18 సంవత్సరాల తరువాత అతిపెద్ద అణురియాక్టర్ ప్రారంభించిన ఫిన్లాండ్‌

విద్యుత్ కొరత కల్గి ఉన్న దేశాల్లో నార్దిక్ దేశమైన మెుదటి స్థానంలో ఉంది. ఉత్తర యూరప్ భాగంలో ఉండే దేశాలను నార్డిక్ దేశాలని అంటారు. ఈ ఫిన్లాండ్‌ దేశంలో విద్యుత్ స్టార్టప్‌లు ప్రారంభించడం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫిన్లాండ్‌లో నిర్మిస్తున్నటువంటి OL3 అణు రియాక్టర్ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. కాగా దినిని ఐరోపాలో అతి పెద్ద అణు రియాక్టర్‌గా చెప్పవచ్చు. ఆలస్యం అయిన Olkiluoto 3 (OL3) అణు రియాక్టర్ […]

Share:

విద్యుత్ కొరత కల్గి ఉన్న దేశాల్లో నార్దిక్ దేశమైన మెుదటి స్థానంలో ఉంది. ఉత్తర యూరప్ భాగంలో ఉండే దేశాలను నార్డిక్ దేశాలని అంటారు. ఈ ఫిన్లాండ్‌ దేశంలో విద్యుత్ స్టార్టప్‌లు ప్రారంభించడం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఫిన్లాండ్‌లో నిర్మిస్తున్నటువంటి OL3 అణు రియాక్టర్ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. కాగా దినిని ఐరోపాలో అతి పెద్ద అణు రియాక్టర్‌గా చెప్పవచ్చు. ఆలస్యం అయిన Olkiluoto 3 (OL3) అణు రియాక్టర్ ఆదివారం నుండి రెగ్యూలర్ అవుట్‌పుట్‌ను ప్రారంభిస్తుందని దాని ఆపరేటర్ శనివారం తెలిపారు. అదే విధంగా రష్యా గ్యాస్ మరియు విద్యుత్ సరఫరాలను తగ్గించిన ప్రాంతంలో ఇది ఇంధన భద్రతను పెంచుతుందని ఆపరేటర్ అన్నారు.

ఐరోపాలో అణుశక్తి వివాదాస్పదంగా ఉండటంలో ప్రధానంగా భద్రతా కారణాల వల్ల, OL3 ప్రారంభానికి సంబంధించిన వార్తలు శనివారం రావడంతో జర్మనీ తన చివరి మూడు రియాక్టర్లను స్విచ్ ఆఫ్ చేశారు. అటు స్వీడన్, ఫ్రాన్స్, బ్రిటన్ మరియు ఇతరులు కొత్త అభివృద్ధిని ప్లాన్ చేస్తున్నారు.

OL3 యొక్క ఆపరేటర్ టెయోల్లిసుడెన్ వోయిమా (TVO), ఇది ఫిన్నిష్ యుటిలిటీ ఫోర్టమ్ మరియు ఎనర్జీ, ఇండస్ట్రియల్ కంపెనీల కన్సార్టియం యాజమాన్యంలో ఉంది. ఈ యూనిట్ ఫిన్‌లాండ్ యొక్క విద్యుత్ డిమాండ్‌లో 14% వరకు చేరుకుంటుందని, స్వీడన్ మరియు నార్వే నుండి దిగుమతుల అవసరాన్ని తగ్గించవచ్చని అంచనా వేసింది.

1.6 గిగావాట్ సామర్థ్యము కలిగిన (Giga Watt) రియాక్టర్ నిర్మాణం, ఫిన్‌లాండ్‌ దేశంలో నాలుగు దశాబ్దాలలో మొదటి కొత్త అణు కర్మాగారం ఇది. కాగా.. 16 సంవత్సరాలలో యూరప్‌లో మొదటి రియాక్టర్ అని చెప్పవచ్చు. అయితే ఇది 2005లో ప్రారంభమైంది. వాస్తవానికి ఈ ప్లాంట్‌ను నాలుగు సంవత్సరాల తర్వాత ఓపెన్ అవ్వాల్సింది. కానీ సాంకేతిక సమస్యలతో ఆలస్యం అయింది.

OL3 గత సంవత్సరం మార్చిలో దాని ఉత్పత్తిలో కొన్ని సమస్యలను ఎదుర్కొంది, అయితే ఇది నాలుగు నెలల తర్వాత సాధారణ స్థితికి వస్తుందని భావించారు. కానీ అది సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. కానీ దానికి బదులుగా అనేక నెలల పాటు బ్రేక్‌డౌన్‌లు, అంతరాయాలను ఎదుర్కొంది.

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా మాస్కో మరియు ఐరోపా మధ్య విస్తరించిన అగాధం యొక్క పర్యవసానంగా, తాను విక్రయించిన విద్యుత్‌కు బిల్లులు చెల్లించబడలేదని రష్యన్ యుటిలిటీ ఇంటర్ రావ్ గత మేలో ఫిన్‌లాండ్‌కు రష్యా యొక్క విద్యుత్ ఎగుమతులు ముగిశాయి.

ఫిన్లాండ్.. ఈ దేశాన్ని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్ గా పిలుస్తారు. ఇది ఉత్తర ఐరోపాలోని ఒక నార్డిక్ దేశం. ఇది 5.6 మిలియన్ల జనాభా కలిగి 338,455 చదరపు కిలోమీటర్లు (130,678 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది. రాజధాని మరియు అతిపెద్ద నగరం అయిన హెల్సింకి రాజధానిగా ఉంది. కాగా.. జనాభాలో అత్యధికులు ఫిన్స్ జాతికి చెందినవారు. ఇక్కడ ఫిన్నిష్, స్వీడిష్ అధికారిక భాషలు.

1809లో ఫిన్నిష్ యుద్ధం ఫలితంగా ఫిన్లాండ్ స్వతంత్ర గ్రాండ్ డచీ ఆఫ్ ఫిన్లాండ్‌గా రష్యన్ సామ్రాజ్యంలో భాగమైంది.1906లో ఫిన్లాండ్ సార్వత్రిక ఓటు హక్కును మంజూరు చేసిన మొదటి యూరోపియన్ రాష్ట్రంగా అవతరించింది. 1917 రష్యా విప్లవం తరువాత, ఫిన్లాండ్ దేశం రష్యా నుండి స్వాతంత్ర్యం పొందింది. 

1950ల వరకు ఫిన్లాండ్ ఎక్కువగా వ్యవసాయ దేశంగా కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, పారిశ్రామికీకరణ చాలా వేగంగా అభివృద్ధి చెందింది.