చావు బతుకుల్లో ఉన్న భార్య అసాధారణ కోరిక

చావు బతుకుల్లో ఉన్నది ఆమె.. జీవితంలో కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి.. ఈ సమయంలో ఆమెను దగ్గరుండి చూసుకోవాలని అనుకున్నాడు భర్త. తన భార్య కోరికలను తీర్చాలనుకున్నాడు. ప్రాణంలా ప్రేమించిన భార్యను ప్రేమగానే సాగనంపుదామనుకున్నాడు. కానీ తన భార్య అసాధారణ కోరిక కోరింది. తన భార్య అడిగిన దాన్ని  కాదనలేడు.. ఔననలేడు.. అంతటి విపత్కర పరిస్థితి. ఇంతకీ ఆమె అడిగినదేంటి? అతడి పరిస్థితేంటి? భార్య కోరికను నెరవేర్చాడా? బతికేది తొమ్మిది నెలలే ఎవ్వరితోనూ పంచుకోలేని విషయాన్ని పంచుకున్నాడు […]

Share:

చావు బతుకుల్లో ఉన్నది ఆమె.. జీవితంలో కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి.. ఈ సమయంలో ఆమెను దగ్గరుండి చూసుకోవాలని అనుకున్నాడు భర్త. తన భార్య కోరికలను తీర్చాలనుకున్నాడు. ప్రాణంలా ప్రేమించిన భార్యను ప్రేమగానే సాగనంపుదామనుకున్నాడు. కానీ తన భార్య అసాధారణ కోరిక కోరింది. తన భార్య అడిగిన దాన్ని  కాదనలేడు.. ఔననలేడు.. అంతటి విపత్కర పరిస్థితి. ఇంతకీ ఆమె అడిగినదేంటి? అతడి పరిస్థితేంటి? భార్య కోరికను నెరవేర్చాడా?

బతికేది తొమ్మిది నెలలే

ఎవ్వరితోనూ పంచుకోలేని విషయాన్ని పంచుకున్నాడు ఓ గుర్తుతెలియని భర్త. రెడిట్‌లో ఈ మేరకు తన కథను షేర్ చేసుకున్నాడు. ‘‘పదేళ్ల కిందట మాకు పెళ్లి అయింది. నా భార్య ఇప్పుడు చావు బతుకులతో పోరాడుతోంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. మహా అయితే 9 నెలలు బతుకుతుందేమో. అందుకే తన కోరికలన్నింటినీ తీర్చాలని అనుకున్నాను. తన చివరి రోజుల్లో సంతోషంగా చూసుకోవాలని భావించాను” అని వివరించాడు. ‘‘ఆరోగ్యం క్షీణిస్తుండటంతో మంచాన పరిస్థితి వస్తుందని తాను భావించింది. ఆ లోపు తాను తీర్చుకోవాల్సిన కోరిక గురించి చెప్పింది” అని చెప్పాడు. తన భార్య ఒక అసాధారణ విషయాన్ని అడిగిందని తెలిపాడు.

అతడితో పడుకోవాలని ఉందట

‘‘చివరి సారిగా తన మాజీ భాగస్వామితో పడుకోవాలని ఉందని తను అడిగింది. తనకు శారీరకంగా అత్యంత అనుకూలమైన, సంతృప్తికరమైన ప్రేమికుడు అతడేనని ఆమె భావిస్తోంది. శృంగారం కొన్ని సార్లు కేవలం శారీరక బంధంగానే ఎలా ఉంటుంది? నాతో మానసికంగా సెక్స్ ఎంత సంతృప్తికరంగా ఉంటుంది? అనే విషయాలను పూసగుచ్చి చెప్పింది”  అని రాసుకొచ్చాడు.

ఆమె అడిగిన ఆ షాకింగ్ కోరిక తనను అయోమయంలో పడేసిందని అతడు చెప్పాడు. తన భార్య అడిగిన దాన్ని అంగీకరించేందుకు తన అహం అడ్డువస్తోందని, కానీ ఒప్పుకోకుండా ఉండలేనని అతడు అన్నాడు. తాను ప్రాణంగా ప్రేమించిన భార్యను ఇంకో వ్యక్తితో పడుకోబెట్టలేనని బాధను వ్యక్తం చేశాడు. ఆ ఆలోచనే మనసులోకి వస్తుంటేనే ఎంతో కష్టంగా ఉందని వాపోయాడు.

ఔననలేని.. కాదనలేను..

‘‘ఆమె చావుబతుకుల్లో ఉంది. ఆమె కోరికను ఒప్పుకోవాల్సిన పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఔననలేను.. కాదనలేను.. ఈ పరిస్థితి నన్ను చాలా బాధించింది. నేను చాలా బాధపడ్డాను. తన మాజీ భాగస్వామితో శృంగారం చేయడం తనకు బాగుంటుంది కాబట్టి, చనిపోయే ముందు ఒకసారి అతడి పడుకోవాలని తను అనుకుంది. ఈ విషయాన్ని నేను ఎంతో ద్వేషిస్తున్నా” అని ముగించాడు. అయితే తన భార్య చివరి కోరికను తీర్చాడా లేదా? ఆమె ఏం సమాధానమిచ్చాడు? ఆమె ఏమైంది? ఇంకా బతికే ఉందా? అనే వివరాలేవీ అతడు వెల్లడించలేదు. 

నెటిజన్ల ఫైర్

అతడు రెడిట్‌లో షేర్ చేసిన ఈ విషయంపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఎలాంటి కష్టం వచ్చింది నీకు?’, ‘నేనైతే ఆమె కోరికను ఒప్పుకునే వాడిని కాదు’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదంతా నిజమైతే.. ఆమెకు విడాకులు ఇచ్చేయి. బతికినన్ని రోజులు సంతోషంగా బతకమని, శాంతితో, సంతోషంతో చనిపోమని చెప్పు” అని ఓ యూజర్ రాసుకొచ్చారు. ‘‘ఆమె కోరుకున్నది చేయవచ్చని నేను ఆమెకు చెబుతాను. కానీ నేను నా ఉంగరాన్ని ఆమెకు ఇచ్చి ఇంటి నుంచి వెళ్లిపోతాను. తిరిగి ఎన్నటికీ రాను. కష్టకాలంలో పరిస్థితిని మరింత దిగజార్చింది ఆమె. మీరు ఆమె చెప్పినట్లు వింటారని అనుకుంది” అని విమర్శిచారు. మీ భార్య కోరిక కృతజ్ఞత లేనిది, దారుణమైనదని మరోకొరు మండిపడ్డారు.