పెళ్లికి నో అంటున్న చైనా యువ‌త‌

చైనా దేశం లో నిరుద్యోగులకు ప్రతీ నెల డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంది. దీనితో ఇల్లు గడిచిపోతుంది కదా, ఇక ఎలాంటి ఒత్తిడులు లేకుండా కుర్ర అబ్బాయిలు లేదా అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ద పడిపోతారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మనం ఊహించిన దానికి పూర్తిగా బిన్నంగా ఉంది ఉదాహరణకి రీసెంట్ గా జింగ్యు హౌ అనే అమ్మాయి మాట్లాడిన మాటలను పరిగణలోకి తీసుకునే , ఈ అమ్మాయికి పెళ్లి అనేది […]

Share:

చైనా దేశం లో నిరుద్యోగులకు ప్రతీ నెల డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంది. దీనితో ఇల్లు గడిచిపోతుంది కదా, ఇక ఎలాంటి ఒత్తిడులు లేకుండా కుర్ర అబ్బాయిలు లేదా అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ద పడిపోతారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మనం ఊహించిన దానికి పూర్తిగా బిన్నంగా ఉంది ఉదాహరణకి రీసెంట్ గా జింగ్యు హౌ అనే అమ్మాయి మాట్లాడిన మాటలను పరిగణలోకి తీసుకునే , ఈ అమ్మాయికి పెళ్లి అనేది అతి ముఖ్యమైనది కాదట. ఒక స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న ఈ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు గడిచిన మూడేళ్ళ నుండి 20 సంబంధాలు చూశారట. ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పటికే ఈ 29 ఏళ్ళ వయస్సు ఉన్న అమ్మాయి, తనకి వయసు అయిపోతుంది, పెళ్లి కొడుకు దొరకదేమో అనే భయమే లేదట, ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మ్యారేజ్ అనేది ఫ్రీడమ్ కి ప్రతీక లాగ ఉండాలి,ప్రతీ ఒక్కరు వెంటనే పెళ్లి చేసేసుకోవాలి అర్జెంటు గా అని ఎక్కడ రూల్ లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

గడిచిన 37 ఏళ్ళల్లో ఇంత తక్కువ పెళ్లిళ్లు చైనా దేశం లో జరగలేదు :

మరో విశేషం ఏమిటంటే ఆ అమ్మాయి సింగల్ కాదు, ఇప్పటికే ఆమెకి ఒక ప్రేమికుడు ఉన్నాడు. అయితే రీసెంట్ గా చైనా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ అఫైర్స్ జూన్ నెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం , గడిచిన 37 సంవత్సరాలలో చైనా లో రిజిస్టర్ అయినా పెళ్లిళ్ల సంఖ్య తో పోలిస్తే ఈ ఏడాది చాలా తక్కువ నమోదు అయ్యిందని ఆ నివేదిక లో చెప్పుకొచ్చింది. ముఖ్యంగా గడిచిన 8 ఏళ్లుగా ఈ పెళ్లిళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చి, ఈ ఏడాది పాతాళ లోకంలోకి పడిపోయింది. ఇక గత ఏడాది కేవలం 68 లక్షల మంది మాత్రమే పెళ్లి చేసుకున్నారట. ఇది ఇలా ఉండగా చైనా లో పెరుగుతున్న యువకుల సంఖ్య, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళలో 1990 దశకం తో పోలిస్తే 2000 దశకం చాలా తేడా గా ఉందట. చైనా సెన్సస్ ఇయర్ బుక్ ని ఒక్కసారి పరిశీలిస్తే , మొదటి వివాహాల సంఖ్య యావరేజిగా 2020 వ సంవత్సరం లో 28 ఏళ్ళ వయస్సులో చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారట. అంటే ఇది 2010 వ సంవత్సరం కంటే నాలుగు సంవత్సరాల ముందు ఉండే రిపోర్ట్స్ తో సమానం అట.

పెళ్లి కంటే పనే ముఖ్యం :

ఏ లియు అనే సీనియర్ లెక్చరర్ ఈ విషయంపై మాట్లాడుతూ, ఈమధ్య పని చేసే చోట్ల జెండర్ ఇన్ ఈక్వాలిటీ అనేది బాగా పెర్టిగిపోయింది మన చైనా దేశం లో, పని మీద మక్కువ తో గర్భం దాల్చిన సమయం లో మెటర్నిటీ లీవ్ క్రింద ఎక్కడ సెలవలు పెట్టాల్సి వస్తుందో అని ఆడవాళ్లు పెళ్లిళ్లు చేసుకోవట్లేదు. ముఖ్యంగా యువతిలు విద్య మరియు ఉద్యోగం పైనే ఎక్కువ ద్రుష్టి సారిస్తున్నారు. క్రిస్టీ అనే ఒక్క అమ్మాయి మాట్లాడుతూ ‘నాకు ఇప్పుడు పెళ్లి అనేది అవసరం లేదు, నాకు జీవితం లో చాలా లక్ష్యాలు ఉన్నాయి. అవి ఛేదించడానికి పెళ్లి నాకు అడ్డు కాకూడదు. అందుకే నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు’ అంటూ ఈ పాతికేళ్ల అమ్మాయి చెప్పుకొచ్చింది. అక్కడ పని చేసే వారిలో ఎక్కువ శాతం ఇదే మైండ్ సెట్ తో ఉంటున్నారు, అందుకే పెళ్లిళ్ల సంఖ్య ప్రతీ ఏటా తగ్గిపోతూ వెళ్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.