బ్రిటన్ బెస్ట్ డ్రెస్డ్ మ‌హిళ‌గా అక్ష‌తా మూర్తి

అక్షతా మూర్తి అంటే ప్రస్తుతం తెలియని వ్యక్తి లేరని చెప్పుకోవచ్చు. యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ భార్య అక్షతా మూర్తి. తాను బ్రిటన్ లోనే బెస్ట్ డ్రెస్సింగ్ వ్యక్తిగా పేరుగాంచింది. అంతేకాదు బ్రిటన్ కి సంబంధించిన టట్లర్ మ్యాగజిన్ అక్ష‌తా మూర్తి గురించి స్పష్టంగా వివరించారు.  డిజైనర్ అక్షతా మూర్తి:  అయితే, అక్షితమూర్తి ప్రస్తుతం బెస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. యూకే ప్రైమ్ మినిస్టర్ భార్య అక్షతమూర్తి, 43 సంవత్సరాల కోటీశ్వరురాలు, […]

Share:

అక్షతా మూర్తి అంటే ప్రస్తుతం తెలియని వ్యక్తి లేరని చెప్పుకోవచ్చు. యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ భార్య అక్షతా మూర్తి. తాను బ్రిటన్ లోనే బెస్ట్ డ్రెస్సింగ్ వ్యక్తిగా పేరుగాంచింది. అంతేకాదు బ్రిటన్ కి సంబంధించిన టట్లర్ మ్యాగజిన్ అక్ష‌తా మూర్తి గురించి స్పష్టంగా వివరించారు. 

డిజైనర్ అక్షతా మూర్తి: 

అయితే, అక్షితమూర్తి ప్రస్తుతం బెస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. యూకే ప్రైమ్ మినిస్టర్ భార్య అక్షతమూర్తి, 43 సంవత్సరాల కోటీశ్వరురాలు, అంతేకాకుండా ఫ్యాషన్ డిజైనర్. అయితే ప్రస్తుతం ఆమె డ్రెస్సింగ్ స్టైల్ లో అదరగొట్టింది. అంతే కాకుండా టట్లర్ మాక్సిన్ లో ఆమె గురించి ప్రత్యేకించి వాక్యానించారు. ముఖ్యంగా టట్లర్ స్టైల్ ఎడిటర్, ఆమె ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అని, మోడ్రన్ రోజుల్లో ఆమె డిప్లొమాటిక్ గొప్ప డ్రెస్సింగ్ స్టైల్ అందరి మనసుల్ని దోచుందని చెప్పుకొచ్చారు. అయితే అక్షతా మూర్తికి ఈ ఘనత దక్కడం కొత్తవి కాదు. ఫ్యాషన్ డిజైనర్ గా పేరుగాంచిన అక్షత మూర్తి ఇంతకుముందు కూడా తను డ్రెస్సింగ్ స్టైల్ తో అందరి మనసును దోచుకుంది. 

బెస్ట్ డ్రెస్సింగ్ ఆమెదే: 

బ్రిటన్‌కు చెందిన ప్రతిష్టాత్మకమైన టాట్లర్ మ్యాగజైన్, 2023 సంవత్సరానికి బ్రిటన్‌లోని గొప్ప డ్రెస్సింగ్ స్టైల్  వార్షిక లిఫ్ట్ విడుదల చేసింది. UK ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య మరియు ప్రఖ్యాత భారతీయ పారిశ్రామికవేత్త నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి గౌరవనీయమైన నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం ప్రతి ఒక్కరికి అద్భుతంగా అనిపించింది.

“ఫస్ట్ లేడీ ఫ్యాబులస్”గా ప్రస్తుతం పేరుగాంచిన అక్షతా మూర్తికి సంబంధించిన ఫ్యాషన్ సెన్స్ టాట్లర్‌లోని స్టైల్ ఎడిటర్ని సైతం ఆకట్టుకుంది. ఆమె 21వ సంచురీలో గ్లామర్ లేడీగా, బెస్ట్ డ్రెస్సింగ్ లేడీగా ప్రశంసలు అందుకుంది.

జపాన్‌లో జరిగిన G7 సమ్మిట్‌లో అక్షత కనిపించడం ఫ్యాషన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అద్భుతమైన క్షణాలలో ఒకటి. ఆమె తన భర్త రిషి సునక్‌తో కలిసి పింక్ టాప్ మరియు గ్రీన్ ప్యాంటుతో స్టైలిష్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో కింగ్ చార్లెస్ పట్టాభిషేకంలో ఆమె బెస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ మళ్లీ అందరిని ఆకర్షితుల్ని చేసింది. అక్కడ ఆమె అందమైన బ్లూ డ్రెస్ లో ఆకర్షణీయంగా కనిపించింది.

ఆ తర్వాత యానా పీల్ ప్రతిష్టాత్మక లిస్ట్లో రెండవ స్థానాన్ని సంపాదించింది. సంస్కృతిని ప్రతిభంబించే గ్లోబల్ హెడ్, ఆమె ఎక్కడికి వెళ్లినా “అద్భుతమైన ఎగ్జాంపుల్” అని ప్రశంసించారు. మూడవ స్థానంలో ఉన్నది కరోలిన్ ప్రింరోస్, లేడీ డాల్మేనీ.

గౌరవనీయమైన టాప్-10 లిస్ట్ లో మోడల్ సారా రోజ్ హాన్‌బరీ, టైలర్ డొమినిక్ సెబాగ్-మాంటెఫియోర్, సోషలైట్ ఒలివియా బకింగ్‌హామ్, ఒపెరా సింగర్ డేనియెల్ డి నీస్, ప్రాపర్టీ డెవలపర్ ఎడోర్డో మాపెల్లి మోజ్జీ, బహుముఖ నటుడు బిల్ నైజీ మరియు ప్రతిభావంతులైన జ్యువెలరీ డిజైన్‌లు కూడా ఉన్నారు. .

అక్షితమూర్తి గురించి ఇంకా చెప్పాలంటే ఆమె 43 సంవత్సరాల బ్రిటన్ ఫ్యాషన్ డిజైనర్ అలాగే ఒక బిజినెస్ వుమెన్ కూడా. ఆమె తల్లిదండ్రులు మరి ఎవరో కాదు భారతదేశంలోనే అత్యంత పేరుగాంచిన ఇన్ఫోసిస్ ఫౌండర్స్ లో ఒకరైన నారాయణమూర్తి ఆయన భార్య సుధా మూర్తి.