ఏలియన్స్‌ గురించి సంచలన ప్రకటన చేసిన బ్రిటన్ వ్యక్తి!

ఏలియన్స్‌ నిజంగానే ఉన్నాయా? అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్టు (యూఎఫ్‌వో)లు కనిపించడం నిజమేనా? ఈ చర్చ ఇప్పటిదికాదు.. ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో కథలు, ఇంకెన్నో పుకార్లు. ఏలియన్స్‌ ఉన్నాయని, వాటికి ఆధారాలు చూపిస్తామని చెప్పేవాళ్లు ఎందరో!! ఇదే సమయంలో అలాంటిదేమీ లేదని, అన్ని అవాస్తవాలేనని కొట్టిపారేసే వాళ్లు ఇంకెందరో. ఈ నేపథ్యంలో ఓ బ్రిటీష్ వ్యక్తి సంచలన ప్రకటన చేశాడు.  20 ఏళ్ల పరిశోధన అమెరికా వద్ద యూఎఫ్‌వోలు ఉన్నాయని, ‘నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌’ను అమెరికా దాచిపెడుతున్నదని […]

Share:

ఏలియన్స్‌ నిజంగానే ఉన్నాయా? అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్టు (యూఎఫ్‌వో)లు కనిపించడం నిజమేనా? ఈ చర్చ ఇప్పటిదికాదు.. ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో కథలు, ఇంకెన్నో పుకార్లు. ఏలియన్స్‌ ఉన్నాయని, వాటికి ఆధారాలు చూపిస్తామని చెప్పేవాళ్లు ఎందరో!! ఇదే సమయంలో అలాంటిదేమీ లేదని, అన్ని అవాస్తవాలేనని కొట్టిపారేసే వాళ్లు ఇంకెందరో. ఈ నేపథ్యంలో ఓ బ్రిటీష్ వ్యక్తి సంచలన ప్రకటన చేశాడు. 

20 ఏళ్ల పరిశోధన

అమెరికా వద్ద యూఎఫ్‌వోలు ఉన్నాయని, ‘నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్‌’ను అమెరికా దాచిపెడుతున్నదని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్‌లోని నార్త్ యార్క్‌షైర్‌‌కు చెందిన రస్సెల్‌ కెల్లెట్ స్పందించాడు. తన పరిశోధనలో తేలిన విషయాలను ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. 

1970 సెప్టెంబర్‌‌లో యార్క్‌షైర్‌‌లోని ఫైలీ బీచ్‌ దగ్గర్లో ఓ విమానం కూలిపోయింది. అందులో ఆర్‌‌ఏఎఫ్‌ పైలట్ విలియమ్ స్కాఫ్‌నర్ ఉన్నాడు. ఓ యూఎఫ్‌వోను వెంటాడుతుండగా విమానం కూలిపోయినట్లు వార్తలు వచ్చాయి. మూడు నెలల తర్వాత విమానాన్ని రికవర్ చేసినా.. పైలట్ విలియమ్ స్కాఫ్‌నర్ బాడీ మాత్రం దొరకలేదు. దీంతో యూఎఫ్‌వో నిజమేనని, విలియమ్‌ను ఏలియన్స్ ఎత్తుకెళ్లారని వార్తలు వచ్చాయి. ‘‘నేను ఆ ప్రాంతానికి 20 ఏళ్లుగా వెళ్తున్నా. అక్కడ నీటిలో నుంచి వస్తున్న వాటిని వీడియోలు/ఫొటోలు తీసుకుంటున్నా. ఫుటేజీలో రెండు క్రాఫ్ట్‌లు సముద్రంలో ఉన్నట్లు కనిపించాయి. అవి ఎగురుతున్న త్రిభుజాలు. అవి రోడ్డుకు దగ్గరగానూ ఉన్నాయి” అని కెల్లెట్ తెలిపాడు. ‘‘అవి ఏంటనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అవి విమానాలు లేదా పడవలు కావచ్చని ప్రజలు చెప్పారు. కానీ అలా జరిగేందుకు అవకాశమే లేదు” అని అన్నాడు. ఇదే సమయంలో జెట్ ఫైటర్లు, విమానాల మాదిరి ఆ క్రాఫ్టులు ఎలాంటి శబ్దం చేయలేదని చెప్పాడు. 

నీళ్లలో ఏలియన్ బేస్ ఉండొచ్చు

‘‘ఫైలీ బీచ్‌లో తీరానికి దగ్గర్లో నీటి అడుగున గ్రహాంతరవాసుల స్థావరం ఉంటుందని నా పరిశోధన ఆధారంగా నేను నిర్ధారణకు వచ్చాను. 1970లో సముద్రంలో విమానం కూలిన సమయంలో పైలట్‌ను గ్రహాంతరవాసులు ఎత్తుకెళ్లారన్నది నా అభిప్రాయం. నీటి అడుగున స్థావరానికి ఉందని, ఈ ఘటనకు దానితో సంబంధం ఉందని నేను నమ్ముతున్నా” అని కెల్లెట్ వివరించాడు. ‘‘యూఎఫ్‌వోలు రాడార్‌‌లో కనిపించకుండా, ఎయిర్‌‌ఫోర్స్‌కు దొరక్కుండా వెళ్లగలవు. ఏలియన్లు ఉన్నారనే విషయాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు. అప్పుడప్పుడు భూమిపైకి వస్తున్నారని అనుకుంటున్నారు” అని చెప్పుకొచ్చాడు. కాగా, 2009లో అమెరికా రక్షణ శాఖ.. 1970లో పైలట్ మరణానికి యూఎఫ్ఓ కారణం కాదని చెప్పిది. అదొక ప్రమాదం మాత్రమేనని తెలిపింది.

ఇటీవల అమెరికా వైమానిక అధికారి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి డేవిడ్ గ్రష్ సంచలన వ్యాఖ్యలు  చేశారు. అమెరికా వద్ద ఓ ఏలియన్ ఎయిర్‌‌క్రాఫ్ట్‌ ఉందని చెప్పారు. అమెరికా వద్ద ఏలియన్ల శరీరాలు కూడా ఉన్నాయని ఆశ్చర్యకర ప్రకటన చేశారు. ఈ వ్యవహారినికి సంబంధించి అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా మల్టీ డెకేడ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిందని వెల్లడించారు. క్రాష్ అయిన యూఎఫ్‌వోను రివర్స్ ఇంజనీరింగ్ చేసినట్లు తెలిపారు. మరోవైపు అమెరికా యూఎఫ్‌వోలపై కొన్ని సీక్రెట్ ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌కు చెందిన రస్సెల్‌ కెల్లెట్ తాజాగా వీడియోను రిలీజ్ చేసి.. తన పరిశోధనలను బయటపెట్టాడు. 

అయితే డేవిడ్ గ్రష్ చెబుతున్నట్లుగా తమ దగ్గర ఎలాంటి యూఎఫ్‌వో లేదని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. తమ దగ్గర ఏలియన్ బాడీస్ లేవని, రివర్స్ ఇంజనీరింగ్ చేసిన దాఖలాలు కూడా లేవని స్పష్టం చేసింది. గతంలోనూ ఇలాంటివి ప్రభుత్వం చేయలేదని పేర్కొంది.