 365,111కి పడిపోయిందని ఈ డేటా వెల్లడిస్తుంది. ఈ విషయాలు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ఇలా ఏటికేడు జనాభా పడిపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.