North Korea: జపాన్ (Japan) లో నివసిస్తున్న జనాభా కు ఎప్పుడు ఏం ముంచుకు వస్తుందో భయభ్రాంతులతో బ్రతుకుతూ ఉంటారని చాలామంది అభిప్రాయం. మరి ముఖ్యంగా జపాన్ (Japan) లో సంభవించే భూకంపాలు కారణంగా చాలామంది వేరే ప్రాంతాలకు తరలి వెళ్తున్న క్రమం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా నార్త్ కొరియా (North Korea) నుంచి హఠాత్తుగా దూసుకు వస్తున్న మిస్సైల్ (missile) కారణంగా, జపాన్ (Japan) ఒకినావాలోని దక్షిణ ప్రాంత నివాసితుల తరలింపు జరుగుతుందని హెచ్చరించడం జరిగింది.
ప్రపంచ దేశాలు ఒకవైపు నార్త్ కొరియా (North Korea) ఒకవైపు అనే విధంగా ఉంటుంది. అయితే నార్త్ కొరియా (North Korea) మిస్సైల్ (missile) లాంచ్ లో భాగంగా మిస్సైల్ (missile) ప్రయోగం జరిపినట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ అధ్యక్ష కార్యాలయం నుంచి అధికారి ఫ్యూమియో కిషిడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఇటువంటి హెచ్చరికలు జారీ చేసిన అనంతరం సుమారు 22:55 (1355 GMT) సమయంలో, మిస్సైల్ (missile) అనేది పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రవేశించినట్లు భావించి తరలింపులు రద్దు చేయడం జరిగింది. మిలిటరీ గూఢచారి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఉత్తర కొరియా మంగళవారం మూడో ప్రయత్నం చేసిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ కు నార్త్ కొరియా (North Korea) మధ్య ఉద్రిక్తతలు మధ్య అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థను నిర్మించాలనే ఉత్తర కొరియా సంకల్పానికి ఈ ప్రయోగం తాజా నిదర్శనం.
నవంబర్ 22..డిసెంబర్ 1 మధ్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఉత్తర కొరియా మంగళవారం జపాన్ (Japan)కు తెలియజేసినప్పటికీ, అనుకున్నదానికంటే ముందుగానే ప్రయోగం జరిగింది. ప్రయోగం విజయవంతమైందో లేదో వెంటనే తెలియలేదు. కానీ యునైటెడ్ స్టేట్స్ అదేవిధంగా ఇతర దేశాల నుండి నార్త్ కొరియా (North Korea)కు హెచ్చరికలు రావడం ఖాయం, ఎందుకంటే U.N ఉత్తర కొరియాను ఉపగ్రహ ప్రయోగాలను నిర్వహించకుండా నిషేధించింది.
ఉత్తర కొరియా (North Korea) ఆసియాలో కఠిన శిక్ష (Punishment)లు, ఆంక్షలు (Rules) ఉన్న దేశం (Country). నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఆధ్వర్యంలో ఉత్తరకొరియా నడుస్తోంది. ఉత్తరకొరియా దేశం (Country) నిజానికి దాని ప్రత్యేకమైన నియమాలకు పెట్టింది పేరు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కడా చూడని భిన్నమైన కొన్ని వింత నియమాలు (rules) అక్కడ కనిపిస్తూ ఉంటాయి. నివేదికల ప్రకారం, ఉత్తర కొరియా (North Korea)లో ఒక వ్యక్తి దేశం (Country)లో నేరం (Crime) చేస్తే, ఆ వ్యక్తి మాత్రమే కాకుండా అతని తల్లిదండ్రులు, తాతలు, అదే విధంగా పిల్లలు కూడా చట్ట ప్రకారం శిక్ష (Punishment) విధిస్తారని తేలింది.
దేశం (Country)లో ఖైదీలు ఎవరూ తప్పించుకోకుండా కఠిన చట్టాన్ని రూపొందించడం ఒక ప్రధాన కారణం. దేశం (Country)లోని జైళ్లు, మహిళలను కూడా హింసించే విధంగా నిర్మించడం జరిగింది. ఖైదీలు శిలువపై కూర్చోవాలని, వారి చేతులు మోకాళ్లపై మాత్రమే ఉండేలా నియమం ఉంది. 12 గంటల వరకు కొత్తగా వచ్చిన ఖైదీలు ఎక్కడికి వెళ్లడానికి అనుమతి ఉండదు. చిన్న కదలికకు కూడా కఠినంగా శిక్ష (Punishment) విధిస్తారు. మొక్కజొన్న, నీరు మాత్రమే జైల్లో ఆహారంగా ఇస్తారు.
ఉత్తర కొరియా (North Korea)లో ఇలాంటి అనేక ఇతర వింత చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వం దేశం (Country)లో ఉండే ఆడవాళ్ళ కోసం, మగవాళ్ళ కోసం 28 హెయిర్ స్టైల్‌లను ఫిక్స్ చేసింది. వీటిలో 18 మహిళలకు, 10 పురుషుల కోసం. దేశం (Country)లో ఎవరు కూడా, ఈ 28 హెయిర్ స్టైల్స్ తప్పిస్తే వేరే హెయిర్ స్టైల్ ట్రై చేయకూడదు. అంతే కాకుండా, ఉత్తర కొరియా (North Korea)లో ప్రజలు కేవలం 28 వెబ్‌సైట్‌లను మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కంప్యూటర్ కొనుక్కోవాలంటే కచ్చితంగా నిర్దిష్ట నియమాలు (rules) ఉన్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే కంప్యూటర్ కొనుక్కునే యాక్సిస్ ఉంటుంది.