నెలకు 10 లక్షల లాటరీ.. 30 ఏళ్ల పాటు డబ్బు

ఒక్క లాటరీ ఆమె జీవితాన్నే మార్చేసింది. నెల రోజులు కూర్చొని తిన్న అయిపోని డబ్బులు ఆమెకు వచ్చాయి. అలా 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షల చొప్పున 70 ఏళ్ల వృద్ధురాలికి జాక్‌పాట్‌ తగిలింది.  ఈ మధ్య కాలంలో కష్టపడి సంపాదించి కోటీశ్వరులు అయిన వాళ్ల కంటే లాటరీ తగిలి అదృష్టవంతులు అయిన వారే ఎక్కువగా ఉన్నారు. మనం ఊహించని వారికి లాటరీ తగిలి ఐశ్వర్యవంతులు అవుతుంటారు. డబ్బులు పెట్టి కొన్న లాటరీ కేవలం అదృష్టంతోనే […]

Share:

ఒక్క లాటరీ ఆమె జీవితాన్నే మార్చేసింది. నెల రోజులు కూర్చొని తిన్న అయిపోని డబ్బులు ఆమెకు వచ్చాయి. అలా 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షల చొప్పున 70 ఏళ్ల వృద్ధురాలికి జాక్‌పాట్‌ తగిలింది. 

ఈ మధ్య కాలంలో కష్టపడి సంపాదించి కోటీశ్వరులు అయిన వాళ్ల కంటే లాటరీ తగిలి అదృష్టవంతులు అయిన వారే ఎక్కువగా ఉన్నారు. మనం ఊహించని వారికి లాటరీ తగిలి ఐశ్వర్యవంతులు అవుతుంటారు. డబ్బులు పెట్టి కొన్న లాటరీ కేవలం అదృష్టంతోనే మనకు డబ్బులు తెచ్చిపెడుతుంది. అదృష్టం ఉంటేనే మనకు లాటరీ అనేది వచ్చి, లక్షాధికారులం అవుతాం.. ఒక్కోసారి కోటిశ్వరులు కూడా కావొచ్చు. ఇలాంటిదే  ఓ 70 ఏళ్ల వృద్ధురాలి కథ. ఆమెకు అదృష్టాన్ని తెచ్చి పెట్టింది ఎవరో కాదు.. ఓ సాలె పురుగు. 

అవునండీ.. ఇది నిజం.. సాధారణంగా మన ఇళ్లల్లో ఉండే సాలె పురుగు అనుకునేరు.. కాదు.. కాదు.. అదే జాతిలోని మరో రకానికి చెందిన సాలె పురుగు ఆమెకు కోట్లు తెచ్చిపెట్టింది. ఆ విషయం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ (యూకే–బ్రిటన్)కు చెందిన ఓ 70 ఏళ్ల మహిళకు లాటరీ రూపంలో అదృష్టం తగిలింది. ఇంగ్లండ్‌లోని డోర్కింగ్‌కు చెందిన డోరిస్‌ స్టాన్‌బ్రిడ్జ్‌ అనే మహిళా ఒక రోజు పొద్దున్నే లేవగానే, తన ఇంట్లో ‘మనీ స్పైడర్‌‌’ అనే సాలెపురుగును చూసింది. ఆ జాతి సాలె పురుగును యూకే వాసులు అదృష్టంగా భావిస్తారు. దీంతో స్టాన్‌బ్రిడ్జ్‌ కూడా అలాగే  భావించి, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే లాటరీ కొనాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే నేషనల్‌ లాటరీ యాప్‌ ద్వారా సెట్‌ ఫర్‌‌ లైఫ్‌ టికెట్‌ను ఆమె కొనుగోలు  చేసింది. లాటరీ కొన్న రోజే స్టాన్‌బ్రిడ్జి 70వ పుట్టిన రోజు కావడం గమనార్హం. 

ముందు నమ్మలేకపోయింది..

లాటరీ కొన్న కొన్నిరోజుల తర్వాత స్టాన్‌బ్రిడ్జ్‌కు నేషనల్‌ లాటరీ నుంచి ఒక ఈమెయిల్‌ వచ్చింది. అది చదవగానే ఆమెకు 10 పౌండ్ల చిన్న గిఫ్ట్‌ గెలుచుకున్నట్లు అనుకుంది. కానీ, 30 ఏళ్ల పాటు నెలకు 10 వేల పౌండ్లు (సుమారు రూ.10.37 లక్షలు)  గెలుచుకున్నట్లు ఆ ఈ మెయిల్‌లో ఉంది. ఒక్కసారిగా ఇది కలా.. నిజమా.. అని అనుకుంది. ఎందుకైన మంచిదని వచ్చిన ఈ మెయిల్‌ను  తన అల్లుడికి చూపించింది. అతను కూడా నెలకు 10 వేల పౌండ్లు లాటరీలో గెలుచుకున్నట్లు ఆమెకు చెప్పాడు. దీంతో స్టాన్‌బ్రిడ్జ్‌ ఆనందానికి  అవధుల్లేకుండా పోయాయి. ఆ మరుసటి రోజు ఉదయం నేషనల్‌ లాటరీ నుంచి అధికారిక ధ్రువీకరణ వచ్చింది. ప్రతి నెలకు 10 వేల పౌండ్లు, 30 ఏళ్ల పాటు లాటరీ గెలుచుకున్నట్లు చెబుతూ, ఆమెను విజేతగా ప్రకటించింది. 

100 ఏళ్లు బతకాలని ఉంది..

‘‘నేను నిజంగా లాటరీ గెలిచానా అనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కొంచెం వింతగా అనిపిస్తుంది. 30 సంవత్సరాల పాటు ప్రతి నెల ఆ డబ్బు నాకు వస్తుంది. ఈ విజయం నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. అందుకే నాకు 100 ఏళ్లు బతకాలని అనిపిస్తుంది” అని స్టాన్‌బ్రిడ్జ్ నేషనల్‌ లాటరీకి చెప్పింది.  

ఫ్యామిలీతో ఫారిన్‌లో గడపాలనుకుంటున్నా…

లాటరీ గెలుపొందినప్పటి నుంచి స్టాన్‌బ్రిడ్జ్, ఆమె భర్త బిజీబిజీగా అయిపోయారు. ఇప్పటికే పలు ఫంక్షన్లలో పాల్గొన్నారు. చాలా విందులకు అటెండ్‌  అవుతున్నారు. ఆమె తన ఫ్యామిలీతో కలిసి కార్న్‌వాల్‌లో హాలిడేను కూడా ఎంజాయ్‌ చేశారు. అలాగే, తమ 50 ఏళ్ల నాటి ఇంటిని తిరిగి నిర్మించుకోవాలనుకుంటున్నట్లు ఆ జంట యోచిస్తోంది. విదేశాల్లో తమ ఫ్యామిలీని సెలవులకు తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ ట్రిప్‌ ఫ్లైట్లో నా మనవడికి మొదటి ప్రయాణం అవుతుందని స్టాన్‌ బ్రిడ్జ్‌ అన్నారు. అలాగే స్విమ్మింగ్‌ పూల్‌తో పాటు ఎప్పుడూ సూర్యరశ్మి తగిలే ఇంటి కోసం చూస్తున్నామని చెప్పింది. ఆగస్టు 3న స్టాన్‌బ్రిడ్జ్‌ జీవితాన్ని మార్చివేసిన రోజు. ఆ రోజే ఆమెకు లాటరీ వచ్చి, వారి లైఫ్లో సంతోషాన్ని నింపింది.