సూడాన్‌లో అల్లర్లు – విమానాల నిలిపివేత

సూడాన్‌లో మళ్లీ అల్లర్లు జరిగాయి, ఈసారి సైన్యం మరియు శక్తివంతమైన పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో అనేక పేలుళ్లు, కాల్పుల శబ్ధాలు సంభవించాయి. సూడాన్ నుండి సౌదీ అరేబియాకు బయలుదేరిన ప్రయాణీకుల విమానం శనివారం ప్రమాదానికి గురైంది. రాజధాని ఖార్టూమ్‌లో కాల్పులు ఘోరంగా జరిగాయని పేర్కొన్న అధికారులు, ఈ కారణంగా విమానంపై కాల్పులు జరిగినట్లు రాజ్యానికి సంబంధించిన ఫ్లాగ్ క్యారియర్ సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సౌదీ అరేబియాలోని రియాద్‌కు  […]

Share:

సూడాన్‌లో మళ్లీ అల్లర్లు జరిగాయి, ఈసారి సైన్యం మరియు శక్తివంతమైన పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో అనేక పేలుళ్లు, కాల్పుల శబ్ధాలు సంభవించాయి. సూడాన్ నుండి సౌదీ అరేబియాకు బయలుదేరిన ప్రయాణీకుల విమానం శనివారం ప్రమాదానికి గురైంది. రాజధాని ఖార్టూమ్‌లో కాల్పులు ఘోరంగా జరిగాయని పేర్కొన్న అధికారులు, ఈ కారణంగా విమానంపై కాల్పులు జరిగినట్లు రాజ్యానికి సంబంధించిన ఫ్లాగ్ క్యారియర్ సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

సౌదీ అరేబియాలోని రియాద్‌కు  బయలుదేరే ముందు ఎయిర్‌బస్ A330లో ప్రయాణికులు, సిబ్బంది ఎక్కుతుండగా తుపాకీ కాల్పులకు గురైందని సౌదీ ఒక ప్రకటనలో తెలిపింది.

విమానంలోని  ప్రయాణికుకులు, క్యాబిన్ సిబ్బందితో సహా అందరూ సురక్షితంగా ఉన్నారని, వారందరినీ సూడాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయానికి సురక్షితంగా పంపించామని సౌదీ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

ఇంతలో సూడాన్  బయలు దేరడానికి సిద్ధంగా ఉన్న విమానాన్ని రద్దు చేసిన అధికారులు, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని.. మిగితా ఇతర విమానాలను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసినట్టు తెలిపారు. 

కాగా.. శనివారం, సూడాన్ సైన్యం మరియు పారామిలిటరీ గ్రూపుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో నగర కేంద్రంలోని ఖార్టూమ్‌ ఒకరు మరణించగా, ముగ్గురు సాధారణ పౌరులు మరణించారని వైద్యుల సంఘం పేర్కొంది.

అయితే.. సౌదియా ప్రకటనలో మాత్రం..  తమా విమానానికి సంబంధించిన సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం గురించి ప్రస్తావించలేదు.

పారామిలిటరీలు మాత్రం.. విమానాశ్రయంతో పాటు అధ్యక్షుడి కార్యాలయం, అధికారిక నివాసం  తమ నియంత్రణలో ఉన్నారని పేర్కొండి, అయితే సైన్యం మాత్రం వ్యాఖ్యలను ఖండించింది.

పారామిలిటరీ కి చెందిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF)ని సాధారణ సైన్యంలోకి చేర్చడం గురించి సైన్యం నాయకుడు అబ్దేల్ ఫత్తా అల్-బుర్హాన్ మరియు అతని సెకండ్-ఇన్-కమాండ్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో గత వారం రోజులుగా విభేదాలు రావడంతో హింస మొదలైంది.

దేశాన్ని పౌర పాలనకు తిరిగి ఇచ్చే ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మరియు వారి 2021 తిరుగుబాటు ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ముగించడానికి ఈ ముఖ్యమయిన చర్చలు జరిగాయి. ఈ ఒప్పందం దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు ప్రజలకు మంచి చేయడానికి సహాయపడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

“సూడాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయంసౌదీ పౌరులందరినీ ఇంట్లోనే ఉండాలని కోరింది” అని రాష్ట్ర అనుబంధ అల్-ఎఖ్‌బరియా ఛానెల్ నివేదించింది.

సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు రియాద్‌లో ప్రధాన కార్యాలయంగా ఉన్న ఆరుగురు సభ్యుల గల్ఫ్ సహకార మండలి, శనివారం నాటి హింస గురించి ఆందోళన చేస్తూ ప్రకటనలు విడుదల చేశాయి.

కాగా.. సూడాన్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఆల్బర్ట్ అగస్టిన్ అనే ఓ భారతీయుడు బుల్లెట్ గాయాలతో మరణించాడని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. తదుపరి ఏర్పాట్లపై మృతుల కుటుంబ సభ్యులతో, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ ప్రకటనలో అధికారులు తెలిపారు. అయితే.. ఆల్బర్ట్ కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

రాజధాని ఖార్టూమ్‌తో సహా పలు చోట్ల బాంబులు, కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 56 మంది మరణించినట్లు సమాచారం. కానీ అధికారంగా ఇంకా ప్రకటించలేదు.